Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : అమెరికాలోని ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీ (ఎఫ్ఎయు)లో విద్యాభ్యాసం చేయాలనుకునే భారత విద్యార్థులకు స్కాలర్‌షిఫ్‌లు పొందడానికి వీలుందని స్టడీ గ్రూప్ వెల్లడించింది. విదేశాల్లో విద్యాభ్యాసం చేయాలనుకునే వారికి సలహా, సూచనలు అందించే స్టడీ గ్రూప్ రీజనల్ డైరెక్టర్ ఇండియా కరణ్ లలిత్ సోమవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ అండర్ గ్రాడ్యూయేట్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్‌లో దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ప్రవేశం పొందిన భారత విద్యార్థులకు అర్హతను బట్టి ప్రతీ ఏడాది 6000 డాలర్ల వరకు స్కాలర్షిప్ పొందే అవకాశం ఉందన్నారు. నాలుగేళ్ల దాక ప్రతీ ఏడాది ఈ సౌలభ్యం ఉంటుందన్నారు. ఇందులో ప్రవేశానికి మే 1 కల్లా దరఖాస్తు చేసుకోవాలన్నారు.