Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కాన్ఫిడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (క్రెడారు) వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడం ద్వారా రియల్ ఎస్టేట్ రంగం అభివృద్థి చర్యలపై చర్చించింది. శుక్రవారం హైదరాబాద్‌లో క్రెడారు టెక్ కాన్-22 సదస్సును ఏర్పాటు చేసింది. పరిశమ్రలోని కొన్ని కీలక సమస్యలకు సాంకేతిక ఆధారిత పరిష్కారాలను అందిపుచ్చుకునే అవసరాన్ని రియల్ ఎస్టేట్ పరిశమ్ర కూడా అర్థం చేసుకుందని క్రెడారు ఆఫీసు బేరర్లు పేర్కొన్నారు. ఈ సదస్సుకు క్రెడారు నేషనల్ వైస్ ప్రెసిడెంట్ జి రామ్‌రెడ్డి, నరేంద్ర కుమార్ ముఖ్య వక్తలుగా హాజరయ్యారు. సాంకేతిక పురోగతి భారతీయ రియల్ ఎస్టేట్ రంగంలో విశేష మార్పులను తెచ్చిందన్నారు.