Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీజన్ 3లో 10 మంది విజేతలను ప్రకటించింది
బ్రిటానియా మారీ గోల్డ్ 2019 నుంచి 10 మంది హోమ్ప్రినర్స్కు రూ.1 కోటి మూల ధనాన్ని అందించింది
హైదరాబాద్ : భారతదేశంలో గృహిణుల్లో వ్యాపరదక్షత ఆకాంక్షలకు ఉత్తేజాన్ని అందించే ఉద్యేశంతో భారతదేశపు నెం.1 బేకరీ ఫుడ్స్ కంపెనీ బ్రిటానియా ఇండస్ట్రీస్ మారీ గోల్డ్ మై స్టార్టప్ ఇనీషియేటివ్ సీజన్ 3లో 10 మంది విజేతలను ప్రకటించింది. ఈ కార్యక్రమంలో భాగంగా 10 మంది విజేతలు వారి వ్యాపారాన్ని ప్రారంభించేందుకు తలా రూ.10 లక్షలు అందించి గౌరవిస్తోంది. ఈ కార్యక్రమంలో బ్రిటానియా ఇండస్ట్రీస్ లిమిటెడ్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అమిత్ దోషి మరియు షీరోస్ మరియు మహిళా మనీ వ్యవస్థాపకురాలు సైరీ చహాల్ పాల్గొన్నారు.
ఆర్థికంగా స్వతంత్రులు అయ్యేందుకు మరియు వారిని 'ఉమెన్ప్రినర్స్` గా మారాలని కోరుకునే వారికి బ్రిటానియా మారీ గోల్డ్ మై స్టార్టప్ వేదికగా నిలుస్తోంది. సీజన్ 3.0లో ఎంపికైన అభ్యర్థులు తమ ఉత్తమ ఆలోచనలను సైరీ చహాల్, రశ్మి బన్సాల్, రేణు షా, ఆకాంక్ష భార్గవ, ఆర్తి మోహన్, రుచికా భువల్కా, లతా చంద్రమౌళి మరియు ప్రియా బహద్దూర్ తదితర ఉమెన్ప్రినర్స్ తో కూడిన న్యాయనిర్ణేతలకు వర్చువల్ విధానంలో వివరించారు. న్యాయనిర్ణేతల్లో ప్రముఖ పాత్రికేయులు, బ్రిటానియా నాయకత్వ బృందం ఉంది.
బ్రిటానియా మారీ గోల్డ్ మై స్టాపర్టప్ పోటీ సీజన్ 3 సెప్టెంబరు 2021లో ప్రారంభమైంది మరియు దేశంలో అన్ని ప్రాంతాల గృహిణుల నుంచి విస్తృత వ్యాపార ఆలోచనలతో 13 లక్షల దరఖాస్తులతో అద్భుతమైన ప్రతిస్పందన అందుకుంది. అర్జీదారులు వారి ఎంట్రీలను టెలిఫోన్ కాల్స్, వెబ్సైట్ మరియు యాప్ ద్వారా సమర్పించేందుకు అవకాశం కల్పించారు. ఈ బ్రాండ్ మహారాష్ట్ర నుంచి అత్యంత ఎక్కువగా 20% దరఖాస్తులను అందుకోగా, అనంతరం తమిళనాడు మరియు పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చాయి.
బ్రిటానియా మరియు మామ్ప్రెస్సో నిర్వహించిన సమీక్ష ప్రకారం 77% గృహిణులు తామే సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించాలన్న అభిలాషను కలిగి ఉండగా, ఈ ప్రయాణానికి సాంకేతికత మద్దతు ఇస్తుందని గుర్తించారు. సాంకేతికతను మహిళా పారిశ్రామికవేత్తలకు అత్యంత పెద్ద మద్దతుదారు అని గుర్తించిన బ్రిటానియా మారీగోల్డ్ మై స్టార్టప్ కార్యక్రమం సీజన్ 3 గృహిణులకు డిజిటల్ కౌశల్యాలను అందించడాన్ని గూగుల్ భాగస్వామ్యంతో అందించింది. అభ్యర్థులు అందరికీ గూగుల్ డిజిటల్ మరియు బిజినెస్ స్కిల్లింగ్ వనరులను హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, బెంగాలి మరియు ఇంగ్లీష్ భాషల్లో ఇచ్చింది.
