Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దేశంలో అతి వేగంగా వృద్ధి చెందుతున్న కారు తయారీదారు కియా ఇండియా, కియా కారెన్స్ కస్టమర్స్ కి ప్రత్యేకంగా ఎన్నో సేల్స్ మరియు ఆఫ్టర్ సేల్స్ చొరవల్ని ప్రకటించింది. కంపెనీ 'మై కన్వీనియెన్స్ ప్లస్' కార్యక్రమాన్ని పరిచయం చేసింది. ఇది కస్టమర్లకు సమగ్రమైన కవరేజ్ మరియు మనశ్సాంతిని ఇస్తుంది. ఇంకా, భారతదేశంలో మరియు పరిశ్రమలోనే తొలిసారిగా ప్రత్యేకించి కారెన్స్ కస్టమర్స్ కోసం విలువ చేర్చబడిన ఉత్పత్తుల్ని కూడా ప్రారంభించింది. ఇవి ఎన్నో సౌకర్యానికి సంబంధించిన ప్రయోజనాల్ని అందిస్తాయి. ఇది బహుళ ఫైనాన్స్ పథకాలతో కలిసి కియా కారెన్స్ కస్టమర్స్ కి మరింత అందుబాటులో ఉండేలా చేస్తాయి. హర్ దీప్ సింగ్ బ్రార్, వైస్ ప్రెసిడెంట్ మరియు సేల్స్ & మార్కెటింగ్ ప్రధాన అధికారి, కియా ఇండియా ఇలా అన్నారు, "మేము చేసే ప్రతి పనిలో ఒక భిన్నమైన అనుభవాన్ని మా కస్టమర్లకు కేటాయించడం ద్వారా కియా ఇండియా వారికి గొప్ప ఉత్పత్తులు మరియు సేవల్ని అందించడానికి ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. మై కన్వీనియెన్స్ ప్లస్ మరియు బహుళ కొత్త విలువైన ప్రతిపాదను వంటి విలక్షణమైన సేల్స్ మరియు ఆఫ్టర్ సేల్స్ చొరవలతో, మేము కియా బ్రాండ్ అనుభవాన్ని మా కస్టమర్ల వద్దకు తీసుకు వెళ్లడాన్ని కోరుకుంటున్నాము. మన దేశంలో కారు కొనుగోలు చేయడం అనేది ఒక ఉద్వేగభరితమైన భావన, తమ కారు యాజమాన్యం ప్రయాణంలో ప్రతి అడుగులో మా కస్టమర్లకు పూర్తి మనశ్సాంతిని నిర్థారించడానికి మేము నిరంతరం ప్రయత్నిస్తాం."
మై కన్వీనియెన్స్ ప్లస్
'మై కన్వీనియెన్స్ ప్లస్ ' అనేది కారెన్స్ కస్టమర్స్ కోసం ఒక ప్రత్యేకమైన ఆఫ్టర్ సేల్స్ చొరవ. ఇది క్రమానుగత నిర్వహణ, దీర్ఘకాలం వారంటీ, టైర్ అల్లాయ్ రక్షణ సహా రోడ్ సైడ్ సహాయం వంటి ఎన్నో వాటిని కవర్ చేసే ప్యాకేజ్ ని అందిస్తుంది, తద్వారా కస్టమర్లకు సమగ్రమైన కవరేజ్ మరియు పూర్తి మనశ్సాంతిని అందిస్తుంది. కస్టమర్లు ఎంపిక చేసుకోవడానికి ఆప్షన్స్ కేటాయించబడతాయి మరియు వారు ప్రీమియం మరియు లగ్జరీ ప్యాకేజ్ నుండి ఎంచుకోవచ్చు. ఇవి వరుసగా 4 మరియు 5 సంవత్సరాలు కవరేజ్ ని ఇస్తాయి. సేవా ఖర్చులో ద్రవ్యోల్బణం రక్షణ, యావత్ భారతదేశంలో చెల్లుబాటు, వ్యక్తిగతీకరణ, పారదర్శకత మరియు సరళత వంటి అదనపు ప్రయోజనాల్ని కూడా ఈ చొరవ అందిస్తోంది.
