Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్బీఐ చర్యలు
న్యూఢిల్లీ : పేటియం పేమెంట్ బ్యాంక్ తమ వినియోగదారుల సమాచారాన్ని విదేశీ సంస్థలతో పంచుకుందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ సంస్థ కొత్త ఖాతాలను తెరవడాన్ని నిలిపివేయాల్సిందిగా ఇటీవల ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. పేటియం పేమెంట్స్ బ్యాంకుకు సంబంధించిన వివరాలను చైనా కంపెనీలకు లీక్ చేశారని బ్లూమ్‌బర్గ్ నివేదికలో పేర్కొంది. బ్యాంక్‌లో కొన్ని పర్యవేక్షణ లోపాలను గుర్తించడంతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచార. పేటియం పేమెంట్స్ బ్యాంకు విదేశాల్లోని సర్వర్లకు డేటాను అనుమతించడం ద్వారా నిబంధనలను ఉల్లంఘించినట్లు రిపోర్ట్లు వస్తున్నాయి. ఇది ఆర్బీఐ తన వార్షిక తనిఖీల్లో గుర్తించడంతో.. ఆ సంస్థ కొత్త ఖాతాలను చేర్చుకోవడంపై నిషేధం విధించినట్లు బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. ఐటీ వ్యవస్థపై నిర్వహించేందుకు ఓ ఐటీ ఆడిట్ సంస్థను నియమించుకోవాలని ఆర్బీఐ సూచించింది. ఈ ఆరోపణలు నిరాధారమని పేటియం పేమెంట్స్ బ్యాంక్ పేర్కొంది.
కుప్పకూలిన సంస్థ షేర్లు
ఇప్పటికీ తీవ్ర నష్టాల్లో సాగుతున్న పేటియం మాతృసంస్థ వన్ 97 కమ్యూనికేషన్ షేర్లు ఆర్బీఐ తాజా ఆంక్షలతో కుప్పకూలాయి. సోమవారం బీఎస్ఈ సెన్సెక్స్‌లో ఈ షేర్ 12.21 శాతం క్షీణించి రూ.680.40కి పడిపోయింది. దీంతో కంపెనీ మార్కెట్ కాపిటలైజేషన్ రూ.45,461.55 కోట్లకు పరిమితమయ్యింది. ఈ సంస్థ ఐపీఓ లిస్టింగ్ ధర రూ.2,150గా ఉంది. దీంతో పోల్చితే ఇప్పటి వరకు దాదాపు 70 శాతం విలువ తుడుచుకు పెట్టుకుపోయింది. దీంతో ఐపీఓలో స్టాక్స్‌ను కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు భారీ నష్టాలు చవి చూడటంతో బోరుమంటున్నారు.