మారీ గోల్డ్ మై స్టాపర్టప్ గత 2 సీజన్లలో పలువురు విజేతలు నేడు రెస్టారెంట్లు, కంప్యూటర్ శిక్షణ కేంద్రాలు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, టైలరింగ్ తదితర విస్తృత స్థాయి రంగాల్లో విజయవంతమైన వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. వారిలో పలువురు మహిళలు వారి వ్యాపారానికి మహిళలనే నియమించుకోవడం ద్వారా అత్యంత నిరీక్షణల క్యాస్కేడ్ పరిణామాన్ని సృష్టిస్తున్నారు.
బ్రిటానియా ఇండస్ట్రీస్ లిమిటెడ్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అమిత్ దోషి మాట్లాడుతూ, 'ఆరవ ఆర్థిక జనాభా లెక్కల ప్రకారం మొత్తం పారిశ్రామికవేత్తల్లో 13.7 శాతం మహిళలు ఉన్నారు. అంటే, దేశంలో 58.5 మిలియన్ వ్యాపారుల్లో 8.05 మిలియన్ల మంది ఉన్నారు. బ్రిటానియా మారీ గోల్డ్ మై స్టార్టప్ కార్యక్రమం ద్వారా గృహిణుల సంభ్రమం మరియు వారి ఆలోచనలకు స్వతంత్ర మరియు విజయవం తమైన పారిశ్రామికవేత్తగా, వ్యాపారవేత్తగా కావాలన్న కలలను సాకారం చేసేందుకు మద్దతు ఇచ్చే లక్ష్యాన్ని కలిగి ఉంది. భారతదేశంలో 48% మంది మహిళలు ఉండగా, వారు మార్పనకు ఉత్ర్పేరకంగా పని చేయగలరు. మహిళలు నేతృత్వం వహిస్తే కుటుంబం మొత్తం ప్రగతి సాధిస్తుందని మేము బ్రిటానియాలో దృఢంగా విశ్వసిస్తాము. అలాగే, కుటుంబాలు ప్రగతి సాధించినప్పుడు దేశం ప్రగతి సాధిస్తుంది. భారతదేశంలో మహిళ సాధికారత ఎంపిక కాదు, అది అత్యంత అవసరమైనది. విజయవంతమైన మూడో సీజన్ ముగుస్తుండగా, మేము ఈ ప్లాట్ఫారం ద్వారా 3.8 మిలియన్లకు పైచిలుకు ఎక్కువ మంది గృహిణులకు శక్తియుతమైన వ్యాపార దక్షత ఆలోచనలను అందించుందకు మరియు వారిని ఒక వ్యాపారానికి యజమానులుగా అలాగే ఉద్యోగ సృష్టికర్తలుగా మార్చేందుకు అవకాశాన్ని కల్పిస్తున్నాము` అని వివరించారు.
గృహిణుల సాధికారతలో మారీ గోల్డ్ మై స్టార్టప్ క్యాంపెయిన్ తత్వాన్ని ప్రతిబింబించిన షీరోస్ మరియు మహిళా మనీ వ్యవస్థాపకురాలు సైరీ చహాల్ వృద్ధిలోకి వస్తున్న వ్యాపారవేత్తలకు మద్దతు ఇస్తున్నారు. 'తగినంత పెట్టుబడి అందుబాటు, స్నేహపూర్వకమైన మరియు అందుబాటులో ఉన్న ఆర్థిక వ్యవస్థ మహిళా పారిశ్రామికవేత్తలకు విజయవంతమైన వ్యాపర ప్రయాణానికి అత్యవసరం. బ్రిటానియా మారీ గోల్డ్ మై స్టార్టప్ ఛాలెంజ్ వృద్ధిలోకి వస్తున్న మహిళా వ్యాపారవేత్తలకు వారి ఆకాంక్షలకు అలాగే కౌశల్యాలను విక్రయించదగిన వ్యాపారాలుగా మార్చడం మహోన్నతమైన అవకాశంగా ఉంది. మేము మహిళా మనీలో ఈ పోటీలో విజేతల అవసరాలను పరిష్కరించేందుకు, అడ్డంకులు లేని రుణ అనుభవం ద్వారా మద్దతు ఇస్తున్నందుకు గర్విస్తున్నాము. ఈ విజేతలకు భవిష్యత్తులో వ్యాపారాన్ని నిర్వహించే సామర్థ్యం ఉందని మేము విశ్వసిస్తున్నాము మరియు వారికి వరుసగా మద్దతును ఇచ్చేందుకు మహిళా మనీ విజయవంతంగా రూపొందించిన ఆర్థిక పర్యావరణ వ్యవస్థ ద్వారా అందించాలని నీరీక్షిస్తున్నాము` అని తెలిపారు.
