Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫిబ్రవరిలో 23 శాతం పతనం
న్యూఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థ బలహీనతను వాహన అమ్మకాల పతనం స్పష్టం చేస్తోంది. ప్రస్తుత ఏడాది ఫిబ్రవరిలో దేశీయ ప్రయాణికుల వాహనాల విక్రయాలు 23 శాతం క్షీణించి 13,28,027 యూనిట్లకు పరిమితమయ్యాయి. 2021 ఇదే మాసంలో 17,35,909 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. గడిచిన మాసంలో ప్యాసింజర్ వాహన అమ్మకాలు 6 శాతం తగ్గి 2.62,984 యూనిట్లుగా నమోదయ్యాయని సియోమ్ తెలిపింది. గతేడాది ఇదే మాసంలో 2,81,380 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. సెమీకండక్టర్ కొరత, కొత్త నిబంధనల కారణంగా ధరల పెరుగుదల, సామాగ్రికి సంబంధించి పెరిగిన ధరలు, అధిక లాజిస్టిక్స్ ధరలు తదితర పరిస్థితులు అమ్మకాలను దెబ్బతీసినట్లు సియోమ్ పేర్కొంది.