Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐఐలో ఆర్బీఐ గవర్నర్ దాస్ వెల్లడి
న్యూఢిల్లీ : భారత ఆర్థిక వ్యవస్థపై ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం స్వల్పంగానే ఉండనుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. సోమవారం పారిశ్రామికవేత్తల సంఘం సీఐఐ ఏర్పాటుచేసిన సమావేశంలో దాస్ మాట్లాడుతూ భారత వృద్ధిపై ఉక్రెయిన్ ప్రభావం స్వల్పంగా ఉండనుందన్నారు. దేశంలో ద్రవ్యోల్బణం కట్టడిలోనే ఉండనుందన్నారు. ఆర్థిక వ్యవస్థ అవసరాలకు తగ్గట్టుగా గత రెండేళ్లలో రూ.17 లక్షల కోట్ల ద్రవ్య లభ్యతను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ సమావేశంలో ఆది గోద్రేజ్, టివి నరేంద్రన్, సంజీవ్ బజాజ్, కెకి మిస్త్రీ తదితర పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. పరిశ్రమకు సంబంధించిన పలు సమస్యలను వారు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. బ్యాంక్‌ల వద్ద సరిపడ మూలధనం ఉందని దాస్ తెలిపారు. అంతర్జాతీయంగా నెలకొన్న పలు అనిశ్చిత్తులు కొన్ని సవాళ్లను విసురుతున్నాయని.. తాము వాటిని అధిగమించగలమని దాస్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న చమురు ధరలు వ్యవస్థలను గ్రీన్ ఎనర్జీ వైపు మళ్లించనున్నాయన్నారు. చమురు కొరత ఇంధన పునరుత్పాదన రంగానికి ఉత్సాహాన్ని ఇవ్వనుందన్నారు. గ్రీన్ ఎనర్జీలో పెట్టుబడులు పెరగనున్నాయన్నారు. రెండు బలమైన ఆర్థిక వ్యవస్థలు భిన్న దృవాల్లో ప్రయానిస్తున్నాయన్నారు. అయినా తాము రూపాయి విలువ స్థిరత్వాన్ని కొనసాగిస్తున్నామన్నారు.