Authorization
Mon Jan 19, 2015 06:51 pm
50,000 ప్రామాణం అధిగమించింది
మొత్తం బుక్కింగ్స్ లో ప్రముఖ వేరియెంట్స్ 45% వాటా కలిగి ఉన్నాయి
టైర్ 1 మరియు 2 మార్కెట్స్ నుండి సుమారు 60%బుక్కింగ్స్ నమోదయ్యాయి
సుమారు 50%కస్టమర్స్ కార్ డీజిల్ వేరియెంట్ కి ప్రాధాన్యత ఇచ్చారు
ప్రవేశ ధరగా కారెన్స్ ఫిబ్రవరి 15, 2022లో ప్రారంభించబడింది
హైదరాబాద్ : కియా ఇండియా, దేశంలోనే అతి వేగంగా వృద్ధి చెందే కారు తయారీదారు కారెన్స్ కోసం బుక్కింగ్స్ నేటికి 50,000 దాటాయని నేడు ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా, కార్ బుక్కింగ్స్ ఆరంభమైన జనవరి 14, 2022 నాటి నుంచి అనగా కేవలం రెండు నెలలు లోగా ఈ మైలురాయిని కంపెనీ సాధించింది. సుమారు 60 శాతం బుక్కింగ్స్ టైర్ 1 మరియు టైర్ 2 పట్టణాలు నుండి రావడంతో భారతదేశానికి చెందిన ఆధునిక కుటుంబాలు ఇష్టాన్ని వాహనం సరిగ్గా గుర్తించింది. లగ్జరీ మరియు లగ్జరీ ప్లస్ వేరియెంట్ లు కస్టమర్లలో ప్రసిద్ధి చెందిన ఎంపికలుగా ఉన్నాయి. వాటి బుక్కింగ్స్ 45%గా నిలిచాయి.
కారెన్స్ వాహనం పెట్రోల్ మరియు డీజిల్ వేరియెంట్ కోసం డిమాండ్ సమతుల్యంగా ఉంది. సుమారు 50% కస్టమర్లు కారెన్స్ యొక్క డీజిల్ వేరియెంట్స్ కి ప్రాధాన్యత ఇచ్చారు. ఇంకా, వాహనం యొక్క ఆటోమేటిక్ వేరియెంట్ కోసం కూడా డిమాండ్ సుమారు 30% కస్టమర్లని ఆకర్షించింది. గత నెలలో, ఆరంభించినా కేవలం 13 రోజులు లోగా సెమీ కండక్టర్ కొరతలోనే కంపెనీ 5,300 కారెన్స్ యూనిట్స్ ని విక్రయించింది. ఇది కారుకి లభించిన అనూహ్యమైన ప్రతిస్పందనని తెలియచేస్తోంది.
ఈ మైలురాయి గురించి వ్యాఖ్యానిస్తూ,మ్యూంగ్-సిక్ సాన్, ప్రధాన సేల్స్ అధికారి, కియా ఇండియా ఇలా అన్నారు,'కారెన్స్ కి వచ్చిన ఈ ప్రతిస్పందన ఫ్యామిలీ మువర్ విభాగంలో ఇంతకు ముందు ఎన్నడూ లేనంత ఉద్వేగాన్ని కలిగించింది మరియు ఇది మా ఇతర ఎస్ యూవీలు కలిగించిన ఉద్వేగానికి సరిపోలుతుంది మరియు ఇది ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది.
భారతదేశపు ఆటోమోటివ్ పరిశ్రమ కఠినమైన దశని ఎదుర్కొంటోంది. ఎందుకంటే మేము సెమీ కండక్టర్స్ యొక్క తీవ్రమైన కొరతని ఎదుర్కొంటున్నాం, ఇది మా ఉత్పత్తికి అవరోధం కలిగిస్తోంది తద్వారా మార్కెట్ లో సరఫరాకి ఆటంకం కలుగుతోంది. అయితే, చిప్స్ కొరత రెండవ త్రైమాసికం నుండి మెరుగవడం ఆరంభమవుతుందని ఆశిస్తున్నాము. మా కార్లు పై ఎక్కువ కాలం డెలివరీ సమయాన్ని నివారించడానికి మార్చి 2022 నుండి మేము మా అనంతపురం తయారీ సదుపాయంలో మూడవ షిఫ్ట్ ఆరంభించాము. ఈ క్లిష్ట సమయంలో మా కస్టమర్ల నమ్మకం నిశ్చలంగా ఉన్నందుకు మేము గర్విస్తున్నాం, ఇది భారతదేశపు ఆటోమోటివ్ మార్కెట్ లో మా స్థానాన్ని నెలకొల్పుకోవడానికి సహాయపడుతుంది. కారెన్స్ మరియు ఇతర మోడల్స్ కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి మేము మా సప్లైయర్స్ మరియు భాగస్వాములతో ఇరవై నాలుగు గంటలు పని చేస్తున్నామని మా పోషకులకు భరసా ఇస్తున్నాం.`
కియా కారెన్స్ ఎస్ యూవీ యొక్క స్పోర్టీనెస్ తో ఒక ఫ్యామిలీ మువర్ యొక్క ఆధునికత యొక్క పరిపూర్ణమైన మిశ్రమంగా నిలిచింది. కారెన్స్ గొప్ప నాణ్యత, అమోఘమైన విలువని అందించింది మరియు తమ తరగతిలో విలక్షణమైన స్టైల్ కి చిహ్నంగా మారింది. తన తరగతిలో ఆరు ఎయిర్ బ్యాగ్స్ మరియు తమ శ్రేణి అంతటా స్టాండర్డ్ గా రోబస్ట్ 10 హై-సేఫ్టీ ప్యాకేజ్ యొక్క భాగంగా కొన్ని చురుకైన మరియు కొన్ని పరోక్ష భద్రతా ఫీచర్స్ ని కూడా కలిగి ఉన్న మొదటి వాహనం.