Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రూ.50,000 కోట్లు దాటిన అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ (ఎయూఎం)
హైదరాబాద్ : అసెట్స్ అండర్ మేనేజ్మెంట్లో రూ.50,000 కోట్ల రూపాయలు అధిగమించి ఒక కొత్త మైలురాయి సాధించినట్టు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ప్రకటించింది. మార్చి 2018 నుంచి స్వతంత్ర సంస్థగా పనిచేయడం ప్రారంభించిన ఈ కంపెనీ, కార్యకలాపాలు చేపట్టిన నాలుగు సంవత్సరాల స్వల్ప కాలంలోనే ఈ మైలురాయికి చేరుకుంది. కార్యకలాపాలు ప్రారంభించిన మొదటి ఆర్థిక సంవత్సరం 2019లో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అసెట్ అండర్ మేనేజ్మెంట్ కింద మొదటి మైలురాయి రూ.10,000 కోట్లకు చేరింది. ఆ తర్వాత సంవత్సరం రూ.25,000 కోట్ల మార్కును దాటి ఆర్థిక సంవత్సరం 2020 చివరి నాటికి రూ.32,705 కోట్లకు చేరింది.
రూ.38,871 కోట్ల ఎయూఎంతో ఆర్థిక సంవత్సరం 2021ను బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ముగించింది. అదే సంవత్సరం ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ (రెపో రేటు) అనుసంధానిస్తూ సరికొత్త తరహా హోమ్ లోన్స్ అందించింది. హోమ్‌లోన్స్‌కు ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ అంటే ఆర్బీఐ రెపో రేటుతో లింక్ చేసుకునే అవకాశం కస్టమర్లకు కల్పించిన మొట్టమొదటి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీగా (హెచ్ఎఫ్సీ) నిలిచింది. హోమ్లోన్స్ను ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ అంటే రెపో రేటుతో తప్పనిసరిగా లింక్ చేయాలని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. హెచ్ఎఫ్సీలు మాత్రం తమ హోమ్లోన్స్ను ఇంటర్నల్ బెంచ్ మార్క్ లింక్డ్ రేట్స్ అంటే ఫ్లోటింగ్ రెఫరెన్స్ రేట్‌తో లింక్ చేసుకోవవచ్చు.
బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ గురించి..
బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్- బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్‌కు చెందిన 100% అనుబంధ సంస్థ. దేశంలోని అత్యంత వైవిధ్యభరితమైన ఎన్బీఎఫ్సీల్లో ఒకటి. వినియోగదారులు, వాణిజ్యం, ఎస్ఎంఈ ఫైనాన్స్‌లో 19 ఉత్పత్తులు అందిస్తూ దేశవ్యాప్తంగా 21 మిలియన్లకు పైగా కస్టమర్లకు సేవలు అందిస్తోంది. పూణేలో ప్రధాన కార్యాలయం కలిగిన బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, గృహాల కొనుగోలు, పునర్నిర్మాణానికి లేదా వాణిజ్య స్థలాల కొనుగోలుకు వ్యక్తులతో పాటు కార్పొరేట్ సంస్థలకు ఫైనాన్స్ అందిస్తుంది. వ్యాపారం లేదా వ్యక్తిగత అవసరాల కోసం ఆస్తిపై రుణాలు అందించడంతో పాటు వ్యాపార విస్తరణ ప్రయోజనాల కోసం వర్కింగ్ క్యాపిటల్ కూడా సమకూర్చుతుంది. గృహ నిర్మాణ కార్యకలాపాల్లో నిమగ్నమైన బిల్డర్లు, డెవలపర్లకు ఫైనాన్స్ కూడా అందిస్తుంది. అత్యుత్తమ క్రిసిల్ రేటింగ్ AAA (స్టేబుల్) రేటింగ్ కలిగి ఉన్నామని గర్వంగా చెప్పుకుంటుంది