Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : డైసన్ ఛారిటీ నిర్వహించే వార్షిక విద్యార్థి డిజైన్ పోటీ James Dyson Award ఇప్పుడు ప్రారంభమైంది మరియు యువ పరిశోధకుల నుంచి దరఖాస్తులు అందుకుంటోంది. ఇటీవలి సంవత్సరాల్లో పలు ఎంట్రీలు అందుకున్న అనంతరం ఈ పురస్కారం వ్యాపారశీలతకు ప్రముఖమైన మొదటి అడుగులకు మద్దతు ఇచ్చేందుకు, తన బహుమతి మొత్తాన్ని వృద్ధి చేసింది. ఈ ఏడాది జాతీయ విజేతలను సెప్టెంబరు నెలలో ప్రకటించనున్నారు కాగా, £5,000 (రూ.5 లక్షలు)లను వారి ఆవిష్కారాలను అభివృద్ధి చేసేందుకు అందుకుంటారు. ఇప్పటి వరకు ఈ పోటీలో బహుమతి నగదుతో 285కుపైచిలుకు పరిశోధనలు జరిగాయి. జేమ్స్ డైసన్ అవార్డులను 2005 నుంచి ఎంటర్ప్యూనరల్ అండర్ గ్రాడ్యుయేట్లకు అలాగే ఇంజినీరింగ్ మరియు డిజైనింగ్ విభాగంలో ఇటీవల పట్టభద్రులు అయిన వారికి ‘Design something that solves a problem’ (సమస్యను పరిష్కరించే డిజైన్)కు సవాలు విసురుతోంది. ప్రపంచ స్థాయిలోని భారీ సమస్యలకు విద్యార్థులు సంక్షిప్తంగా ఉద్దేశంతో విస్తృతంగా మరియు తేలికగా పనులను చేపట్టవలసి ఉంటుంది. గత విజేతలు ప్లాస్టిక్ మరు వినియోగానికి లభ్యత, కత్తి గాయాలతో ఎక్కువ రక్తస్రావం మరియు ఇంట్లోనే రోగ పరీక్ష తదితర సమస్యలకు పరిష్కరాలను కనుగొన్నారు. సర్ జేమ్స్ డైసర్ పోటీ గ్లోబల్ విజేతలను ఎంపిక చేస్తుంది; వారు ప్రముఖ పెట్టుబడిదారులు మరియు ఉన్నత వ్యక్తుల నుంచి గుర్తింపు పొందుతారు కాగా, ఇది వారి ఆలోచనలను నిజ జీవితంలో ప్రయోగాత్మకంగా వినియోగించుకోవడంలో ప్రముఖ అడుగుగా ఉన్నాయి. డైసన్ వ్యవస్థాపకుడు మరియు చీఫ్ ఇంజినీర్ సర్ జేమ్స్ డైసన్ మాట్లాడుతూ, ‘నాకు జేమ్స్ డైసన్ అవార్డు సమస్యను తెలివిగా పరిష్కరించేందుకు- యువ పరిశోధకులకు ఆయా అంశాల గురించి ప్రశ్నించేందుకు మరియు సవాళ్లు విసిరేందుకు అవకాశం ఇస్తుంది. ఈ పురస్కరం వారికి విశ్వాసాన్ని నింపుతుంది మరియు వారి ఆలోచనలకు ఒక వాస్తవ రూపాన్ని అందించేందుకు వేదిక అందిస్తుంది. వాస్తవంగా 70% మేర మా గత విజేతలు వారి ఆవిష్కారాలకు వాణిజ్య రూపాన్ని ఇచ్చారు. భవిష్యత్తులో పరిశోధకులకు వారి అద్భుతమైన మరియు జీవితాన్ని మార్చే ఆలోచనలను పరిశీలించేందుకు వేచి చూస్తున్నాను. వారికి మంచి జరగాలి!’’ అన్నారు.
విజేతలు దేన్ని నిరీక్షించవచ్చు?
నగదు బహుమతి. జాతీయ స్థాయిలో విజేతలు £5,000 (రూ.5 లక్షలు) నగదు మరియు గ్లోబల్ విజేతలు £30,000 (రూ.30 లక్షలు) అందుకోవడం ద్వారా వారి ఆలోచనలకు వాస్తవ రూపం ఇచ్చి తదుపరి దశకు తోడ్కొని వెళ్లేందుకు అవకాశం కలుగుతుంది.
