Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఆరోగ్య సంరక్షణ రంగంలో నాలుగు దశాబ్దాలకు పైగా అనుభవం కలిగిన భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్స్ లిమిటెడ్ (బీఎస్ విఎల్) మాజీ ప్రమోటర్లకు చెందిన రిసమ్ ప్యూర్ తాజాగా అట్మోప్యూర్ శ్రేణి ఎ యిర్ ప్యూరిఫయర్స్ ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. భారతదేశంలో అత్యుత్తమ ఆరోగ్య సంరక్షణ, వెల్ - బీ యింగ్ ఉత్పాదనలను అందించడం లక్ష్యంగా కలిగిన ఈ సంస్థ మెడికల్ గ్రేడ్ హెపా 14 శ్రేణి, అడ్వాన్స్ డ్ గ్రేడ్ హెపా 13 శ్రేణి అనే రెండు రకాలను ప్రవేశపెట్టింది. వీటి ప్రారంభ ధర రూ.14,990 ల నుంచి ఉంటుంది.
అట్మోప్యూర్ ఎయిర్ ప్యూరిఫయర్స్ అనేవి మీరు పీల్చే గాలిలోకి గాలి ద్వారా సోకే ఎలాంటి హానికారకాలు లేకుండా మిమ్మల్ని సంరక్షించే విధంగా రూపుదిద్దుకున్నాయి. అట్మోప్యూర్ ఎయిర్ ప్యూరిఫయర్స్ తన అ త్యాధునిక 5 దశల ప్యూరిఫికేషన్ సిస్టమ్ ద్వారా, గాలి ద్వారా సోకే అన్ని రకాల హానికారకాలను తొలగి స్తుంది. అవి బిల్టిట్ ప్రి-ఫిల్టర్ + యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్ + '3డి అటాక్` టెక్నాలజీ తో ఉంటాయి.
మా వినూత్న, విప్లవాత్మక 3డి అటాక్ టెక్నాలజీ అనేది మీ ఇంట్లో ప్రతి చోట ఉండే గాలి ఏ విధమైన అ లర్జీ కారకాలు, బాక్టీరియా, వైరస్ లు లేకుండా చేస్తుంది. 3డి అటాక్ టెక్నాలజీ అనేది మూడు శక్తివంత మైన సాంకేతికతలను - MEDICAL GRADE HEPA 14 + UV-C + IONIZER - కలిగి ఉంటుంది. గాలిలో ఉండే వెంట్రుకలు, దుమ్ము, చెడు వాసనలు, విఒసిలు, పుప్పొడి రేణువులు, అలర్జీ కారకాలు, ఫంగీ, బాక్టీరియా, వైరస్ లు వంటి ఎయిర్ బార్న్ పార్టికల్స్ (0.3 మైక్రాన్లు మాత్రమే ఉండే సూక్ష్మమైన వాటిని కూడా) ను ఇది తొలగిస్తుంది.
ఈ 5 రకాల సాంకేతికతలు మీరు ఉండే గదులకు అట్మోప్యూర్ ఎయిర్ ప్యూరిఫయర్స్ ను విశిష్టమైనవిగా, శక్తివంతమైనవిగా చేస్తాయి.
ఈ సందర్భంగా భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్స్ లిమిటెడ్ (బీఎస్ విఎల్) మాజీ చైర్మెన్ భరత్ దఫ్తారీ మాట్లాడుతూ, 'రోజురోజుకూ వాయుకాలుష్యం పెరిగిపోతున్నది. మనం నిరంతరం ఇండ్లలో మనకు తెలియకుం డానే విషపూరిత వాయువులను పీలుస్తున్నాం. అత్యాధునిక అట్మోప్యూర్ ఎయిర్ ప్యూరిఫయర్స్ అనేది ఆరోగ్యవంతమైన జాతిని రూపొందించేందుకు గాను అత్యుత్తమ ఆరోగ్యసంరక్షణ ఉత్పత్తులను అందించాలనే మా ఆశయంలో తొలి అడుగు` అని అన్నారు.
రాబోయే రోజుల్లో కంపెనీ మరిన్ని వినూత్న ఆరోగ్యసంరక్షణ ఉత్పాదలను అందించేందుకు వీలుగా విస్తృతం గా పరిశోధనలను నిర్వహించనుంది. బి2బి, ఇతర విభాగాలను దృష్టిలో ఉంచుకుంటూ ప్యూరిఫికేషన్ శ్రేణిలో మరెన్నో ఉత్పాదనలను తీసుకువచ్చేందుకు రిసమ్ ప్యూర్ యోచిస్తోంది. మా ఉత్పాదన పోర్ట్ ఫోలియో వ్యూహంలో ప్యూరిటీ అనేది కీలకంగా ఉంటుంది. మేం ప్రవేశపెట్టే ప్రతి ఉత్పాదన కూడా దానికి ప్రాతినిథ్యం వహిస్తుంది.
ఈ సందర్భంగా రిసమ్ ప్యూర్ కమర్షియల్ డైరెక్టర్ వైకుంఠ్ గణపతి మాట్లాడుతూ,'మా లోగో లో ఉండే ఆకు స్వచ్ఛతకు ప్రతీక. అది మా విశ్వాసం, వ్యూహం రెండింటినీ సమ్మిళితం చేస్తుంది. తమ జీవనశైలిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు గాను వినియోగదారులు ఆరోగ్యదాయక ఎంపికలు చేసుకుంటున్నారు. దుమ్ము, కాలుష్యకారకాలు పెరిగిపోవడం, పచ్చదనం రక్షణ తగ్గిపోవడం, వాయు నాణ్యత క్రమంగా క్షీణించడం లాంటి వాటితో వినియోగదారులు క్రమంగా ఎయిర్ ప్యూరిఫయర్స్ లాంటి మరింత ఆరోగ్యదాయక ఉత్పాదనల వైపు దృష్టి సారిస్తున్నారు. అట్మోప్యూర్ ఎయిర్ ప్యూరిఫయర్స్ అత్యంత అధునాతన సాంకేతికతలను కలిగి ఉం టాయి. అవి మీకు ఇండ్లలో, కార్యాలయాల్లో సురక్షితమైన, పరిశుభ్రమైన శ్వాసను అందిస్తాయి` అని అన్నారు.