Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, తమిళంలో అందుబాటులో..
హైదరాబాద్: వినోదం మరియు క్రికెట్ భాషను మాట్లాడే దేశం కోసం, డిస్నీ+ హాట్‌స్టార్ అన్ని క్రికెట్‌టైన్‌మెంట్ డోస్‌లకు విజయవంతమైన ఒన్-స్టాప్ డెస్టినేషన్ గా నిలిచి, అసమానమైన వీక్షణ అనుభవం కోసం రెండు ప్రపంచాల్లోని ఉత్తమమైన వాటిని ఒకే వేదిక కిందకు తీసుకువస్తోంది. క్రికెట్టైన్మెంట్ను మరింత మెరుగుపరుస్తూ, ఈ వేదిక ఇప్పుడు డిస్నీ+ హాట్‌స్టార్ లో 21 మార్చి 2022(నేటి) నుంచి ఈ ఏడాది బ్లాక్‌బస్టర్ చిత్రం - 83ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. సూపర్ స్టార్లు రణ్వీర్ సింగ్ మరియు దీపికా పదుకొనే నటించిన, 1983 ప్రపంచ కప్ విజయానికి సంబంధించిన జ్ఞాపకాల వరుసలో నాస్టాల్జిక్ ట్రిప్‌ను డిస్నీ+ హాట్‌స్టార్ లో హిందీ అలాగే మలయాళం, తెలుగు, కన్నడ మరియు తమిళంలో అందుబాటులో తీసుకువచ్చింది. ఈ విజయవంతమైన ప్రయాణంలో భాగంగా మార్చి 20న స్టార్ గోల్డ్‌లో విజయవంతమైన టెలివిజన్ ప్రీమియర్‌ను చూసింది. డిజిటల్ మరియు టెలివిజన్ ప్రీమియర్ శక్తివంతమైన కలయికతో, భారతదేశ వ్యాప్తంగా క్రికెట్ మరియు బాలీవుడ్ అభిమానులు ఈ చిత్రాన్ని తమ ప్రాధాన్యతలు కలిగిన ప్లాట్‌ఫారమ్‌లో, వారి సౌలభ్యం మేరకు మరియు వారు ఇష్టపడే భాషలో చూడవచ్చు.
డిస్నీ స్టార్ కంటెంట్ - డిస్నీ+ హాట్‌స్టార్ మరియు హెచ్ఎస్ఎమ్ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్ హెడ్ గౌరవ్ బెనర్జీ మాట్లాడుతూ, 'క్రికెట్ మరియు వినోదాన్ని పవిత్రంగా భావించే దేశంలో, వివేకం కలిగిన మా వీక్షకుల కంటెంట్ ఆకలిని తీర్చేందుకు, రెండు ప్రపంచాలలోని ఉత్తమమైన వాటిని తీసుకు వచ్చేందుకు మేము స్థిరంగా ప్రయత్నిస్తున్నాము.హిందీలో టెలివిజన్‌లో మరియు హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ మరియు తమిళంలో డిస్నీ+ హాట్‌స్టార్ లో 83వ ఏడాదికి చెందిన స్పోర్ట్స్ బ్లాక్‌బస్టర్‌ను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా, మేము మా ప్రేక్షకులకు వారి ఇండ్లలో సౌకర్యవంతంగా నాణ్యమైన కంటెంట్‌ను అందించడాన్ని కొనసాగిస్తున్నాము. డిస్నీ+ హాట్‌స్టార్ లో క్రికెట్ సీజన్లో 83ను విడుదల చేయడం ద్వారా మా ప్రేక్షకులు క్రికెట్, నాటకీయత మరియు వినోదాలతో కూడిన మా అద్భుతమైన ప్యాకేజీని ఆనందిస్తారని మేము ఆశిస్తున్నాము` అని పేర్కొన్నారు.
కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన, 83సినిమాలో జూన్ 25, 1983న దిగ్గజ ఆటగాడు కపిల్ దేవ్ సారథ్యంలో భారతదేశం తొలిసారిగా క్రికెట్ ప్రపంచ కప్‌ను గెలుచుకున్నప్పుడు దేశాన్ని ఉర్రూతలూగించిన ఉత్సాహం మరియు ఉల్లాసవంతమైన క్షణాలకు మళ్లీ మిమ్మల్ని తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉంది. కపిల్ దేవ్ పాత్రను రణ్వీర్ సింగ్, అతని భార్య రోమి పాత్రను దీపికా పదుకొనే పోషించగా, ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, తాహిర్ రాజ్ భాసిన్, సాకిబ్ సలీమ్, జతిన్ సర్నా మరియు చిరాగ్ పాటిల్ కూడా కీలక పాత్రల్లో నటించారు.
కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన '83`ని వీక్షించేందుకు డిస్నీ+ హాట్‌స్టార్ ను ట్యూన్ చేయండి - ఇది మీకు భారతదేశం గెల్చుకున్న మొదటి ప్రపంచ కప్ విజయానికి తీసుకువెళ్లే ఒక ఎపిక్ స్పోర్ట్స్ డ్రామాను చూపిస్తుంది.