బ్రిటానియా మారీ గోల్డ్ మై స్టార్టప్ ఛాలెంజ్ 3.0 దేశంలో అన్ని ప్రాంతాల్లో వ్యాపార దక్షత ఉన్న మహిళలను గుర్తించింది.
విజేతల వివరాలు ఇలా ఉన్నాయి:
ర్యాంకు పేరు వయస్సు రాష్ట్రం వ్యాపార ఆలోచన
1 నిధి గండేచ 34 ఒడిశా గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ సేవలు
2 మేజర్ స్వప్న శర్మ 42 మహారాష్ట్ర మేజరు స్వప్న బంజరు భూమిలో ఆక్వా ఫార్మింగ్
చేసే ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. దీనితో వారు
తక్కువ భూమిని ఉపయోగించుకుని భారత
ప్రభుత్వ ఇంటిగ్రేటెడ్ వేస్ట్ ల్యాండ్ డెవలప్మెంట్
ప్రోగ్రామ్ (ఐడబ్ల్యూడిపి) మేరకు గరిష్ఠ
వినియోగాన్ని చేసుకోవచ్చు.
3 కళావతి జె 40 తమిళనాడు డైరీ ఫార్మింగ్
4 యాజిని దేవి 26 తమిళనాడు విద్యలో సామాజిక ఉద్యమం (కౌశల్యాభివృద్ధి),
అది వ్యక్తులకు వారి వ్యక్తిగత శ్రేష్ఠతను
సాధించేందుకు మద్దతు ఇస్తుంది. మన
సేవలు వారి వయస్సు, దైహిక మరియు
అవగాహన సామర్థ్యం, సామాజిక-ఆర్థిక
అంశాల ఆధారంగా కస్టమైజ్ చేయవచ్చు.
5 తన్మయి ఆర్. కాలెబర్ 44 కర్ణాటక బాలలకు వెబ్సైట్ స్టోరీస్బైచిల్ట్రన్.కాం. ఇది
బాలలకు వారి సాహిత్యాన్ని శ
ప్రచురించేందుకు ఉత్తమ కేంద్రం.
6 కల్పనా ఠాకూర్ 46 బీహార్ ఉత్తమ నాణ్యత కలిగిన పశులు నుంచి శ
పాలు ఉత్పత్తి చేసే డైరీ ఫారం
7 ఆర్తి కుమారి 38 బీహార్ ఇంటి వాకిలి వద్దే నేత్ర చికిత్స్ణ మొబైల్ శ
వ్యాన్ల ద్వారా సమగ్రమైన నేత్ర చికిత్స
8 ప్రాచి రోహన్ బిదవె 21 మహారాష్ట్ర సాధారణ ఆహారం మరియు బేకరీ బ్రాండ్
9 వైశాలి గావ్డె 42 మహారాష్ట్ర మహారాష్ట్ర బాలలకు, మహరాష్టకు చెందని
వారికి భాష నేర్పించే యాప్
10 మధు నాచమ్మాల్ ఎస్.ఎల్.38 తమిళనాడు సౌందర్య/చర్మ సంరక్షణ
(అరటితో తయారు చేసిన
ఉత్పత్తులు)