Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒప్పో ప్రతినిధి తస్లీమ్ ఆరిఫ్
హైదరాబాద్ : తాము 2022లో ఉత్పత్తి అభివృద్ధి శ్రేణి, సాంకేతిక ఆవిష్కరణలు మరియు అకాడెమియాతో భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేసేందుకు మరిన్ని పెట్టుబడులలతో భారతదేశంలో ఆర్ డ డి పోర్ట్‌ఫోలియోను అభివృద్ధి చేస్తున్నామని నవ తెలంగాణకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒప్పో ఇండియా ఆర్ అండ్ డి హెడ్, ఉపాధ్యక్షుడు తస్లీమ్ ఆరిఫ్ పేర్కొన్నారు. ఇది భారతదేశ మార్కెట్ కోసం మాత్రమే కాకుండా, భారతదేశం నుంచి ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు ఆవిష్కరణలను తీసుకువెళ్లడానికి మరింత లోకలైజ్ చేసిన పరిష్కారాలను రూపొందించడానికి భారతదేశంలోని ఉత్పత్తి అభివృద్ధి పర్యావరణ వ్యవస్థను బ్రాండ్ నిర్మిస్తోంది. ఈ దృష్టికోణానికి అనుగుణంగా, ఒప్పో ఇటీవల హైదరాబాద్‌లో పవర్ డ పెర్ఫార్మెన్స్ ల్యాబ్‌ను ప్రారంభించింది.
ఇంటర్వ్యూలో కీలక అంశాలసారం ఇలా ఉంది.
1. హైదరాబాద్‌లో ఒప్పో కార్యకలాపాల గురించి వివరించండి. భారతదేశంలో ఉత్పత్తి అభివృద్ధి పర్యావరణ వ్యవస్థను నిర్మించేందుకు బ్రాండ్ దృష్టి కోణంతో ఇది ఎలా సమతుల్యతను కలిగి ఉంది?
తస్లీమ్ ఆరిఫ్ : భారతీయ ఆర్ అండ్ డి నైపుణ్యాలు మరియు అనుభవాన్ని మరింత వినియోగించుకునే దిశలో, భారతదేశంలో ఒప్పో తన వినియోగదారుల ఆకాంక్షలకు ప్రతిస్పందించేందుకు అనుగుణంగా హైదరాబాద్‌లో ఆర్ అండ్ డి కేంద్రాన్ని 2018లో ఏర్పాటు చేసింది. అదనంగా, గ్లోబల్ మార్కెట్లలో భారతదేశ-కేంద్రీకృత ఆవిష్కరణలను పరిచయం చేయడం, ఒప్పో తన పోటీతత్వాన్ని కొనసాగించడం, తన ఆవిష్కరణలతో నూతన వినియోగదారులను ఆకర్షించేందుకు సహాయపడేలా దీన్ని ఏర్పాటు చేశారు. భారతదేశంలో, ఒప్పో RR&D ను స్థానిక ఉద్యోగులచే నడుపుతోంది. మేము మా ఉద్యోగులకు వారి కెరీర్ అభివృద్ధికి విభిన్న అవకాశాలను అందిస్తున్నాము. అలాగే, అధునాతన సాంకేతిక అభ్యాసానికి నిరంతర నైపుణ్యంతో వారికి మద్దతు ఇస్తున్నాము. ప్రస్తుతం, మేము 450+ ఉద్యోగులతో ఈ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాము. ప్రపంచానికి ఉత్పత్తి అభివృద్ధి కేంద్రంగా భారతదేశాన్ని తీర్చిదిద్దేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), కెమెరా, ఫాస్ట్ ఛార్జింగ్ టెక్, 5జి, మల్టీమీడియా మరియు ఇతర సాంకేతికతలను రూపొందించడంలో అవిశ్రాంతంగా పని చేస్తున్నాము. మా ఇంజనీర్లందరిలో వినియోగదారు-ఆధారిత పరిశోధనా సంస్కృతిని రూపొందించేందుకు మేము చాలా పెట్టుబడి పెట్టాము మరియు వినియోగదారుల విభిన్న అవసరాలను పరిష్కరించేందుకు ప్రత్యేకమైన పరిష్కారాలను అందిస్తున్నాము.
