Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : కొనుగోళ్ల మద్దతుతో గురువారం భారత మార్కెట్లలో బుల్ రంకె వేసింది. అంతర్జాతీయ మార్కెట్లో సానుకూల అంశాలకు తోడు ఇప్పటికే భారీగా పడిపోయిన షేర్ల విలువల నేపథ్యంలో మదుపర్లు పెట్టుబడులకు ఆసక్తి చూపారు. దీంతో బీఎస్ఈ సెన్సెక్స్ 1,047 పాయింట్లు రాణించి 57,684కు చేరింది. ఎన్ఎస్ఇ నిఫ్టీ 312 పాయింట్లు లాభపడి 17,287 వద్ద ముగిసింది. హౌలీ సందర్బంగా శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లకు సెలవు. శని, ఆదివారాలు సాధారణ సెలవులు కావడంతో తిరిగి సోమవారం మార్కెట్లు తెరుచుకోనున్నాయి.