Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వినోదాన్ని ఇష్టపడే వారి కోసం ఈ సెగ్మెంట్లోనే అత్యంత శక్తిమంతమైన స్నాప్‌డ్రాగన్ 680 చిప్సెట్, 6000mAh భారీ బ్యాటరీ
హైదరాబాద్ : దేశపు నెంబర్ వన్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షామి ఇండియాకు చెందిన రెడ్మి ఇండియా తన ప్రఖ్యాత రెడ్మి నెంబర్ సిరీస్‌లో రెడ్మి 10 ఆవిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. కొత్తగా లాంచ్ చేసిన ఈ రెడ్మి 10లో శక్తిమంతమైనక్వాల్కామ్® స్నాప్‌డ్రాగన్TM 680 చిప్సెట్, ఎక్కువ బ్యాటరీ లైఫ్‌తో పాటు 50 ఎంపీ గొప్ప కెమెరా వంటి ఆకట్టుకునే అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. వెనుక వైపు టెక్చర్డ్ ఫినిష్ భారీ డిస్ప్లేతో శక్తిమంతమైన పనితీరు, నిరాడంబరతతో కూడిన సమ్మేళనం రెడ్మి 10.
ఈ లాంచ్ సందర్భంగా రెడ్మి ఇండియా బిజినెస్ హెడ్ స్నేహ తైన్వాలా మాట్లాడుతూ 'రెడ్మిలో మేము అందించే అన్ని ఉత్పత్తుల వెనుక ఉన్న సృజనాత్మకత అనే శక్తి దాగి ఉంటుంది. సాంకేతిక పరిజ్ఞానం అందరికీ అందుబాటులో ఉండాలని ఆక్షాంక్షించే మేము భారతదేశంలో తయారు చేస్తున్న స్మార్ట్ ఫోన్ల ద్వారా భారతీయ వినియోగదారులకు సుసంపన్నమైన అనుభూతి అందించడంపై దృష్టి పెడుతున్నాము. భారతీయ వినియోగదారుల పెరుగుతున్న అవసరాలు తీర్చుతూ అద్భుతమైన రూపం, చక్కని పనితీరు కలిగిన రెడ్మి 10 ఆవిష్కరణతో ఈ సెగ్మెంట్లో ఉత్తమమైనవి అందిస్తున్నాం. శక్తివంతమైన పనితీరు, సుదీర్ఘ బ్యాటరీ జీవితం, ఉన్నతమైన కెమెరా సామర్థ్యంతో రెడ్మి 10 రోజువారీ వినియోగం కోసం అద్భుతమైన ఆవిష్కరణల కలిగి ఉంది. మా ఇతర అన్ని నంబర్ సిరీస్‌ల తరహాలోనే బడ్జెట్ సెగ్మెంట్లో అన్ని ఫీచర్లు అందిస్తూ వినియోగదారులకు స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించే విధానాన్ని రెడ్మి 10 మారుస్తుందని మేము విశ్వసిస్తున్నాముు ` అని అన్నారు.
ఉన్నతమైన పనితీరు
క్వాల్కామ్® స్నాప్‌డ్రాగన్™ 680 చిప్సెట్, 6nm ఆర్కిటెక్చర్‌తో ఈ ధర సెగ్మెంట్లో మొట్టమొదటిసారి అందిస్తున్న రోజంతా నడిచే రెడ్మి 10 తో ఎంతో సునాయాసంగా మల్టీటాస్కింగ్ చేయవచ్చు.
ఇందులోని 4x ARM కార్టెక్స్ A-73 @2.4GHz, 4x ARM కార్టెక్స్ A-53 @1.9GHzతో పాటు ఉన్న అడ్రెనో 610 @1.0 Ghz పనితీరును రెట్టింపు చేస్తుంది. ఈ సెగ్మెంట్లో అత్యంత శక్తిమంతమైన ప్రాసెసర్ కలిగిన రెడ్మి 10 చక్కని రీడ్ అండ్ రైట్ స్పీడ్ అందిస్తుంది. దీనిలోని UFS 2.2 స్టోరేజ్ UFS 2.1 కంటే 100% వేగంగా పనిచేస్తుంది. అన్ని వేళలా ఉన్నతమైన పనితీరు అందించేందుకు ఈ డివైస్‌లో 8 GB* వరకు విస్తరించుకోగలిగిన వర్చువల్ RAM బూస్టర్ అనే అప్‌గ్రేడెడ్ ఫీచర్ కలిగి ఉంది.
సాఫ్ట్వేర్ పరంగా చూస్తే నెంబర్ సిరీస్‌లో మొదటిసారి ఔట్ ఆఫ్ ది బాక్స్ MIUI 13 కలిగి ఉంది. ఇందులో ఎన్నో మెరుగైన ఫీచర్లు ఉన్నాయి.
