Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కార్పోరేట్లతో ఎన్ఎమ్ఐఎమ్ఎస్ భాగస్వామ్యం చేసుకోవడం ద్వారా శిక్షణ మరియు కన్సల్టింగ్ సేవలను అందించడంతో పాటుగా సాంకేతిక మరియు మేనేజీరియల్ వర్క్‌ఫోర్స్‌ను తయారు చేయనుంది నైపుణ్యంతో కూడిన మానవ వనరుల అభివృద్ధిని వ్యవసాయం మరియు సంబంధిత రంగాలో చేయనుంది
వ్యవసాయ రంగంలో భారీగా నైపుణ్యంతో కూడిన మానవ వనరుల కొరత ఉంది. ఈ ఎంఓయులతో ఈ అంతరాలు పూరించబడనున్నాయి.
హైదరాబాద్ : ఎస్‌వీకెఎం యొక్క నర్సీ మాంజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ డీమ్డ్ టు బీ యూనివర్శిటీ ఇప్పుడు ఓ అవగాహన ఒప్పందాన్ని పలు రంగాలకు చెందిన ఏడు సుప్రసిద్ధ కార్పోరేట్లతో చేసుకుంది. ఈ అవగాహన ఒప్పందాల ప్రధాన లక్ష్యం, నైపుణ్యవంతులైన మానవ శక్తిని పలు రంగాల వ్యాప్తంగా సృష్టించడం. తద్వారా వృద్ధి చెందుతున్న డిమాండ్ మరియు సరఫరా కొరత నడమ అంతరాలను పూరించనుంది.
ఈ ఎంఓయులను ఎన్ఎమ్ఐఎమ్ఎస్ మరియు ఏడు కార్పోరేట్ సంస్ధల నడుమ జరిగాయి. ఈ కార్పోరేట్ సంస్ధలలో ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ ద సెమీ ఆరిడ్ ట్రాపిక్స్(ఇక్రిశాట్), పటాన్ చెరు(తెలంగాణ), శ్రీ బయోఈస్థటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ,హైదరాబాద్, వర్ష బయోసైన్సెస్ అండ్ టెక్నాలజీ ఇండియా టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్, త్రిపుర బయోటెక్ లిమిటెడ్, హైదరాబాద్, ప్రహిస్తా ఇండస్ట్రీస్ లిమిటెడ్, హైదరాబాద్, అగ్రి లైఫ్ , సంగారెడ్డి (తెలంగాణ)మరియు వైష్ణవి బయోటెక్ లిమిటెడ్, హైదరాబాద్ ఉన్నాయి.
ఈ అవగాహన ఒప్పందం (ఎంఓయు)లో భాగంగా ఎన్ఎమ్ఐఎమ్ఎస్ యూనివర్శిటీ అన్ని క్యాంపస్‌లు మరియు ఈ కార్పోరేట్ సంస్థలు పరస్పరం పలు అంశాలలో సహకరించుకోవడంతో పాటుగా శిక్షణ మరియు కన్సల్టింగ్ సేవలను సైతం అందించుకోవడం ద్వారా సాంకేతిక మరియు మేనేజీరియల్ మానవ శక్తిని తీర్చిదిద్దుతారు. ఈ ఎంఓయులపై హెదరాబాద్లోనిఎన్ఎమ్ఐఎమ్ఎస్ డైరెక్టర్ డాక్టర్ తపన్ కుమార్ పాండా మరియు ప్రో -వైస్ ఛాన్స్లర్ అండ్ రిజిస్ట్రార్ డాక్టర్ మీనా చింతమనేని సంతకాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ మీనా పాల్గొన్నారు. అలాగే ఏడు సంస్థల ప్రతినిధులూ పాల్గొని సంతకాలను చేశారు.
ఈ ఒప్పందంలో భాగంగా ఎన్ఎమ్ఐఎమ్ఎస్ క్యాంపస్ లు మరియు ఈ కార్పోరేట్లు విద్య మరియు పరిశోధన సహకారాన్ని పరస్పరం అంగీకరించిన భోధనాంశాలపై అందించుకోవడంతో పాటుగా ఫ్యాకల్టీ మరియు విద్యార్థులతో తమ అభిప్రాయాలు పంచుకోవడం, సందర్శనలు చేయడం, విజ్ఞానం పంచుకోవడం, ఉమ్మడి వర్క్‌షాప్‌లు, సెమినార్లు, సదస్సులు మరియు శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తారు.
డాక్టర్ తపన్‌కుమార్ పాండా, డైరెక్టర్, ఎన్ఎమ్ఐఎమ్ఎస్ హైదరాబాద్ మాట్లాడుతూ 'దేశపు వ్యవసాయ రంగం కోసం మానవ వనరులు మరియు నైపుణ్యాభివృద్ధికి తోడ్పడే అవకాశాన్ని ఎన్ఎమ్ఐఎమ్ఎస్ కు అందించిన మా భాగస్వామలకు ధన్యవాదములు తెలుపుతున్నాను. కొన్ని దశాబ్దాల క్రితం ఇండియా వ్యవసాయ దిగుమతులపై ఆధారపడిన దేశంగా గుర్తించబడితే ఇప్పుడు స్వీయ సమృద్ధి కలిగిన దేశంగా నిలిచింది. అంతేకాదు విలువ ఆధారిత ఉత్పత్తుల ఎగుమతుల పరంగా కూడా భారీ పురోగతి కనిపిస్తుంది. ఇప్పుడు నైపుణ్యవంతులైన మానవ వనరుల అవసరం అధికంగా ఉంది. ఈ అంతరాలను పూరించాలని మేము కోరుకుంటున్నాము. దీనికోసం విద్య , పరిశోధన, శిక్షణ వంటి అంశాలలో అన్ని రంగాల్లోనూ భాగస్వామ్యాలను సృష్టించాలనుకుంటున్నాము` అని అన్నారు.
