Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : నాలెడ్జ్ ప్రాసెస్ ఔట్సోర్సింగ్, ఇంజ నీరింగ్, టెక్నాలజీ సొల్యూషన్స్ కంపెనీ మోల్డ్టెక్ టెక్నాలజీస్ 2021-22 సంవత్సరానికిగాను మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.1.70 (85 శాతం) డివిడెండ్ చెల్లించడానికి ఆ సంస్థ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు ఆమోదం తెలిపారు. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో మోల్డ్టెక్ ప్యాకేజింగ్ వరుసగా 80 శాతం, 100 శాతం, 140 శాతం డివిడెండ్ పంపిణీ చేసింది. మోల్డ్టెక్ ప్యాకేజింగ్ ఇటీవల క్విప్ ద్వారా రూ.104 కోట్లను గోల్డ్మన్ సాష్, అశోక ఇండియా, ఐసీఐసీఐ ప్రూడెన్షియల్, వైట్ ఓక్, ఆదిత్య బిర్లా తదితర సంస్థల నుంచి సమీకరించిన సంగతి తెలిసిందే.