శక్తిమంతమైన కెమెరా సెటప్
నచ్చినవన్నీ యూజర్లు క్యాప్చర్ చేసుకునేందుకు వీలుగా రెడ్మి 10లో డ్యూయల్ బ్యాక్ కెమెరా సెటప్ ఉంది. అందమైన ఫొటోగ్రఫీ అనుభూతి అందించడానికి, లైటింగ్ ఎలా ఉన్నా సరే, అత్యుత్తమ రంగులతో చైతన్యాన్ని అందించేలా ఇది డిజైన్ చేయబడి ఉంది. అందమైన క్లోజప్ షాట్స్ తీసేందుకు వీలుగా ఇందులో అధిక రిజల్యూషన్ 50ఎంపీ ప్రధాన సెన్సార్‌కు సపోర్టుగా 2ఎంపీ డెప్త్ సెన్సార్ ఉంది. సెల్ఫీ ప్రియుల కోసం 5వీూ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది.
శక్తితో నిండిన 6000mAh బ్యాటరీ
భారీ 6000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్‌తో చక్కని పనితీరు, రోజంతా నడిచే బలమైన బ్యాటరీ బ్యాకప్‌తో అద్భుతమైన సమ్మేళనంగా నిలుస్తుంది రెడ్మి 10. దీంతో10 గంటల వరకు నిరంతరాయంగా గేమింగ్ ఆడుకోవచ్చు. 146 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ ఆఫర్‌తో, రెడ్మి 10 24 రోజుల వరకు భారీ స్టాండ్‌బైని యూజర్లకు అందిస్తుంది.
టెక్సర్డ్ డిజైన్, కట్టిపడేసే డిస్ప్లే
కంటెంట్ వీక్షణ కంటికి ఇంపుగా ఉండేలా చేసేందుకు రెడ్మి10 - 6.71-అంగుళాల హెచ్డీ డిస్ప్లే కలిగి ఉంది. నెంబర్ సిరీస్‌లోనే ఇది అతి పెద్ద స్క్రీన్. భారీ 20.6:9 యాస్పెక్ట్ రేషియో కలిగిన రెడ్మి 10 యూజర్ల అనుభూతిని మరింత పెంచుతుంది. అన్ని స్ట్రీమింగ్ ఆప్షన్స్‌లో హెచ్డీలో చక్కని కంటెంట్ చూసేందుకు రెడ్మి 10 వైడ్‌వైన్ L1 సర్టిఫికేషన్ కలిగి ఉంది. మెరుగైన ఆడియో అనుభూతి అందించడానికి రెడ్మి10 అంతర్నిర్మిత 1.5W స్పీకర్ ఉంది. సంప్రదాయ 3.5 ఎం.ఎం. జాక్ కూడా ఇందులో ఉంది.
రెడ్మి నోట్ 10 సిరీస్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న రెడ్మి10 కూడా LOVEతో రూపొందించిన EVOL డిజైన్ లాంగ్వేజ్ కలిగి ఉంది. ప్రీమియం డిజైన్‌లో చూడముచ్చటైన 3 రంగులు – కరేబియన్ గ్రీన్, పసిఫిక్ బ్లూ, మిడ్నైట్ బ్ల్యాక్లో స్టైలిష్ టెక్చర్డ్ ఫినిష్ బ్యాక్‌తో ఇది లభిస్తుంది. సరళత, పనితీరు కలబోసిన ఈ ఫోన్లో అప్డేటెడ్ కెమెరా సెటప్ ఫోన్ వెనుక చక్కగా ఇమిడిపోయింది. సులభంగా ఉపయోగించుకునే హామీయే కాదు కెమెరాలో కనిపించని ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది. ఇది కెమెరా మాడ్యూల్లో కలిసిపోతుంది కాబట్టి ఎంతో సునాయాసంగా ఒక్క చేత్తో కూడా కెమెరా ఉపయోగించుకునేలా చేస్తుంది.
అత్యున్నత నాణ్యత ప్రమాణాలు మెయింటెయిన్ చేస్తూ రెడ్మి 10 కార్నింగ్ ® గొరిల్లా గ్లాస్ కలిగి ఉంది. ప్రమాదవశాత్తు డివైస్ పడిపోతే కాపాడుతుంది. గీతలు పడకుండా రక్షిస్తుంది. దీనిలోని రబ్బర్ సీల్స్ నీరు లోపలికి ప్రవేశించకుండా నిరోధించడమే కాదు తుప్పు పట్టని పోర్టులు కూడా కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ పై ఉండే మల్టీ-లేయర్ గ్రాఫైట్ షీట్ హీటింగ్ సమస్యల నుంచి స్మార్ట్‌ఫోన్‌ను రక్షించడంలో సాయపడి వేడిని వేగంగా వెదజల్లేలా చూస్తుంది.
ధర, లభ్యత
రెడ్మి10 ఫోన్లు ఎంఐ.షశీఎ, ఫ్లిప్‌కార్ట్.కామ్, ఎంఐ హోమ్, ఎంఐ స్టూడియో స్టోర్లలో 24 మార్చి 2022, మధ్యాహ్నం 12:00 గంటల నుంచి అందుబాటులో ఉంటుంది. 4GB+64GB వేరియంట్ ధర రూ.10,999, 6GB+128GB ధర రూ. 12,999. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సభ్యులు క్రెడిట్ కార్డులు, క్రెడిట్ EMI ఉపయోగించి రూ.1000 అదనపు తగ్గింపు పొందవచ్చు.