Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నీటి ట్యాంక్‌ల తయారీ
హైదరాబాద్ : హింద్వేర్కు చెందిన ప్లాస్టిక్ పైపులు, ఫిట్టింగ్స్ బ్రాండ్ టూఫ్లో తమ తెలంగాణా ప్లాంట్ నుంచి ఓవర్‌హెడ్ వాటర్ స్టోరేజీ ట్యాంక్‌లను తయారు చేస్తున్నట్లు ప్రకటించింది. మంగళవారం హైదరాబాద్‌లో ట్రూఫ్లో పైప్స్ సీఈఓ రాజేష్ పజ్నూ మీడియాతో మాట్లాడుతూ ఇక్కడి ప్లాంట్‌లో ఉత్పత్తి చేసిన ట్యాంక్‌లతో దక్షిణాది అవసరాలను తీర్చనున్నామన్నారు. ఇస్నాపూర్‌లో ఏర్పాటు చేసిన ప్లాంట్ నెలకు 45 లక్షల లీటర్ల తయారీ సామర్థ్యం కలిగి ఉందన్నారు. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, ఉత్తర కర్నాటక, మహారాష్ట్రలో కొన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నామన్నారు. 2022 డిసెంబర్‌తో ముగిసిన తొమ్మిది మాసాల కాలంలో రూ.430 కోట్ల టర్నోవర్ నమోదు చేశామన్నారు. ఇంతక్రితం ఏడాది ఇదే కాలంలోని రూ.270 కోట్ల రెవెన్యూతో పోల్చితే 65 శాతం వృద్థిని సాధించామన్నారు. 500 లీటర్ల ట్యాక్ ప్రారంభ ధర రూ.3,000 నుంచి 5,000 లీటర్ల ట్యాంక్ ధర రూ.50వేల వరకు ఉంటుందన్నారు.