భారతదేశంలో ఉత్పత్తి అభివృద్ధి పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేసి, అభివృద్ధి చేయడం అలాగే, స్థానికంగా మరియు ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరణలను నడిపించే దృష్టి కోణంతో, మేము 2021లో 5జి మరియు కెమెరా కోసం ఇన్నోవేషన్ ల్యాబ్‌లను ఏర్పాటు చేసి మా ఉత్పత్తుల శ్రేణిని బలోపేతం చేసుకున్నాము. ప్రస్తుతం, భారతదేశంలోని మా ఆర్ అండ్ డి ఆవరణలోని ఇన్నోవేషన్ ల్యాబ్‌లో 50% స్థలాన్ని వీరికి కేటాయించాము. మా ఆవిష్కరణల వ్యూహంలో భాగంగా, కఠినమైన శిక్షణతో ఇంజనీర్లకు ఇన్నోవేషన్ మరియు పేటెంట్ ఫైలింగ్ కల్చర్ ఆలోచనా విధానాన్ని పెంపొందించే అంతర్గత ఇన్నోవేషన్ బృందాన్ని మేము సృష్టించాము. ఇన్నోవేషన్ టీమ్ నిరంతర ప్రయత్నాలతో, మేము 2021లో ఒప్పో ఇండియా దాఖలు చేసిన పేటెంట్ల సంఖ్యతో పోల్చితే 128% కన్నా ఎక్కువ గణనీయమైన పురోగతిని సాధించాము. మేము 2022లో, ప్రొడక్ట్ డెవలప్మెంట్ పోర్ట్‌ఫోలియో, సాంకేతిక ఆవిష్కరణలు మరియు అకాడెమియాతో భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేయడంలో మరింత పెట్టుబడి పెట్టడం ద్వారా భారతదేశంలో ఆర్ డ డి పోర్ట్‌ఫోలియోను అభివృద్ధి చేస్తున్నాము.
2. ఒప్పో ఇటీవల పవర్ డ పెర్ఫార్మెన్స్ ల్యాబ్‌ను ప్రారంభించింది. దయచేసి దీని ఏర్పాటు వెనుక ఉన్న ఉద్దేశాన్ని వివరించండి.
తస్లీమ్ ఆరిఫ్ : యువ భారతీయుల వేగవంతమైన జీవనశైలిని అనుసరిస్తుండడంతో, వారికి ఎక్కువ బ్యాటరీ లైఫ్ మరియు తక్కువ విద్యుత్తు వినియోగంతో అధిక-పనితీరును అందించే పరికరం అవసరం అవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మేము మా పవర్ అండ్ పెర్ఫార్మెన్స్ ల్యాబ్‌ను ఏర్పాటు చేశాము. ఇది బ్యాటరీ లైఫ్‌కు సంబంధించి ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న సవాళ్లు మరియు అనిశ్చితులకు వ్యతిరేకంగా ఆశావాదాన్ని, స్ఫూర్తిని అందిస్తుంది. భారతదేశం వ్యాప్తంగా ఉత్పత్తి అభివృద్ధి పర్యావరణ వ్యవస్థను విస్తరించాలన్న మా కలను సాకారం చేయడంలో ఈ ల్యాబ్ మూడవ ముఖ్యమైన అభివృద్ధిని సూచిస్తుంది మరియు పరికరాలను మరింత శక్తివంతంగా తయారు చేసేందుకు, ఆవిష్కరణలను ముందుకు తోడ్కొని వెళ్లేందుకు మూలస్తంభంగా పనిచేస్తుంది. ఇది అధిక-పనితీరును చూపించే గేమింగ్, వీడియో క్యాప్చరింగ్, తక్కువ వెలుగులో ఫోటోగ్రఫీ మరియు ఇతర ప్రాసెసింగ్-ఇంటెన్సివ్ ఆపరేషన్లతో సహా మెజారిటీ వినియోగ దృశ్యాలలో మెరుగైన అనుభవాన్ని వినియోగదారునికి అందిస్తుంది మరియు రాబోయే అన్ని పరికరాలకు మెరుగైన పనితీరు కొలమానాలను సాధించేలా చేస్తుంది. భారతదేశంలో స్మార్ట్ఫోన్ల ఆవిష్కరణల నుంచి తయారీ వరకు సెల్ఫ్-సస్టెయినబుల్ పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము.
