Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రెడ్మీ కొత్తగా శక్తివంతమైన స్నాప్ డ్రాగన్ 680తో 6000 ఎంఎహెచ్ భారీ బ్యాటరీతో రెడ్మీ 10ని ఆవిష్కరించింది. దీంతో 10 గంటల వరకు నిరంతరాయంగా గేమింగ్ ఆడుకోవచ్చని ఆ కంపెనీ పేర్కొంది. ఎక్కువ బ్యాటరీ లైఫ్‌తో పాటు 50 ఎంపి కెమెరాతో అందిస్తున్నట్లు తెలిపింది. మార్చి 24 నుంచి అందుబాటులోకి రానున్న 4జిబి ర్యామ్, 64 జిబి మెమోరీ ఫోన్ ప్రారంభ ధరను రూ.10,999గా నిర్ణయించింది.