Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆజాద్ ఇంజనీరింగ్ వెల్లడి
హైదరాబాద్ : బోయింగ్ సంస్థకు తాము విజయవంతంగా విడి భాగాలను అందజేశామని ఆజాద్ ఇంజనీరింగ్ వెల్లడించింది. విమానాల విడిభాగాలు, నేవిగేషన్ పరికరాలను తయారుచేసి, సరఫరా చేసేందుకు బోయింగ్‌తో చేసుకున్న ఒప్పందంలో భాగంగా గడువు సమయంలోనే ఈ పరికరాలను అప్పగించామని ఆజాద్ ఇంజనీరింగ్ వ్యవస్థాపకుడు, ఎండి రాకేష్ చోప్దార్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ మైలురాయి సాధించడం అంత సులభం కాదన్నారు. మొదటి షిప్మెంట్ డెలివరీ సకాలంలో వెళ్లడంతో తమ భాగస్వాములు ఆజాద్ సంస్థపై ఉంచే నమ్మకానికి నిదర్శనమన్నారు.