Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : భారతదేశంలోని ప్రముఖ గ్రీన్ సిమెంట్ కంపెనీ & US $ 13 బిలియన్ల JSW గ్రూప్‌లో భాగమైున JSW సిమెంట్ - తన సిమెంట్ తయారీ కార్యకలాపాల్లో వ్యవసాయ వ్యర్థాలు బయోమాస్ ఇంధనంగా ఉపయోగించేందుకు పంజాబ్ రెన్యూవబుల్ ఎనర్జీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో అవగాహన ఒప్పందం పై సంతకం చేసింది. పంజాబ్ రెన్యూవబుల్ ఎనర్జీ సిస్టమ్స్ భారతదేశంలో అతిపెద్ద బయోమాస్ అగ్రిగేషన్, డెన్సిఫికేషన్ కంపెనీ. ఈ ఒప్పందం ప్రకారం జెఎస్డబ్ల్యూ సిమెంట్‌కు చెందిన తయారీ కేంద్రాల్లో క్లింకరైజేషన్, గ్రైండింగ్ ప్రక్రియలో ఉపయోగించే బయోమాస్ ఎనర్జీ కోసం పంజాబ్ రెన్యూవబుల్ ఎనర్జీ సిస్టమ్స్ ఒక స్థిరమైన సరఫరా వ్యవస్థను రూపొందిస్తుంది.
పంజాబ్ రెన్యూవబుల్ ఎనర్జీ సిస్టమ్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందం, సాధ్యమైనంత తక్కువ కార్బన్ ముద్రతో స్థిరమైన సిమెంట్ ఉత్పత్తులు అందించేందుకు JSW సిమెంట్ వేస్తున్న ఒక ముఖ్యమైన అడుగు. గ్లోబల్ సిమెంట్ అండ్ కాంక్రీట్ అసోసియేషన్ (GCCA) సభ్యుడిగా, 2050 నాటికి కార్బన్ న్యూట్రల్ కాంక్రీటు అందించే క్లైమెట్ యాంబిషన్ 2050కి జెఎస్డబ్ల్యూ సిమెంట్ కట్టుబడి ఉంది. కంపెనీ తన కార్బన్ ఉద్గారాల తీవ్రతను 11 సంవత్సరాలలో (ఆర్థిక సంవత్సరం 15 నుంచి ఆర్థిక సంవత్సరం 26 వరకు) దాదాపు సగానికి తగ్గించాలని యోచిస్తోంది. బయోమాస్‌ను ఇంధనంగా ఉపయోగించడం ఈ డీకార్బనైజేషన్ ప్లాన్‌లో ముఖ్య భాగం.
సుస్థిరతకు సంబంధించిన మూడు అంశాలు: పర్యావరణం, సామాజిక, ఆర్థికతత్వాన్ని చక్కదిద్దడంలో బయోమాస్-ఆధారిత ఇంధన విధానం జెఎస్డబ్ల్యూ సిమెంట్‌కు సాయపడుతుంది. వ్యవసాయ-వ్యర్థాలను సాధారణంగా బహిరంగ ప్రదేశాల్లో తగులబెడుతుంటారు. అది చుట్టుపక్కల గాలి నాణ్యతను ప్రభావితం చేస్తుంది. బొగ్గుపై వ్యాపారం ఆధారపడటం తగ్గించేందుకు, కర్బన ఉద్గారాలు తగ్గించడానికి వ్యవసాయ వ్యర్థాలను జెఎస్డబ్ల్యూ సిమెంట్ ఇంధనంగా ఉపయోగిస్తుంది. ఈ ఇంధన నమూనా స్థానిక పర్యావరణం, పరిసర గాలి నాణ్యతను మెరుగుపరుస్తుంది. రైతులు అదనపు ఆదాయం పొందడంలో సాయపడుతుంది.
జెఎస్‌డబ్య్లూ సిమెంట్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ పార్థ్ జిందాల్ ప్రకారం... 'నివృత్తాకార ఆర్థిక సూత్రం మా వ్యాపార నిర్వహణలో అంతర్భాగం. గత సంవత్సరం తాము మా ఇంధన అవసరాలలో దాదాపు 5 శాతం ప్రత్యామ్నాయ ఇంధనాల ద్వారా తీర్చుకునేందుకు ఒక చిన్న ప్రయత్నం మొదలుపెట్టాం. మా కార్యకలాపాల్లో ప్రత్యామ్నాయ ఇంధనంగా బయోమాస్ ఇంధనాన్ని ప్రవేశపెట్టి దాన్ని బలోపేతేం చేసేందుకు పంజాబ్ రెన్యూవబుల్ ఎనర్జీ సిస్టమ్స్‌తో ఒప్పందం మాకు సాయపడుతుంది. ఇది మా కర్బన ఉద్గారాలు తగ్గించడంలో సాయపడటమే కాకుండా పరిసర గాలి నాణ్యతను మెరుగుపరుస్తూ వ్యవసాయ వ్యర్థాల నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందేలా భారతీయ రైతులకు సాయపడేలా మాకు సహకరిస్తుంది` అని అన్నారు.