విలక్షణమైన పథకాలు
కస్టమర్స్ యొక్క సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని మరియు ఉత్పత్తులు సులభంగా అందుబాటులో ఉండేలా కియా ఇండియా కారెన్స్ కస్టమర్స్ కోసం బహుళ విలువలు కలిగిన ప్రతిపాదనల్ని ప్రకటించింది.
కేర్ షీల్డ్: భారతదేశంలో మరియు పరిశ్రమలోనే మొదటి స్కీం, దాదాపుగా ఎటువంటి ప్రశ్నలు అడగకుండానే యాక్సిడెంటల్ రిపైర్ ఆప్షన్ అందిస్తోంది.
కేర్ షీల్డ్+: భారతదేశం మరియు పరిశ్రమలోనే మొదటిసారిగా గరిష్టంగా రెండు సంఘటనల్ని కవర్ చేస్తూ ప్రమాదం వలన కలిగిన చట్టబద్ధమైన క్లెయిమ్ ని సమర్థించడంలో భరించిన ఖర్చులో ఐఎన్ఆర్ 1 లక్ష వరకు వాపసు చెల్లిస్తుంది.
కస్టమర్ తప్పుగా ఇంధనం భర్తీ చేయడం వలన కలిగిన లోపానికి ఇంజన్ ని రక్షించే సౌకర్యం. మరోసారి విలక్షణమైన విలువ ప్రతిపాదన మరియు పరిశ్రమలోనే మొదటిసారి తీసుకున్న చొరవ.
అదనంగా, ఆన్ లైన్ బుక్కింగ్ పై (ఐసీఐసీఐ బ్యాండ్ డెబిట్ & క్రెడిట్ కార్డ్స్ తో) 10% క్యాష్ బ్యాక్ సహా ఆకర్షణీయమైన ఫైనాన్స్ పథకాల్ని కూడా కంపెనీ పరిచయం చేసింది. ఆన్-రోడ్ ఫైనాన్సింగ్ అతి తక్కువగా 7.10%కి ఆరంభమవుతుంది మరియు ఎంపిక చేయబడిన భాగస్వాములతో 100% ప్రాసెసింగ్ ఫీజు రద్దు చేయబడుతుంది.
కస్టమర్ యొక్క యాజమాన్యం అనుభవాన్ని పెంచడానికి మరియు సేల్స్, సేవలు, కస్టమర్ బహుమతులు, ఇతర కీలకమైన ఫీచర్స్ సహా ఎన్నో ప్రయోజనాల్ని కియా ఇండియా ఇటీవల పరిశ్రమలోనే మొదటిసారిగా సమీకృత కస్టమర్ కమ్యూనికేషన్ అప్లికేషన్ 'మై కియా 'ని కూడా ప్రారంభించింది. మైకియా యాప్ ని ఉపయోగించి, కస్టమర్స్ తమ కార్ యాజమాన్యం ప్రయాణం యొక్క ప్రతి అంశం గురించి జాగ్రత్తవహించవచ్చు. ఇప్పటికే ఉన్న కస్టమర్స్ కి యాప్ విలక్షణమైన మరియు ప్రత్యేకమైన రివార్డ్ కార్యక్రమాన్ని కూడా అందిస్తుంది. ఫ్యాషన్, ప్రయాణం ఎఫ్ అండ్ బీ, ఎలక్ట్రానిక్స్ మరియు జీవన శైలి మొదలైన వివిధ శ్రేణుల్లో వివిధ వినియోగదారు బ్రాండ్స్ పై ప్రత్యేకమైన డిస్కౌంట్స్ ని అందిస్తోంది. ఇది కస్టమర్లతో ఇటీవల ఆరంభించిన వాట్సాప్ సమాచారం వేదికకి అదనంగా ఏర్పాటు చేయబడింది.