Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఢిల్లీలో ప్రారంభమైన మొదటి అనుభవ కేంద్రం
నేర్చుకునే వారు ఆఫ్‌లైన్‌లో అన్అకాడమీ సేవలు పొందేందుకు, నిపుణులను సంప్రదించేందుకు అన్అకాడమనీ స్టోర్ వీలు కల్పిస్తుంది
న్యూఢిల్లీ : భారతదేశపు అతి పెద్ద లెర్నింగ్ వేదిక అన్అకాడమీలి - తన మొదటి ఎక్స్పీరియన్స్ స్టోర్‌ను దేశంలో ప్రారభించినట్టు నేడు ప్రకటించింది. న్యూఢిల్లీలో ప్రారంభించిన మొదటి స్టోర్ సహ, ఈ స్టోరులు నేర్చుకునేవారికి ఈ వేదిక ద్వారా అందిస్తున్న సేవలపై అవగాహనను పెంపొందించడంతో పాటు అందరికీ అత్యున్నత జ్ఞానం అందాలన్న అన్అకాడమీ దార్శనికతను మరింత ముందుకు తీసుకెళ్తాయి.
ఈ వేదిక ద్వారా అందిస్తున్న వివిధ సేవలు బ్రౌజ్ చేయాలని, పొందాలని భావించే వారి కోసం ఒక ఆఫ్‌లైన్ టచ్‌పాయింట్‌గా నిలిచేలా ఈ స్టోరును అన్అకాడమీ డిజైన్ చేసింది. అభ్యాసకులు తాము ఎంచుకున్న కెరీర్ మార్గాలకు సంబంధించి అప్డేట్గా ఉండేందుకు, భావసారూప్యత కలిగిన వ్యక్తులతో కనెక్ట్ అయ్యేందుకు మాధ్యమంగా నిలిచేలా ఈ స్టోర్ ఉంటుంది.
అభ్యాసకులు తాము ఎంచుకున్న లక్ష్యాలకు సంబంధించిన పరిజ్ఞానం పెంచుకునేందుకు నిపుణులతో అన్-గ్రౌండ్ కౌన్సెలింగ్, ప్రముఖ విద్యావేత్తలతో తరచూ సమావేశాల వంటి వాటి ద్వారా స్టోర్స్ ఒక సంపూర్ణ అనుభవాన్ని అందిస్తాయి. తాము ఎంచుకున్న లక్ష్యాలకు సంబంధించి కౌన్సిలింగ్ తర్వాత అందిస్తున్న కంటెంట్‌ను బ్రౌజ్ చేసుకోవడం ద్వారా విద్యార్థులు స్టోర్‌లో సబ్స్క్రిప్షన్స్ కొనుగోలు చేయవచ్చు.
అన్అకాడమీ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు అండ్ సీఈఓ గౌరవ్ ముంజల్ మాట్లాడుతూ.. 'నిప్రతి ఒక్కరికీ అత్యుత్తమ జ్ఞానాన్ని అందించేందుకు యూట్యూబ్‌తో ఛానెల్‌తో ప్రారంభమైన మా ప్రయాణం నేడు అన్అకాడమీ స్టోర్లతో కొత్త రూపాన్ని సంతరించుకుంది. ఈ స్టోర్ల ద్వారా మేము భావసారూప్యం కలిగిన అభ్యాసకుల కోసం ఒక సమూహాన్నిసృష్టించే దిశగా ఓ అడుగు ముందుకు వేస్తున్నాం. ఎక్స్పర్ట్స్, విద్యావేత్తలతో అనుసంధానాలు, లైబ్రరీలు, తరగతి గదులు, మరెన్నో సదుపాయాలతో కూడిన ఈ అనుభవపూర్వక దుకాణాలు, అభ్యాసకులు వారు ఎంచుకున్న కెరీర్ మార్గాలకు సంబంధించి లోతైన విషయాలు తెలుసుకోవడంలో సాయపడతాయని మేము ఆశిస్తున్నాము. మా ఉత్పత్తులు, సేవలపై మేము చాలా ఫీడ్‌బ్యాక్ తీసుకున్నాం. అందులో భాగంగా భౌతికపరమైన ఎక్స్పెరిన్షియల్ టచ్ పాయింట్స్ ద్వారా వారికి దీర్ఘకాలిక ప్రయోజనం కల్పించడంతో పాటు నమ్మకం, విశ్వాసం పెంపొందించుకోవచ్చని భావిస్తున్నాం` అని అన్నారు.
