Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తమిళనాడు ప్రభుత్వంతో ఒడంబడికా పత్రం పై సంతకాలు చేసిన శామ్ సంగ్
శ్రీపెరుంబుదూర్ ప్లాంట్ లో ఉత్పన్నమయ్యే కంప్రెసర్స్ భారతదేశంల తయారయ్యే రిఫ్రిజిరేటర్స్ లో ఉపయోగించబడతాయి మరియు ఎగుమతి కూడా చేయబడతాయి.
చెన్నై : చెన్నై సమీపంలో శ్రీపెరుంబుదూర్ లో కొత్త కంప్రెసర్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ఐఎన్ఆర్ 1,588 కోట్లు భారతదేశంలో పెట్టుబడి పెడుతున్నామని భారతదేశంలో అత్యంత విశ్వసించబడే వినియోగదారు ఎలక్ట్రానిక్స్ మరియు స్మార్ట్ ఫోన్స్ బ్రాండ్ శామ్ సంగ్ ఈరోజు ప్రకటించింది. ఈ కొత్త సదుపాయం 22 ఎకరాల్లో విస్తరించింది, ఏడాదికి 8 మిలియన్ కంప్రెస్ యూనిట్స్ ని ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. భవిష్యత్తులో ఇది మరింత విస్తరిస్తుంది. ప్లాంట్ లో ఉత్పత్తి చేయబడిన కంప్రెసర్స్ భారతదేశంలో శామ్ సంగ్ తయారు చేసే రిఫ్రిజిరేటర్స్ లో ఉపయోగించబడతాయి మరియు ఎగుమతి కూడా చేయబడతాయి.
మంగళవారు కంపెనీ కొత్త ప్లాంట్ కోసం రాష్ట్రంలో భాగాల ఆవరణ వ్యవస్థని విస్తరించడానికి, శక్తివంతం చేయడానికి తమిళనాడు ప్రభుత్వంతో ఒడంబడికా పత్రం పై (ఎంఓయూ) సంతకం చేసింది.
చెన్నైలో జరిగిన ఎంఓయూ సంతకం కార్యక్రమానికి తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ ఎంకే స్టాలిన్ హాజరయ్యారు. తంగమ్ తెన్నరసు, పరిశ్రమల శాఖ మంత్రి, శ్రీ ఎస్ కృష్ణన్ అదనపు ప్రధాన కార్యదర్శి, పరిశ్రమలు, పూజా కులకర్ణి, మేనేజింగ్ డైరక్టర్, తమిళనాడు ఇండస్ట్రియల్ గైడెన్స్ మరియు ఎక్స్ పోర్ట్ ప్రొమో,న్ బ్యూరో, టి. ఆనంద్, మేనేజింగ్ డైరక్టర్, రాష్ట్ర ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ ఆఫ్ తమిళనాడు, కెన్ కాంగ్, ప్రెసిడెంట్ మరియు సీఈఓ, శామ్ సంగ్ నైరుతి ఆసియా మరియు శ్రీ బ్యోంగ్ జిన్ కాంగ్, మేనేజింగ్ డైరక్టర్, శామ్ సంగ్ చెన్నై ఫ్యాక్టరీకి చెందిన ఇతర అధికారులు కూడా కార్యక్రమానికి హాజరయ్యారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ.. 'తమిళనాడు పారిశ్రామిక అభివృద్ధిలో శామ్ సంగ్ ఒక మెరిసే ఉదాహరణ, ఉపాధి కల్పనకు తోడ్పడుతూ పెట్టుబడుల్ని ప్రోత్సహిస్తోంది. రాష్ట్రంలో తయారీ ఆవరణ వ్యవస్థని శక్తివంతం చేసే దిశగా శామ్ సంగ్ చేపట్టిన మరొక చర్య ఈ కొత్త పెట్టుబడి` అని అన్నారు.