ప్రచార మాధ్యమాల దృష్టి. జేమ్స్ డైసన్ పురస్కారం తన విజేతలను ప్రకటించినప్పుడు విజేతలు ప్రచార మాధ్యమాలు, ప్రజలు మరియు పరిశ్రమలోని వృత్తి నిపుణుల దృష్టిని ఆకట్టుకుంటారు మరియు ఉత్పత్తుల అభివృద్ధి అలాగే నెట్వర్కుకు తలుపులను తెరుస్తుంది అలాగే వేగానికి ఉత్ప్రేరకంగా నిలుస్తుంది.
గత విజేతల మద్దతు. ఈ ఏడాది పురస్కారం వారి ఆవిష్కారాలను వాణిజ్యీకరణ చేసేందుకు విజేతల నెట్వర్కును ఏర్పాటు చేశారు. గత విజేతలతో కార్యక్రమాలు మరియు నెట్వర్కింగ్ అవకాశాలు, పరస్పరం అనుసంధానమయ్యే, అనుభవాలను పంచుకునే మరియు ఇంటర్-విన్నర్ మెంటర్షిప్కు పరిగణించే అవకాశాలను అందిస్తుంది.
గత రెండేళ్లలో రికార్డు స్థాయిలో ఎంట్రీలు వచ్చాయి. ఇంజినీర్లు మరియు శాస్త్రవేత్తలు మన భవిష్యత్తులో కీలక పాత్రను పోషించడంలో గుర్తింపు ఇచ్చేలా James Dyson chose three global winners for the first time ఎంపిక చేయగా ప్రతి ఒక్కరికీ £30,000 నగదు బహుమతిని అందించారు.
ఈ ఏడాది గ్లోబల్ బహుమానాలు అందుబాటులో ఉంటాయి. అయితే మొదటిగా పాల్గొనే ప్రతి దేశం మరియు ప్రాంతానికి జాతీయ విజేతలు (5000 పౌండ్లు) మరియు ఇద్దరు జాతీయ రన్నర్స్-అప్లు ఉంటారు. జాతీయ విజేతలను డైసన్ ఇంజినీరింగ్ భాగస్వామ్యలో బయటి నుంచి వచ్చే న్యాయనిర్ణేతలు ఎంపిక చేస్తారు. ఈ 2022లో మొదటిసారిగా థాయ్‌ల్యాండ్ మరియు టర్కీలో పురస్కారాలు ప్రారంభమయ్యాయి.
జాతీయ స్థాయి పురస్కార గ్రహీతలు అంతర్జాతీయ ఎంపిక జాబితా అలాగే పురస్కరాల దశల్లో ముందుకు వెళుతుంటారు. అందులో జేమ్స్ డైసన్ తన గ్లోబల్ విజేతలను ఎంపిక చేస్తారు.
ఏది ఉత్తమ అవకాశాన్ని అందిస్తుంది?
అత్యుత్తమ ఆవిష్కరాలు సరళంగా ఉంటాయి. నిజ జీవితంలోని సమస్యలకు స్పష్టమైన మరియు తెలివైన పరిష్కారాలను అందిస్తాయి. భారతదేశంలో గత ఏడాది జాతీయ విజేత లైఫ్బాక్స్ పరిశోధకుడు దేవల్ కరియా కాగా, లైఫ్ బాక్స్ పథకాలను అవయవాలను ఒక చోటు నుంచి మరో చోటుకు తీసుకు వెళ్లేందుకు డ్రోన్లను వాహకంగా వినియోగించే ఉద్దేశాన్ని కలిగి ఉంది. పరికల్పన దశ నుంచి పలు ఆలోచనలను పలుసార్లు చర్చించి, అనేక ప్రోటో టైప్లను అభివృద్ధి చేశారు. వినూత్న కూలింగ్ సిస్టమ్ ద్వారా అవసరమైన భారం మరియు శక్తిని తగ్గించారు. ప్రయోగాల ద్వారా ద్రవాల పంపిణీ మరియు కూలింగ్ సబ్-సిస్టమ్‌ను మెరుగుపరిచారు.
లైఫ్బాక్స్ పరిశోధకుడు దేవల్ కరియా మాట్లాడుతూ:
‘‘భారతదేశంలో 200 హృదయాల మార్పిడి జరుగుతుండగా, 50,000కుపైగా ఎక్కువ ప్రజలకు అవసరం ఉంది. సంస్థాగతమైన అంశాలను పక్కన పెడితే హృదయాలను దాతల నుంచి స్వీకరించడం నుంచి సాగించే క్రమంలో ఉన్న సామర్థ్య లేమి ఈ అంతరాన్ని భర్తీ చేయడంలో ప్రముఖ అడ్డంకిగా ఉంది’’ అని పేర్కొన్నారు.