ఇంకా, పవర్ డ పెర్ఫార్మెన్స్ ల్యాబ్ వినియోగదారు అనుభవంలో, ముఖ్యంగా భారతదేశంలో 5జి సేవలు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో, తదుపరి పెద్ద విప్లవాన్ని ముందుకు తోడ్కొని వెళ్లేందుకు ఒక ముఖ్యమైన అభివృద్ధిని రుజువు చేస్తుంది. ప్రతీ 5జి పరికరానికి తప్పనిసరిగా ఉండే స్టెల్లార్ పవర్ ఆప్టిమైజేషన్ మరియు సాటిలేని మేటి పనితీరును ప్రదర్శించే పరిష్కారాలను ల్యాబ్ అభివృద్ధి చేస్తుంది. ఆర్ అండ్ డి సెంటర్‌తో పాటు ఈ ఆప్టిమైజేషన్ ల్యాబ్‌ను ఏర్పాటు చేయడం ద్వారా, ఒప్పో నుంచి మానవజాతి కోసం సాంకేతికతను అభివృద్ధి చేయాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. ఈ సాంకేతికతను ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది వినియోగదారుల చేతుల్లోకి తీసుకు వెళ్లాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాము.
3. అన్ని కంపెనీలు 5జిపై దృష్టి సారిస్తున్నాయి. భారతదేశంలో 5జి కోసం ఒప్పో విజన్ ఏమిటి?
తస్లీమ్ ఆరిఫ్ : ప్రపంచవ్యాప్తంగా 5జి అనేది అన్ని పరిశ్రమల వ్యాప్తంగా మార్పును తీసుకు వచ్చే డిజిటలైజేషన్ రాకను వేగవంతం చేసే పరిణామ సాంకేతికత. రాబోయే 3-5 ఏండ్లు సాంకేతిక సంస్థలకు అవకాశాల తెరిచే కిటికీ. కాగా, 5జి తరం ఒకే ఉత్పత్తి, ఛానెల్ లేదా సాంకేతికతను దాటి పరిశ్రమ స్థాయి సాంకేతికతలకు వెళ్లవలసిన అవసరం ఉంది. 'మానవజాతి కోసం సాంకేతికత, ప్రపంచం కోసం దయ` అనే మా బ్రాండ్ సిద్ధాంతంపై దృష్టి సారించి, మా వినియోగదారులకు మెరుగైన జీవితంతో భవిష్యత్తు-సిద్ధంగా మార్చడానికి మేము ఎటువంటి అవకాశాన్ని వదిలిపెట్టము. గత ఏడాది మా ఇండియా 5జి ఇన్నోవేషన్ ల్యాబ్ ఏర్పాటు బృందం ఉ విదేశీ మార్కెట్లో ఒప్పో కోసం మొదటి 5జి ల్యాబ్, 5జి ఆవిష్కరణలు మరియు అప్లికేషన్ల కోసం సరికొత్త 5జి ఆవిష్కరణలు మరియు అప్లికేషన్లపై పని చేస్తోంది. మొత్తం ఏర్పాటు పూర్తయిన తర్వాత, పరివర్తన సాంకేతికతను వినియోగదారులు వినియోగించుకునేందుకు పూర్తి స్థాయి పర్యావరణ వ్యవస్థను కలిగి ఉంటారని నిర్ధారిస్తుంది.
