Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెన్సెక్స్ 571 పాయింట్ల పతనం
ముంబయి : అధిక పెట్రో ధరలలో ఇప్పటికే ఆందోళన వ్యక్తం అవుతున్న తరుణంలో చమురు ధరలు మరింత పెరగనున్నాయనే సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవి చూశాయి. అమ్మకాల ఒత్తిడితో వరుసగా రెండో సెషన్ సోమవారం కూడా తీవ్ర ఒత్తిడికి గురైయ్యాయి. తుదకు ఎస్ఈ సెన్సెక్స్ 571 పాయింట్లు కోల్పోయి 57,292కు పడిపోయింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 169.45 పాయింట్లు నష్టపోయి 17,118 వద్ద ముగిసింది. బీఎస్ఈ-30లో పవర్ గ్రిడ్, అల్ట్రాటెక్ సిమెంట్, ఆసియన్ పెయింట్స్, హెచ్యుఎల్, హెచ్సిఎల్ టెక్, కొటాక్ బ్యాంక్, ఎస్బిఐ, ఇండుస్ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్ సూచీలు అత్యధికంగా 1.5 శాతం నుంచి 3 శాతం వరకు నష్టపోయాయి. ఫైనాన్స్, ఆటో, ఎఫ్ఎంసిజి రంగాలు ప్రతికూలతను ఎదుర్కొన్నాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.7 శాతం, 0.4 శాతం చొప్పున తగ్గాయి.