Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రీమియం మోటర్‌బైక్‌ను గెలుచుకున్న విశాఖ కార్గో మూవర్స్
విశాఖపట్నం : సుప్రసిద్ధ ప్రీమియం టైర్ తయారీదారు కాంటినెంటల్ టైర్స్ భారతదేశ వ్యాప్తంగా డీలర్లకు భారీ బహుమతులను తమ కాంటినెంటల్ ట్రక్ టైర్స్ కాంటినెంటల్ యాక్సలరేటర్ ప్రోగ్రామ్‌లో భాగంగా అందించింది. ఈ కార్యక్రమాన్ని మహమ్మారి వేళ నూతన డీలర్లకు మద్దతునందించడంతో పాటుగా వారితో సుదీర్ఘకాల అనుబంధం ఏర్పరుచుకోవడమే లక్ష్యంగా ప్రారంభించింది.
ఈ కార్యక్రమంలో భాగంగా, విశాఖ కార్గో మూవర్స్ ప్రీమియం మోటర్‌బైక్‌ను గెలుచుకుంది. కాంటినెంటల్ టైర్స్‌తో జనవరి 2021 నుంచి అనుబంధంను విశాఖ కార్గో నిర్వహించడంతో పాటుగా బ్రాండ్‌కు అసాధారణ విలువనూ సృష్టించింది.
కాంటినెంటల్ ట్రక్ టైర్స్ ఇండియా నేషనల్ సేల్స్ హెడ్-సౌత్, వినోద్ నాయర్ రామకృష్ణన్ మాట్లాడుతూ 'మా వినియోగదారులతో మేము అనుసంధానించబడేందుకు అతి ముఖ్యమైన లింక్‌గా మా డీలర్స్ నిలుస్తుంటారు. మా కంపెనీకి వారు సృష్టించిన అసాధారణ విలువ పట్ల గర్వంగా ఉన్నాము. వారి కృషిని గుర్తించి, గౌరవించేందుకు మేము ప్రారంభించిన కార్యక్రమం కాంటినెంటల్ యాక్సలరేటర్ ప్రోగ్రామ్. ఈ సంవత్సరం కాంటినెంటల్ యాక్సలరేటర్ ప్రోగామ్ బహుమతి అందుకున్న విశాఖ కార్గో మూవర్స్‌ను అభినందిస్తున్నాను` అని అన్నారు.
విశాఖ కార్గో మూవర్స్‌కు చెందిన కోట హరీష్ మాట్లాడుతూ 'కాంటినెంటల్ టైర్స్‌తో ఇది మాకు తొలి సంవత్సరం. మా తొలి ప్రయత్నాలకు ఈ తరహా గుర్తింపు లభించడం పట్ల సంతోషంగా ఉన్నాము. అత్యున్నత నాణ్యత కలిగిన ఉత్పత్తులు, కాంటినెంటల్ అందించే సేవలు మా వినియోగదారులకు మరింత మెరుగ్గా సేవలనందించేందుకు తోడ్పడుతున్నాయి. కాంటినెంటల్‌తో మా బంధం సుదీర్ఘకాలం పాటు కొనసాగుతుందని, మా వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందించగలమని ఆశిస్తున్నాము` అని అన్నారు.