Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొనుగోలుకు భారత కంపెనీల ఆసక్తి
న్యూఢిల్లీ : భారత ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు రష్యా చమురు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో అమెరికా, యూరప్ దేశాలు ఆంక్షలను విధించాయి. ఈ క్లిష్ల పరిస్థితుల నేపథ్యంలో రష్యా చమురును పలు పాశ్చత్య దేశాలు కొనడానికి నిరాకరిస్తున్నాయి. దీంతో చాలా దేశాలు రష్యా ముడిచమురు దిగుమతులకు స్వస్తి పలికాయి. ఈ క్రమంలో భారత్ లాంటి దేశాలకు రష్యా తన ముడి చమురుపై రాయితీ ప్రకటించింది. మార్కెట్ కంటే తక్కువ ధరకే చమురును సరఫరా చేస్తామని ఆఫర్ ఇచ్చింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని భారత పీఎస్‌యూలు భావిస్తున్నాయని ఈ వ్యవహారంతో సంబంధం కలిగిన వర్గాలు తెలిపాయి. దీనిపై ఒక్కటి రెండు రోజుల్లో స్పష్టత రానుంది. ఈ లావాదేవీలు సరళంగా జరగడానికి భారత, రష్యా అధికారులు, బ్యాంకర్లు, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లు తీవ్ర కసరత్తులో ఉన్నారు. ఇదే విషయంలో చమురు కంపెనీలు, బ్యాంకర్లు సులభ చెల్లింపుల కోసం ఆర్బీఐ అధికారులతో సమీక్షలు జరుపుతున్నారు. ప్రస్తుతం రష్యా నుంచి సరఫరాకు ఓడల కొరత కూడా నెలకొంది. దీని పరిష్కారంపై కూడా అధికారులు దృష్టి పెడుతున్నారు. భారత చమురు కంపెనీలు తమ ఆసక్తులు, భద్రతపై దృష్టి సారిస్తున్నాయని ఓ పీఎస్‌యూ ఎగ్జిక్యూటివ్ పేర్కొన్నారు. రష్యా నుంచి అనేక యూరప్ దేశాలు చమురు కొనుగోలు చేస్తున్నప్పుడు భారత్ ఎందుకు చేయకూడదన్నారు. చమురు సంప్రదాయ ప్రాంతాలైన మధ్య ఈశాన్య దేశాలు ధరలు పెంచినప్పుడు రష్యాలో చౌకగా లభించే చమురు అవకాశాలను భారత కంపెనీలు ఉపయోగించుకోవడం మంచి అవకాశమేనన్నారు.
రిలయన్స్ తిరస్కరణ..!
రష్యాపై ఆంక్షల నేపథ్యంలో తమ ప్లాంట్ల కోసం రష్యా ముడిచమురు కొనుగోలును తిరస్కరించే అవకాశం ఉందని ఆ కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ బిజినెస్ హెడ్ క్రాకర్ రాజేశ్ రావత్ పేర్కొన్నారు. ప్రస్తుతం రిలయన్స్ తన రిఫైనరీ కాంప్లెక్స్ కోసం రష్యా యురల్స్ ముడిచమురును నేరుగా కొనుగోలు చేస్తోంది. రిఫైనరీలో అధిక భాగం మధ్య తూర్పు, అమెరికా నుంచి తీసుకుంటుంది.