Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి 21,503 నియామకాలు పూర్తి చేయనున్నట్టు ప్రయివేటు రంగంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో 12,931 మందిని కొత్తగా తీసుకుంది. దీంతో పోల్చితే 90 శాతం శాశ్వత నియామకాలు పెరిగాయని పేర్కొంది.
కాప్ జెమినీలో భారీగా ఉద్యోగాలు
ఐటి రంగంలోని కాప్ జెమిని ప్రస్తుత ఏడాది భారత్‌లో 60వేల మంది కొత్త ఉద్యోగులను తీసుకున్నట్లు ప్రకటించింది. డిజిటల్ ఆధారిత సొల్యూషన్స్‌కు డిమాండ్ అంతకంతకు పెరుగుతుందని ఆ కంపెనీ సీఈఓ అశ్విన్ యాద్రి పేర్కొన్నారు. డిజిటల్ ఆధారిత సొల్యూషన్స్‌పై పట్టు ఉన్న నిపుణులు తమకు ఇప్పుడు చాలా అవసరమన్నారు.