భారతదేశంలో నిర్వహించిన పలు 5జి పరీక్షల్లో నాన్-స్టాండలోన్ మోడల్‌లు పాల్గొన్నప్పటికీ, ఒప్పో వాటి పరిష్కారాలను స్టాండ్-అలోన్ ప్లాట్‌ఫారమ్‌లలో అభివృద్ధి చేసింది - అంటే 5జి సెటప్‌తో పరికరాలను పరీక్షించింది. దేశంలో 5జి పరికరాలు వేగవంతమైన విస్తరణపై పని చేయడంతో పాటు, మా బృందం గ్లోబల్ మార్కెట్లలో ఒప్పో వృద్ధికి ఉపయోగపడే కొన్ని ప్రధాన సాంకేతికతలను కూడా అభివృద్ధి చేస్తోంది. ఒప్పో ఇండియాలోని 5జి బృందం ఈ ప్రీమియం టెక్నాలజీని యూజర్ ఫ్రెండ్లీ మరియు సరసమైనదిగా చేయడం ద్వారా భారతదేశంలోని ప్రతి స్మార్ట్‌ఫోన్ వినియోగదారుకు 5జి అనుభూతిని అందించాలన్న తన కలను త్వరలో సాకారం చేసుకునేందుకు జియో, ఎయిర్టెల్, క్వాల్కామ్, మీడియాటెక్ అలాగే ఇతర ప్రముఖ పరిశ్రమలోని ఇతర అనుబంధ భాగస్వాములతో కలిసి పని చేస్తోంది.
ఒప్పో 5జిలో కొత్త ఆవిష్కరణలను పరిచయం చేసేందుకు, హైదరాబాద్‌లోని తన ఆర్ అండ్ డి సెంటర్లో 5జి వాట్సాప్ వీడియో కాల్ టెస్టింగ్, రెనో 6 సిరీస్ కోసం 5జి ఎస్ఏ నెట్వర్క్ ట్రయల్ నిర్వహించేందుకు రిలయెన్స్ జియో సహకారాన్ని, లైవ్ 5జి సేవను విజయవంతంగా ప్రదర్శించేందుకు ఎయిర్‌టెల్‌తో భాగస్వామ్యం తదితర కార్యక్రమాలను హైదరాబాద్‌లో వాణిజ్య నెట్వర్క్ పరిధిలో చేపట్టింది.
4. ఒప్పో తన రెనో 7ను ఇటీవల విడుదల చేసింది. డిజైన్ మరియు కెమెరా పరంగా కొత్త రెనో7లో మనం ఎలాంటి ఆవిష్కరణలు మరియు అభివృద్ధిని ఆశించవచ్చు?
తస్లీమ్ ఆరిఫ్ : ఒప్పో తన రెనో సిరీస్ మా స్టార్ ఆఫర్, ఇది మా ఫ్లాగ్షిప్ డివైజ్‌గా కొత్త ఆవిష్కరణలను తీసుకురావడానికి అవకాశం కల్పించింది. రెనో సిరీస్ డిజైన్ భాష మరింత పరిణతి చెందినందున, రెనో 7 సిరీస్ దానితో పాటు విప్లవాత్మకమైన, ఆకర్షణీయమైన రూపాన్ని ప్రకృతి ప్రేరణతో మరియు వినూత్న నైపుణ్యంతో నిర్మించారు. స్టార్ ట్రయల్స్‌లో సహజ దృశ్యానికి జీవం పోస్తున్నప్పుడు, రెనో7 సిరీస్ మన్నిక, బరువు మరియు పరిమాణం తదితర ఇతర వివరాల విషయానికి వస్తే వినియోగదారుని పలు అవసరాలను తీరుస్తుంది.
