Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రభుత్వ రంగంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద రోటరీ క్లబ్ బంజారాహిల్స్ చారిటేబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న స్పర్ష్ హాస్పెస్కు రూ.3.13 కోట్ల సాయం అందించింది. సామాజికంగా వెనుకబడిన 1700 మంది రోగుల సంరక్షణ కోసం ఈ నిధులను ఉపయోగించనున్నారు. ఈ మొత్తం విలువ చేసే చెక్కును ఎస్బిఐ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ (హెచ్ఆర్) ఓం ప్రకాశ్ మిశ్రా రోటరీ క్లబ్ ప్రతినిధులకు అందజేశారు.