Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో పన్ను భారాలు పెరిగాయని ప్రత్యక్ష పన్నుల వసూళ్ల గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. కరోనా కాలంలోనూ ప్రజలను పన్నుల రూపేనా ప్రభుత్వాలు పిండేశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి మార్చి 15 నాటికి దేశంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు 48 శాతానికి ఎగిశాయని ప్రభుత్వ గణంకాలు వెల్లడించాయి. భారత్ చరిత్రలో ఈ స్థాయి వసూళ్లు చోటు చేసుకోవడం ఇదే తొలిసారని స్వయంగా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కరోనా కాలంలో వ్యాపార కార్యకలాపాలు పెద్ద ఆశాజనకంగా లేకపోయినప్పటికీ.. ఇంత పెద్ద మొత్తంలో పెరుగుదల చోటు చేసుకోవడం విశేషం. 2016 మార్చి 16 వరకు రూ.13,63,038 కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్లు నమోదయ్యాయి. ఇంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ. రూ.9,18,431 కోట్ల వసూళ్లు జరిగాయి. దీంతో పోల్చితే గడిచిన పదకొండున్నర మాసాల కాలంలో 48 శాతం పెరుగుదల చోటు చేసుకుంది.