Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జేఈఈ, ఎన్ఈఈటీ తయారీ కోసం పూర్తి సంవత్సరం లైవ్ లెర్నింగ్ ప్యాక్స్ రూ. 21,998 నుండి ఆరంభం.
స్కూల్ బోర్డ్ పరీక్షలతో పాటు జేఈఈ మరియు ఎన్ఈఈటీ కోసం సమగ్రమైన తయారీ.
ఉత్తమమైన డిస్కౌంట్స్ తో ఎర్లీ బర్డ్ ఆఫర్స్ మరియు ఉపకారవేతనం పరీక్షలు.
హైదరాబాద్ : 10వ తరగతి నుండి 11వ తరగతికి మరియు 11వ తరగతి నుండి 12వ తరగతికి వెళ్లే విద్యార్థులు కోసం హింగ్లిష్ మరియు ఇంగ్లిష్ భాషలు రెండిటిలో కూడా జేఈఈ /ఎన్ఈఈటీ కోసం అల్టిమేట్ ప్యాక్ ఫర్ 2022-23 ని అమేజాన్ అకాడమీ ప్రకటించింది. లైవ్ తరగతులు, ఉన్నతమైన నాణ్యత గల కంటెంట్ మరియు డేటా విశ్లేషణ మద్దతు గల బోధనతో ఒక సమగ్రమైన తయారీని కేటాయించడం ద్వారా పోటీయుత పరీక్షలలో విద్యార్థులు అధికంగా స్కోర్ చేయడానికి సహాయపడే విధంగా ఏడాది పాటు ఉండే ఈ కోర్స్ రూపొందించబడింది. గతంలో ఉన్నత స్థాయిలో నిలిచిన జేఈఈ/ఎన్ఈఈటీ ర్యాంకర్స్ కో కోచింగ్ అందచేసిన ఉన్నతంగా రేట్ చేయబడిన నిపుణులైన బోధనా సిబ్బంది ద్వారా అమేజాన్ అకాడమీలో పరిశోధన ఆధారిత సవరణ కార్యక్రమం ద్వారా కూడా కోర్స్ విద్యార్థులకు మార్గదర్శకత్వం వహిస్తుంది.
ఈ ప్యాక్స్ లో భాగంగా, విద్యార్థులు కీలకమైన సబ్జెక్ట్స్ లో మొత్తం 360+ లైవ్ లెక్చర్స్ పొందుతారు - ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోలజీ మరియు గణితంతో పాటు ప్రీ-రికార్డెడ్ వీడియోలు, రోజూవారీ సలహాలు మరియు ఉపాయాలు, సాధనా ప్రశ్నలు, చాప్టర్ పరీక్షలు, నెలవారీ పరీక్షలు మరియు ఆల్ ఇండియా లైవ్ మాక్ పరీక్షలు ఇంతకు ముందు సంవత్సరాల ప్రశ్న పత్రాలు మరియు సందేహాలు నివృత్తి చేసుకునే తరగతులు అందుబాటులో ఉంటాయి . విద్యార్థులు ముఖ్యమైన ప్రశ్నల్ని సాధన చేసుకోవడం మరియు తమ టీచర్లతో లైవ్ లో తమ సందేహాలు తీర్చుకోవడం మరియు పరిష్కారాలు కోసం ఆన్ లైన్ లో పరిశోధించే శ్రమని నివారించడంలో లైవ్ లో మార్గదర్శకత్వంవహించే సాధనా సమావేశాలు సహాయపడ తాయి. 12వ తరగతి విద్యార్థులు కోసం కోర్స్ లు 2022 మార్చి 28 నుండి ఆరంభమవుతాయి మరియు 2023 జేఈఈ మరియు ఎన్ఈఈటీ పరీక్షలు పూర్తయ్యేంత వరకు కొనసాగుతాయి. ప్రస్తుతం 10వ తరగతిలో ఉన్న విద్యార్థులు కోసం బోర్డ్ పరీక్షలు పూర్తయిన తరువాత మేలో కోర్స్ ఆరంభమవుతుంది కానీ తమ 10వ తరగతి బోర్డ్ పరీక్షలు కోసం కాంప్లిమెంటరీ రివిజన్ తరగతులు పొందడానికి వారు త్వరగా నమోదు చేసుకోవచ్చు.