అత్యున్నత స్థాయిలో బ్రౌజింగ్ అనుభూతి అందించేందుకు అన్అకాడమీ స్టోర్లు అన్ని కూడా అత్యంతాధునికంగానే కాదు మినిమలిస్ట్ డిజైన్‌తో నిర్మించబడ్డాయి. అన్అకాడెమీ సంస్కృతిని ప్రతిబింబించే ఇంటీరియర్స్, విస్తృతంగా తెలుపు రంగు ఉపయోగం, చెక్క ఫర్నీచర్ ప్రశాంతతను అందిస్తాయి. అద్భుతమైన అనుభూతి అందించేందుకు అన్అకాడమీ స్టోర్స్ అనేక ఇతర ఫీచర్లు కలిగి ఉంది.
ఎక్స్పీరియన్స్ జోన్: అన్‌అకాడమీకి చెందిన కంటెంట్ అందించే ఆన్-డిస్ప్లే డివైసులు (ట్యాబ్లెట్లు, స్క్రీన్లు) మేము అందించే సేవలు, మా సబ్స్క్రిప్షన్స్ విధానాలు అర్థం చేసుకోవడంలో యూజర్లకు సాయపడతాయి. విజిటర్లు సొంతంగా సమయం వెచ్చించి కంటెంట్ పరిశీలించవచ్చు లేదా వారికి సాయపడేందుకు మా ఆన్-గ్రౌండ్ ఎక్స్పర్ట్స్ సిద్ధంగా ఉంటారు.
కనెక్ట్ - కౌన్సెలింగ్ ఏరియా: అందుబాటులో ఉన్న ప్రొడక్టు సేవలకు సంబంధించి గైడెన్స్, సపోర్టు లేదా నిపుణుల ద్వారా సబ్స్క్రిప్షన్ కొనుగోలు గురించి తెలుసుకోవచ్చు అభ్యాసకులు తమ ఎంచుకున్న రంగాల్లో అప్డేటెడ్గా ఉండేందుకు ఇందులోని ఇన్-హౌజ్ లైబ్రరీలో సంబంధిత పుస్తకాలు అందుబాటులో ఉంటాయి.
విశాలమైన తరగతి గదులు - అభ్యాసకులందరి కోసం వేర్వేరు శ్రేణులకు చెందిన టాప్ ఎడ్యూకేటర్ల ద్వారా తరచూ మేము సెషన్స్ నిర్వహిస్తాం.
ఆకర్షణీయమైన దుస్తులు, స్టేషనరీ మొదలైన కూల్ మర్చండైజ్ కొనుగోలు కోసం మర్చండైజ్ వాల్ ఉపయోగపడుతుంది.
అభ్యాసకులు స్టోర్‌లో ఎక్కువ సేపు గడిపేలా ప్లాన్ చేసుకునేందుకు ఎంపిక చేసిన అన్అకాడమీ స్టోర్‌లో కేఫ్టేరియా కూడా ఉంటుంది,
అభ్యాసకులు ఆలోచించేందుకు, దృష్టి సారించేందుకు, కనెక్ట్ అయ్యేందుకు ఉద్దేశించిన చోటు అన్అకాడమీ స్టోర్. మొట్ట మొదటి అనాకాడెమీ స్టోర్ మార్చి 12న న్యూఢిల్లీ - పూసా రోడ్లో ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. తదుపరి దశలో ఈ తరహా టచ్‌పాయింట్ కేంద్రాలను కోటా, జైపూర్, లక్నోలో ఏర్పాటు చేయాలని కంపెనీ యోచిస్తోంది.