ఎల్డిఐ ఇన్నోవేషన్‌తో ఒప్పో గ్లో
ఏజీ ప్రక్రియకు మార్గదర్శకునిగా, ఒప్పో తన ప్రత్యేకమైన ఒప్పో గ్లో గ్లాస్ తయారీ ప్రక్రియ రెనో సిరీస్ మొత్తం రూపకల్పనలోకీలక పాత్రను కలిగి ఉంది. ఒప్పో రెనో 7 ప్రో 5జిలో ఎయిర్‌క్రాఫ్ట్-గ్రేడ్ ఎల్డిఐ (లేజర్ డైరెక్ట్ ఇమేజింగ్) సాంకేతికతను ఉపయోగించడం అనేది మొబైల్ పరికరం బాహ్య రూపకల్పనకు ఎల్డిఐని వర్తింపజేయడం ఇదే మొదటిసారి. ఒప్పో గ్లో లేయర్ పైన అదనపు కచ్చితత్వ ప్రాసెసింగ్‌ని నిర్వహించేందుకు ఒప్పో లేజర్ ఎన్గ్రేవింగ్ సాంకేతికతను ఉపయోగించడం కూడా ఇదే మొదటిసారి. మా ఇంజనీర్లు ఎయిర్‌క్రాఫ్ట్-గ్రేడ్ ఎల్డిఐని పునర్ నిర్మాణానికి మూడేండ్లు సుదీర్ఘంగా పనిచేశారు. ఇది ఫోన్‌ని చేతిలో ఉంచుకున్నప్పుడు బ్లాక్ గెలాక్సీలోకి ప్రకాశించే, షూటింగ్ స్టార్ల దృశ్యం మరియు ఆకృతి భ్రమను సృష్టిస్తుంది.
50ఎంపి ఐఎంఎక్స్766 సెన్సార్
రెనో 7 కోసం, సోనీతో కలిసి ఒప్పో పని చేసింది మరియు పరిశ్రమలో మొట్టమొదటి ప్రత్యేకమైన 32ఎంపి ఐఎంఎక్స్709 సెల్ఫీ కెమెరా సెన్సార్ మరియు 50ఎంపి ఐఎంఎక్స్ 766 ఫ్లాగ్షిప్ వెనుక కెమెరా సెన్సార్‌ను సహ-రూపకల్పన చేసింది. ఐఎంఎక్స్709 అనేది అనుకూలీకరించిన ఆర్జిబిడబ్ల్యూ (ఎరుపు, నీలం, ఆకుపచ్చ, తెలుపు) ఫ్రంట్ ఇమేజ్ సెన్సార్, ఇది స్ఫుటమైన మరియు మరింత సమానంగా బహిర్గతమయ్యే ఫోటోలు మరియు వీడియోలను సంగ్రహించగలదుబీ సంప్రదాయ ఆర్జిబి సెన్సార్లతో పోల్చినప్పుడు ఇది కాంతికి 60% ఎక్కువ సెన్సిటివ్‌గా ఉంటుంది మరియు అనవసరమైన శబ్దాన్ని 30% తగ్గిస్తుంది.
అన్ని సమయాల్లో స్లిమ్
దాని పెద్ద కెపాసిటీ 4500ఎంఎహెచ్ బ్యాటరీ ఉన్నప్పటికీ, రెనో 7 ప్రో 5జి పరిమాణం మరియు బరువు కనిష్టంగానే ఉంటాయి. ఫోన్ బాడీ కేవలం 7.45 మి.మీ. మందాన్ని కలిగి ఉంటుంది. రోజంతా నిరంతరం తమ ఫోన్లను ఉపయోగించే వారికి సుదీర్ఘ బ్యాటరీ లైఫ్ మరియు సౌకర్యాల మధ్య సంపూర్ణ సమతుల్యతను అందిస్తుంది.