క్రాష్ కోర్స్:
దీనితో పాటు, అమేజాన్ అకాడమీ జేఈఈ/ఎన్ఈఈటీ 2022 కోసం తయారయ్యే 12వ తరగతి విద్యార్థులకు సహాయపడటానికి క్రాష్ కోర్స్ ల్ని కూడా ప్రారంభిస్తోంది. కోర్స్ జేఈఈ/ఎన్ఈఈటీ పరీక్షలు కోసం అన్ని ముఖ్యమైన అంశాల్ని కవర్ చేస్తుంది. తమ 12వ తరగతి బోర్డ్ పరీక్షలు కోసం తయారవడంలో వారికి సహాయపడటానికి విద్యార్థులు ఉచితంగా అదనపు తరగతుల్ని కూడా పొందుతారు.
డిస్కౌంట్ ఆఫర్స్:
ప్రారంభపు ఆఫర్ గా, అమేజాన్ అకాడమీ మార్చి ఎర్లీ బర్డ్ డిస్కౌంట్ ని అల్టిమేట్ ప్యాక్స్ పై 20, 2022 వరకు అమలు చేస్తోంది. అసలు ధర ఐఎన్ఆర్ 28,998కి బదులు 1 సంవత్సరం కోర్స్ జాబితా ధర పై ఫ్లాట్ రూ. 8,000 తగ్గింపు ఇస్తోంది. ఎర్లీ బర్డ్ కాంపైన్ తరువాత, అమేజాన్ అకాడమీ నేషనల్ స్కాలర్ షిప్ పరీక్షల్ని ప్రారంభించడానికి ప్రణాళిక చేస్తోంది. దీని ద్వారా విద్యార్థులు తమ సామర్థ్యం ఆధారంగా అల్టిమేట్ ప్యాక్ ఫుల్ సిలబస్ కోర్స్ (జేఈఈ 2024, జేఈఈ 2023, ఎన్ఈఈటీ 2024 మరియు ఎన్ఈఈటీ 2023) కోసం డిస్కౌంట్ కూపన్స్ పొందవచ్చు. స్కాలర్ షిప్ పరీక్షలు 2022 మార్చి 20 నుండి ఆరంభించి మే వరకు ప్రతి ఆదివారం జరుగుతాయి.
ఈ ప్రారంభోత్సవం పై వ్యాఖ్యానిస్తూ, అమేజాన్ ఇండియాలో ఎడ్యుకేషన్ డైరక్టర్ అమోల్ గురువారం మాట్లాడుతూ.. 'జేఈఈ మరియు ఎన్ఈఈటీ విద్యార్థులు కోసం అల్టిమేట్ ప్యాక్స్ ప్రారంభించడం అనేది ఉన్నతమైన నాణ్యత, సరసమైన విద్యా కంటెంట్ మరియు పరీక్షా తయారీ సేవలు కేటాయించడం పై మా దృష్టి కేంద్రీకరించడంలో ఒక భాగం. పాఠశాల పాఠ్యాంశాలతో పాటు పోటీయుత పరీక్షలైన జేఈఈ మరియు ఎన్ఈఈటీ కోసం తయారీని సమతుల్యం చేయడంలో వారికి సహాయపడటానికి మా విద్యార్థులకు ఒక సమగ్రమైన తయారీ ప్యాక్ ని ఇవ్వడానికి మేము ఆనందిస్తాము. మా విలక్షణమైన కంటెండ్ మాడ్యూల్ డీప్ డేటా ఎనలిటిక్స్ పై ఆధారపడింది మరియు మా విద్యార్థులు నేర్చుకునే అనుభవానికి అవి విలువని చేర్చే ప్యాక్స్ గా చూడాలని కోరుకుంటున్నాము.` అని అన్నారు.
అమేజాన్ అకాడమీలోని నిపుణులైన టీచర్లు అల్టిమేట్ ప్యాక్స్ క్రింద సీబీఎస్ఈ, జేఈఈ మెయిన్, అడ్వాన్స్ డ్ మరియు ఎన్ఈఈటీ అంతటా ఉన్న అన్ని స్థాయిలు మరియు భావనల్ని కవర్ చేస్తారు. ఏడాది పాటు ఉండే ఈ కోర్స్ ప్యాక్స్ అభిలషణీయులైన విద్యార్థులు నిపుణుల మార్గదర్శకత్వంలో వ్యక్తిగత అధ్యయనం క్యాలెండర్ తయారు చేయడంలో సహాయపడతాయి. ఈ ప్రణాళిక పూర్తి సబ్జెక్ట్ ని కవర్ చేస్తుంది మరియు విద్యార్థులు బోర్డ్ మరియు పోటీయుత పరీక్షలు రెండిటిలో విజయాన్ని సాధించడానికి క్రమబద్ధమైన రివిజన్ షెడ్యూల్స్ తో చదివిన అంశాలు అధికంగా గుర్తుంచుకోవడాన్ని సాధించడానికి వీలు కల్పిస్తుంది.