Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బీఎండబ్ల్యూ గ్రూపు భారత మార్కెట్లోకి తన విలక్షణమైన 'స్పోర్ట్స్ యాక్టివిటీ కూపే'ను విడుదల చేసింది. పెట్రోల్, డీజిల్ ఇంజిన్ వర్షన్లలో దీన్ని రూపొందించింది. దీని ప్రారంభ ధర రూ.70.50 లక్షలుగా నిర్ణయించింది. మూడేండ్లు లేదా 40వేల కిలోమీటర్ల వరకు ఉచిత మెయింటనెన్స్ సర్వీసింగ్‌ను అందించనున్నట్టు తెలిపింది. కేవలం 6.6 సెకన్లలోనే 1-100 కిలోమీటర్ల వేగాన్ని పుంజుకోగలదని తెలిపింది.