Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా రైడ్ షేరింగ్ కంపెనీగా పేరుపొందిన ఉబర్.. ఇవాళ గుర్గావ్లో తన మొదటి జాతీయ డ్రైవర్ సలహా మండలిని (డీఏసీ) ప్రారంభించినట్లు ప్రకటించింది. కొత్తగా ఏర్పాటు చేసిన ఈ కౌన్సిల్ ద్వారా ఉబర్ మరియు డ్రైవర్ మధ్య ఏర్పడే అన్ని క్లిష్టమైన సమస్యలను పరిష్కరించేందుకు అవకాశం ఏర్పడింది. అలాగే డ్రైవర్ల ప్లాట్‌ఫారమ్ అనుభవాన్ని మరింత మెరుగుపరిచేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక కొత్తగా ఏర్పాటు చేసిన డ్రైవర్ అడ్వైజరీ కౌన్సిల్లో డ్రైవర్లు భాగం అయ్యేందుకు కొన్ని నియమాల్ని రూపొందించారు. ఇండిపెండెంట్ రివ్యూ బోర్డ్ నిర్వహించే మూడు-భాగాల ప్రక్రియ ద్వారా 6 మెట్రో నగరాల నుంచి 35 మందికి పైగా డ్రైవర్లను ఎంపిక చేశారు. ఈ డ్రైవర్లు కార్లు, ఆటో-రిక్షాలు మరియు మోటార్‌బైక్‌లతో సహా ఉబర్‌లో అందుబాటులో ఉన్న అనేక ఉత్పత్తులకు సంబంధించి ఏదో ఒక విభాగంతో కనెక్ట్ అయి ఉంటారు. వీరంతా ఫ్లాట్ఫారమ్లోని పదివేల మంది డ్రైవర్ల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రయత్నిస్తుంటారు. తొలి సమావేశం కోసం, అడ్వైజరీ కౌన్సిల్.. డ్రైవర్ సంపాదన మరియు మద్దతుపై ప్రత్యేక దృష్టి సారించింది. డ్రైవర్ సంపాదన కాన్సెప్ట్‌పై మరిన్ని మెరుగైన నిర్ణయాలు తీసుకునేందుకు ఉబర్ కట్టుబడి ఉంది. డ్రైవర్ అడ్వైజరీ కౌన్సిల్, కౌన్సిల్ పనిపై స్వతంత్ర పర్యవేక్షణ కోసం బెంగళూరుకు చెందిన ప్రముఖ సంస్థ అయినటువంటి ఆప్తి ఇనిస్టిట్యూట్‌ని ఎంపిక చేసుకుంది. ఈ సంస్థ కౌన్సిల్ పనిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటుంది. డీఏసీని నిర్మించడంలో సహాయం చేయడం నుండి చర్చలను మోడరేట్ చేయడం, తీసుకోవాల్సిన చర్యలను నిర్ణయించడం, అలాగే బోర్డ్ చొరవను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. అలాగే ఈ సంస్థ డ్రైవర్ మరియు ఉబర్‌తో కలిసి పనిచేస్తూ.. ముఖ్యమైన సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు తోడ్పాటుని అందిస్తారు.
ఈ సందర్భంగా ఉబర్ ఇండియా, దక్షిణాసియా ప్రెసిడెంట్ ప్రభజీత్ సింగ్ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ… “డ్రైవర్లు ఉబర్‌కు వెన్నెముక. డ్రైవర్ అడ్వైజరీ కౌన్సిల్ అనేది డ్రైవర్ల మాటలను నేరుగా వినడానికి మరియు వారి అవసరాలపై 100% దృష్టి కేంద్రీకరించడానికి మా ఉపయోగపడుతుంది. ఉత్పాదకతని మరింతగా పెంచడం, ప్రాసెస్లను సెటప్ చేయడం లేదా సరైన భాగస్వామ్యాలను ఎంచుకోవడం – డైరెక్ట్ ఫీడ్‌బ్యాక్, కొన్ని చర్యలపై యాక్షన్ తీసుకోవడం, మరింతగా వారిని కలుపుకుని పోవడం వల్ల అందరికీ ప్రయోజనకరమైన ఫలితాలను అందించడంలో సహాయపడతాయి. డ్రైవర్లు స్థిరమైన ఆదాయాలు సంపాదించడానికి ఓపెన్, యాక్సెస్ చేయగల మరియు రివార్డింగ్ ప్లాట్‌ఫారమ్‌ను అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము. ఈ కౌన్సిల్ ద్వారా వచ్చే మార్పులు పెద్దవి మరియు చిన్నవి కావచ్చు, కానీ డ్రైవర్లు వాటన్నింటికీ కచ్చితంగా గుర్తుంచుకుంటారు అని అన్నారు ఆయన.
