Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దేశంలో జీవిత బీమా కొనుగోలుకు 70 శాతం మంది ఆసక్తి కనబర్చుతున్నారని లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ (ఎల్ఐసీ) సర్వేలో వెల్లడయ్యింది. ఈ సంస్థ ఇటీవల దేశ వ్యాప్తంగా 40 నగరాలలో దాదాపు 12వేల మంది ప్రజల అభిప్రాయాలను సేకరించింది. దురదృష్టకర సంఘటనల వేళ రక్షణ, భవిష్యత్‌కు ఆర్థిక భద్రత, కుటుంబ ఆర్థిక లక్ష్యాల చేరికలో భాగంగా బీమా ఉండాలని అత్యధిక మంది అభిప్రాయ పడ్డారు. అన్ని ప్రాంతాలు, వర్గాల ప్రజలు జీవిత బీమాను అతి ముఖ్యమైన ఆర్థిక ఉపకరణంగా భావిస్తున్నారు. దాదాపు 91 శాతం మంది జీవిత బీమా తీసుకోవడం అవసరమే అని పేర్కొన్నప్పటికీ.. 70 శాతం మంది మాత్రమే దీనిని తీసుకోవాలనుకోవడం విశేషం.