కెన్ కాంగ్, ప్రెసిడెంట్ మరియు సీఈఓ, శామ్ సంగ్ నైరుతి ఆసియా, ఇలా అన్నారు.. 'ఐఎన్ఆర్ 1588 కోట్ల ఈ కొత్త పెట్టుబడి 2007లో మేము మా ఫ్యాక్టరీని ఏర్పాటు చేసిన నాటి నుండి మాకు దీర్ఘకాల భాగస్వులుగా ఉన్న తమిళనాడు ప్రజలకు మా నిరంతర నిబద్ధతకు ఒక నిరూపణ. సంవత్సరాలు గడిచిన తరువాత, మాకు రాష్ట్రం నుండి మరియు స్థానిక అధికారులు నుండి బలమైన మద్దతు లభించింది, మా పవరింగి డిజిటల్ ఇండియా కలని ప్రోత్సహించడంలో సహాయపడ్డారు. ఈ కొత్త కంప్రెసర్ తయారీ సదుపాయం దేశవ్యాప్తంగా శామ్ సంగ్ వారి కొత్త డిజిటల్ ఉపకరణాలు కోసం పెరుగుతున్న డిమాండ్ కి సేవలు అందిస్తుంది మరియు ఎగుమతుల్ని కూడా ప్రోత్సహిస్తుంది.`
2007లో శ్రీపెరుంబుదూర్ లో ఏర్పాటు చేయబడిన తయారీ సదుపాయం భారతదేశంలో శామ్ సంగ్ ఆపరేట్ చేస్తున్న రెండు ఫ్యాక్టరీలలో ఒకటి. శామ్ సంగ్ వారి ఫ్లాగ్ షిప్ వినియోగదారు ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులలో విలాసవంతమైన, భిన్నమైన క్యూఎల్ఈడీ టీవీలు, లైఫ్ స్టైల్ టీవీ ద ఫ్రేమ్, కొత్త కర్డ్ మాస్ట్రో రిఫ్రిజిరేటర్స్, ద్వి భాషా యూజర్ ఇంటర్ ఫేస్ తో ఏఐ ఇకో బబుల్ వాషింగ్ మెషీన్స్ మరియు విండ్ ఫ్రీ ఏసీలు ఈ ప్లాంట్ లోనే తయారవుతున్నాయి. ఈ నవీన డిజిటల్ ఉపకరణాలలో కొన్ని ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేయబడుతున్నాయి.
భారతదేశంలో 1995లో ప్రవేశించిన నాటి నుండి, శామ్ సంగ్ నవ్యతలో కొత్త ప్రామాణాల్ని నెలకొల్పింది మరియు తయారీ మరియు వినియోగదారు మార్కెటింగ్ కి నాయకత్వంవహించింది మరియు తనను తాను జాతీయ బ్రాండ్ గా స్థిరపరుచుకుంది. దేశంలోనే మొత్తం తన మార్కెట్ నాయకత్వాన్ని రెండు ఫ్యాక్టరీస్ తో న్యూఢిల్లీ సమీపంలో నోయిడాలో మరియు శ్రీపెరుంబుదూర్ లో అయిదు ఆర్ అండ్ డీ కేంద్రాలు మరియు ఒక డిజైన్ కేంద్రంతో కలిగి ఉంది. ఇవి 200,000కి పైగా రీటైల్ అవుట్ లెట్స్ యొక్క బలమైన నెట్ వర్క్ తో మరియు 3,000కి పైగా కస్టమర్ సర్వీస్ పాయింట్స్ తో మద్దతు చేయబడుతున్నాయి.
శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ లిమిటెడ్ గురించి..
శామ్సంగ్ ప్రపంచానికి ప్రేరణనిస్తుంది, మార్పులను కలిగించే ఆలోచనలు, సాంకేతిక పరిజ్ఞానాలతో భవిష్యత్తుకు రూపకల్పన చేస్తుంది. టివిలు, స్మార్ట్ఫోన్లు, ధరించగల ఉపకరణాలు, టాబ్లెట్లు, డిజిటల్ ఉపకరణాలు, నెట్వర్క్ సిస్టమ్‌లు మరియు మెమొరీ, సిస్టమ్ ఎల్ఎస్ఐ, ఫౌండ్రీ మరియు ఎల్ఇడి సొల్యూషన్ల ప్రపంచాన్ని సంస్థ పునర్నిర్వచిస్తోంది. శామ్సంగ్ ఇండియాను గురించి తాజా వార్తల కోసం దయచేసి శామ్సంగ్ ఇండియా న్యూస్ రూమ్ ను http://news.samsung.com/in వద్ద సందర్శించండి. హిందీ కొరకు, శామ్సంగ్ న్యూస్‌రూమ్ భారత్‌ను https://news.samsung.com/bharat వద్ద సందర్శించండి. @SamsungNewsIN వద్ద ట్విట్టర్ పై అనుసరించవచ్చు.