‘‘ఈ పథకం సిపిడిఎంలో ప్రొ.బి.గురుమూర్తి అలాగే ప్రొ.ఎ.ఘోషాల్ బోధించిన పాఠాల ఫలితం కాగా, వారు అవయవాల తరలింపుకు డ్రోన్ల వినియోగాన్ని ప్రతిపాదించారు. అదేమైనప్పటికీ సరైన సంరక్షణ విధానాలు లేకుండా డ్రోన్లను భారతదేశంలో హృదయ రవాణాకు వినియోగించడం సరికాదని గుర్తించరారు. దీనితో హృదయం దేహం బయట జీవించి ఉండే సమయాన్ని విస్తరించడం, తీసుకు వెళ్లే సమయానికి ఎక్కువ ప్రాధాన్యతలపై దృష్టి సారించారు’’ అని పేర్కొన్నారు.
డైసన్ ఇంజినీర్స్ జేమ్స్ డైసన్ అవార్డులకు దరఖాస్తులు పంపుకునేందుకు దేన్ని నిరీక్షిస్తారో తెలుసుకోండి. దీర్ఘకాలం నుంచి జేమ్స్ డైసన్ అవార్డు న్యాయనిర్ణేతల నుంచి డైసన్‌లో న్యూ ప్రొడక్ట్ ఇన్నోవేషన్ విభాగంలో ఉపాధ్యక్షుడు పీటర్ గమ్మాక్ నుంచి డైసన్ న్యూస్ రూమ్ నుంచి here ఆలకించండి:
అవకాశాలకు ఉత్తేజన:
ఈ పురస్కారం యువ పరిశోధకులకు అంతర్జాతీయ మాధ్యమానికి పరిచయం చూసుకుంటుండగా, దీనితో వారికి వారి ఆలోచనలను అభివృద్ధి చేసుకునేందుకు మరింత పెట్టుబడి, అలాగే అవకాశాలు లభించేలా చేస్తుంది. కాగా, 2014లో అంతర్జాతీయ స్థాయిలో పుర్కరాన్ని అందుకున్న mOm incubators శిశువులు ఎంపికకు ఎక్కువ అనుకూలకరమైన ప్రాధాన్యతలు ఇస్తుంది; అన్ని పరీక్షలు ఉత్తీర్ణత సాధించిన తర్వాత మూడు యు.కె. ఎన్హెచ్ఎసఖ్ ట్రస్టులను వినియోగించుకుంటుంది మరియు 20కు పైగా చిన్నారుల జీవితానికి మద్దతు ఇచ్చింది. ఎంఓఎంకె ప్రపంచ వ్యాప్తంగా శిశువుల సంరక్షణకు మద్దతు ఇచ్చేందుకు మహోన్నత ఆలోచనలకు పథకాలు సిద్ధమయ్యాయి. అలాగే 2017లో యుఎస్ జాతీయ రన్నర్-అప్‌గా నిలిచిన SoaPen వర్ణరంజిత సబ్బు కలిగిన పెన్ను కాగా, సురక్షితంగా చేతులు కడుక్కోవడాన్ని ఉత్తేజిస్తుండగా, వారి ఆవిష్కారాలను వాణిజ్యీకరణ చేయగా, ప్రతిష్ఠిత ఫోర్బ్స్ 30 అండర్ 30 జాబితాలో చేరింది. సోపెన్ ఇప్పుడు అమెరికా వ్యాప్తంగా తన ఉత్పత్తుల వ్యాప్తిని వృద్ధి చేసుకోగా, కొవిడ్-19 మహమ్మారి సమయంలో డిమాండ్లను భర్తీ చేసేందుకు, హ్యాండ్ శానిటైజర్‌ను సృష్టించింది. అలాగే, 2011లో సింగపూర్‌కు చెందిన రన్నర్-అప్ ఆలోచనను Rabbit Ray 23 దేశాల్లోని 44 ఆసుపత్రుల్లో వినియోగించుకుంటున్నారు. ఇది ఆసుపత్రి సిబ్బందికి బాలలకు వైద్య చికిత్సలు అందించే సమయంలో వివరించే కమ్యూనికేషన్ ఉపకరణంగా ఉంది. దీన్ని పరిశోధించిన ఎస్తర్ వాంగ్, అప్పటి నుంచి పురస్కార విజేత ఆరోగ్య శిక్షణ కంపెనీ జాయ్టింగల్ను ప్రారంభించారు మరియు వారి ర్యాబిట్ రే ఆవిష్కారం టీకా నుంచి కీమోథెరపీ వరకు వైద్య సంబంధిత కమ్యూనికేషన్‌కు మద్దతు ఇస్తుంది.