Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : క్రిప్టో కరెన్సీల్లో అత్యధికంగా పెట్టుబడులు పెట్టిన 700 మందిని ఆదాయపు పన్ను శాఖ గుర్తిం చింది. వీరికి నోటీసులు జారీ చేయ నున్నట్లు సమాచారం. ఆయా వ్యక్తులు, సంస్థలపై 30 శాతం పన్ను, జరిమాన, వడ్డీ విధించే అవకాశాలున్నాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు అధికారులు వెల్లడించారు. ఇందులో అధిక ఆదాయం కలిగిన వారు, ఎన్ఆర్ఐ, స్టార్టప్ సంస్థలున్నాయన్నారు.
క్రిప్టో కరెన్సీని ప్రవేశపెట్టం : ఆర్థిక మంత్రి
దేశంలో ప్రభుత్వం తరుపున క్రిప్టో కరెన్సీని ప్రవేశ పెట్టే యేచన లేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చైదరీ పార్లమెంట్‌కు తెలిపారు. అయితే క్రిప్టోలపై తాము ఎలాంటి నియంత్రణ చర్యలు తీసుకోవడం లేదన్నారు. కాగా. కాగితపు కరెన్సీకి త్వరలోనే డిజిటల్ రూపం ఇవ్వడానికి ఆర్బీఐ కసరత్తు చేస్తుందన్నారు.