Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మింగ్ తనంతట తానుగా కొంత మార్పును చెందవలసి ఉంది: డిస్నీ మరియు పిక్సర్ కొత్త చిత్రం, డిస్నీం హాట్‌స్టార్‌లో ప్రసారమవుతున్న టర్నింగ్ రెడ్‌లో మెయి తల్లి మింగ్ లీ పాత్రలో సాండ్రా ఓహ్ పేర్కొన్నారు
ది లిండ్సే కాలిన్స్ నిర్మించిన, టర్నింగ్ రెడ్ హాస్యాస్పదంగా మరియు మానసికంగా ఒక టీనేజరు జీవితంలోని సంఘటనల రోలర్ కోస్టర్ రైడ్‌ను హైలైట్ చేస్తుందిబీ ఈ చిత్రం మార్చి 11న విడుదలైంది.
హైదరాబాద్ : హైస్కూల్ బాధలు, మనసుకు నచ్చిన బాయ్ బ్యాండ్లు, యుక్త వయస్సు, సంబంధాలు మరియు అస్తవ్యస్తమైన కుటుంబ పరిస్థితులు టీనేజర్ల జీవితంలో కీలక పాత్ర పోషిస్తాయి. కానీ మెయి లీకి, తన తల్లికి విధేయతను చూపించే కుమార్తెగా మరియు కౌమారదశలో ఉన్న గందరగోళానికి మధ్య నలిగిపోతున్న ఆత్మవిశ్వాసం కలిగిన 13 ఏండ్లుగా టీనేజరుగా, ఇంకా మూర్ఖంగా వ్యవహరిస్తున్న జంతువుగా ఉంటుంది. డోమీ షి దర్శకత్వం వహించిన, డిస్నీ మరియు పిక్సర్ల తెరకెక్కించిన టర్నింగ్ రెడ్ మెయి లీతో కలిసి మనల్ని విపరీతమైన ప్రయాణంలో తీసుకువెళుతుంది. ఆమె తన భావోద్వేగాల ద్వారా ప్రేరేపించబడిన అతిపెద్ద బలహీనతను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఒక పెద్ద రెడ్ పాండాగా మారుతుంది. మహిళా దర్శకురాలు, నిర్మాత, విజువల్-ఎఫెక్ట్స్ సూపర్వైజర్ మరియు ప్రొడక్షన్ డిజైనర్‌తో పాటు దాని లీడ్ క్రియేటివ్లలో మొత్తం మహిళా సృజనాత్మక బృందాన్ని కలిగి ఉన్న డిస్నీ మరియు పిక్సర్ల మొదటి చిత్రం కూడా ఇదే. మెయిలీ మరియు ఆమె స్నేహితులు తమ టర్నింగ్ రెడ్ క్షణాలను మార్చి 11న నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అందుబాటులోకి తీసుకురాగా, స్వీయ అంగీకారం, నిజమైన స్నేహాలకు సంబంధించిన మనోహరమైన కథను ఆంగ్లం, హిందీ, తమిళం, తెలుగు మరియు మలయాళంలో వీక్షించండి.
తన కూతురి విచిత్రమైన సామర్థ్యాల గురించి తెలిసిన మెయిని అతిగా భరించే తల్లి మింగ్ లీకి గాత్రదానం చేసిన సాండ్రా ఓహ్ మాట్లాడుతూ, 'మింగ్ హైపర్ విజిలెంట్‌గా ఉంటుందని- ఆమె కోసం చాలా ఆశించే తల్లిగా ఉంటుంది. మింగ్ తన కుమార్తె తన నుంచి ఏదైనా దాచాలని కోరుకోనప్పటికీ, మింగ్ తన స్వంత రహస్యాన్ని కలిగి ఉంది` అని ఆమె పేర్కొన్నారు.
టర్నింగ్ రెడ్ అనేది ఎక్కువగా మెయి కథ అయితే, సాండ్రా ఓహ్ కోసం టీనేజర్ ను మాత్రమే నావిగేట్ చేసే మార్పు కాదు. మింగ్ స్వయంగా కొద్దిగా మార్పు చెందవలసిన అవసరం ఉంది. ఆమె తన కూతురిని గాఢంగా ప్రేమిస్తుంది కానీ ఆమె యువతిగా మారుతున్న పరిస్థితులను ఆమెను అంగీకరించాలి` అని ఆమె పేర్కొన్నారు.
టొరంటోలో సినిమా సెట్ చేయబడటం మాకు సంతోషంగా ఉందని పేర్కొన్న ఓహ్ మట్లాడుతూ, 'మీరు సెషన్‌కి వచ్చినప్పుడు, వారు యానిమేట్ చేసిన వాటిని మీకు చూపిస్తారు. ఓపెనింగ్ సీక్వెన్స్ లో, మెయి వీధిలో నడుస్తున్నప్పుడు, అది ఏ మూలలో ఉందో నాకు బాగా తెలుసు. కథ చెప్పడంలో వ్యక్తిగత పెట్టుబడిని మీరు భావిస్తున్నందున ఇది చాలా ఉత్తేజకరంగా ఉంటుంది` అని పేర్కొన్నారు.
ఈ చిత్రానికి డోమీ షి మరియు జూలియా చో రచన అందించగా, లిండ్సే కాలిన్స్ నిర్మించారు. సాండ్రా ఓహ్తో పాటు, సినిమా పాత్రలకు రోసాలీ చియాంగ్, ఓరియన్ లీ, అవా మోర్స్, మైత్రేయి రామకృష్ణన్, హైయిన్ పార్క్, వాయ్ చింగ్ హో, జేమ్స్ హాంగ్ తదితరులు గాత్రదానం చేశారు.
ది టర్నింగ్ రెడ్‌లో మెయి లీ మరియు ఆమె స్నేహితులు టీనేజ్ జీవితంలోని ఒడిదుడుకులను అధిగమిస్తూ చేస్తున్న వారి ప్రయాణంలో వారిని చేరేందుకు మార్చి 11 నుంచి ప్రసారమవుతున్న దీన్ని వీక్షించేందుకు డిస్నీం హాట్స్టార్లోకి ట్యూన్ చేయండి!