వ్యవసాయ రంగం ఇప్పుడు జీడీపీకి రెండవ అతిపెద్ద తోడ్పాటుదారునిగా నిలిచింది. మొత్తం ఉపాధికల్పన పరంగా వ్యవసాయ రంగ వాటా 39.4 శాతానికి చేరింది. అదే సమయంలో తయారీ రంగంలో ఈ వాటా 7.3% తగ్గింది. నిరుద్యోగుల సంఖ్య గ్రామీణ ప్రాంతాలలో1.3%గా ఉంటే పట్టణ ప్రాంతాలలో 6.9%గా ఉంది. నైపుణ్య లేమి కలిగిన సిబ్బంది వ్యవసాయ రంగంలో 85%గా ఉంది. అంతర్జాతీయంగా ఇది కేవలం 44%గా మాత్రమే ఉంది.
విద్య-పరిశ్రమ భాగస్వామ్యం కారణంగా స్ధిరంగా అత్యున్నత నైపుణ్యం కలిగిన సిబ్బందిని తెలంగాణాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న వ్యవసాయ వ్యాపారం, వ్యవసాయ సాంకేతిక రంగాలలో సరఫరా చేయడం వీలవుతుంది.
వ్యవసాయ సాంకేతిక (అగ్రిటెక్) రంగం ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న రంగంగా గుర్తింపు పొందింది. ఇది దాదాపు 28% సీఏజీఆర్ వృద్ధి నమోదు చేస్తుంది. అంతేకాదు, రాష్ట్రంలో ఔత్సాహిక వ్యాపారవేత్తలను ఇది ఆకర్షిస్తోంది. టీహబ్‌తో తమ భాగస్వామ్యం కారణంగా సాంకేతికాధారిత వ్యవసాయ వ్యాపారవేత్తలు, మదుపరులను ఒకే వేదికపైకి తీసుకురావడంతో పాటుగా తెలంగాణాను సైతం వేగంగా మారుస్తున్నాం అని ఆయన వెల్లడించారు.
నేడు పరిశ్రమలు మరియు విద్యారంగం నడుమ భాగస్వామ్యాలు అత్యాధునిక పరిశోధనలో కీలకం కావడంతో పాటుగా విజ్ఞాన మార్పిడి, నైపుణ్యవంతులైన కార్మికులను సృష్టించడానికి సైతం తోడ్పడింది. పరిశ్రమ మరియు విద్యారంగం నడుమ భాగస్వామ్యం ఆవిష్కరణలలో అత్యంత కీలకం కావడంతో పాటుగా సాంకేతికత వృద్ధికి సైతం కీలకంగా మారింది. అందువల్ల, ఎన్ఎమ్ఐఎమ్ఎస్ ఇప్పుడు ఈ అవగాహన ఒప్పందాలు చేసుకోవడానికి ఓ అడుగు ముందుకు వేసింది. అగ్రగామి పరిశ్రమలకు చెందిన సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా డాక్టర్ అక్షయ్ మల్హొత్రా, డైరెక్టర్, షిర్పూర్ క్యాంపస్ తమ క్యాంపస్‌లోని సదుపాయాలను గురించి వెల్లడించారు. అంతేకాదు, భారతదేశపు వృద్ధి కథకు మద్దతునందించే నైపుణ్యం కలిగిన మానవవనరులను సృష్టించాల్సిన ఆవశ్యకతను సైతం వెల్లడించారు.
శ్రీ బయోఈస్థటిక్స్తో జరిగిన ఎంఓయుపై కంపెనీ చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కె ఆర్ కె రెడ్డి సంతకం చేయగా బీ పీఐఎల్తో జరిగిన ఒప్పందంపై కంపెనీ అధ్యక్షులు మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కె వీ ఎస్ఎస్ సాయిరాం సంతకాలు చేశారు. త్రిపుర బయోటెక్ తరపున డాక్టర్ ఎంవీఎస్ఎస్ సాయిరామ్, ప్రెసిడెంట్ అండ్ ఎండీ ఈ ఎంఓయుపై సంతకం చేయగా బీ వర్ష బయోసైన్సెస్ కోసం ఎంఓయుపై సీఎండీ పై డాక్టర్ జాన్ పీటర్ బీ వైష్ణవి బయోటెక్ తరపున సీఎండీ డాక్టర్ ఎం వైష్ణవి మరియు అగ్రిలైఫ్ తరపున సీఈఓ డాక్టర్ వెంకటేష్ దేవనూర్ సంతకాలు చేశారు.