లాంచ్ సందర్భంగా ఆప్తి ఇనిస్టిట్యూట్ వ్యవస్థాపకురాలు డాక్టర్ సరయు నటరాజన్ మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ.. ఉబర్ యొక్క డ్రైవర్ అడ్వైజరీ కౌన్సిల్ దాని ప్లాట్‌ఫారమ్‌లో డ్రైవర్లతో మరింత సాన్నిహిత్యాన్ని, నమ్మకాన్ని పెంపొందించడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇది వివిధ రకాలైన విధాన సంభాషణలను కూడా ముందుకు తీసుకువెళుతుంది. డ్రైవర్లకు స్వతంత్ర స్వరాన్ని అందిస్తుంది. క్లిష్టమైన విషయాలను చర్చించడానికి ఓపెన్ ఫోరమ్ ఉండడం వల్ల, వారి సమస్యను సామరస్యంగా వినేందుకు అవకాశం ఏర్పడింది. దీనిద్వారా మెరుగైన పరిష్కారాలను కనుగొనవచ్చు. థర్డ్-పార్టీ ఇంటర్నల్ రివ్యూ బోర్డ్‌గా ఆప్తి ప్రమేయం చాలా అవసరం మరియు పక్షపాతం లేకుండా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఏర్పడుతుంది. భారతదేశంలో బహుశా ఒక ఫ్లాట్‌ఫామ్‌కు, అందులోనూ రైడ్‌షేరింగ్ ఇండస్ట్రీకి ఇలాంటి వ్యవస్థ ఉండడం చాలా గొప్పు విషయం. ఈ విషయంలో ఉబర్ని కచ్చితంగా అభినందించి తీరాల్సిందే. ప్రతీ ఒక్కరూ ఉబర్ని ఒక ఉదాహరణగా తీసుకోవాల్సిందే అని అన్నారు ఆమె.
ఇక డ్రైవర్ అడ్రైజరీ కౌన్సిల్ పనితీరుని ఒక్కసారి పరిశీలిస్తే… ఇందులో డ్రైవర్లు సెల్ఫ్ నామినేషన్ ద్వారా ఎంట్రీలు పొందవచ్చు. డ్రైవర్లు కౌన్సిల్లో మూడు దశల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఉబర్ ప్లాట్‌ఫారమ్‌లో డ్రైవర్ అసోసియేట్ అయిన తీరు, అతని పరిస్థితి లాంటి వివిధ పారామీటర్స్ ఆధారంగా ఎంట్రీలు ఫిల్టర్ చేయబడతాయి. చివరగా, స్వతంత్ర సమీక్ష బోర్డుతో సమావేశాల ద్వారా, డ్రైవర్లుకు పరిష్కారాలను అందిస్తారు. ఎంపిక చేసిన డ్రైవర్లు ఒక సంవత్సరం పాటు వారి సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తారు, ఆ తర్వాత ఎంపిక ప్రక్రియ పునరావృతమవుతుంది.
డ్రైవర్ అడ్వైజరీ కౌన్సిల్ గురించి ఉబర్ ప్లాట్‌ఫారమ్‌పై పనిచేస్తున్న డ్రైవర్ శశికాంత్ పాండే (ముంబయి) మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ… “డ్రైవర్ కౌన్సిల్లో భాగమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఉబెర్ నాయకత్వం మరియు పనితో నిజమైన అభిప్రాయాన్ని పంచుకునే అవకాశాన్ని ఇస్తుంది. ఉమ్మడిగా పరిష్కారాలను కనుగొనే దిశగా. కౌన్సిల్ సభ్యునిగా ఎంపికైనందుకు నేను సంతోషిస్తున్నాను మరియు డ్రైవర్లకు సంబంధించిన సమస్యలను ఉబర్‌కి తెలిసేలా నేను కృషి చేస్తాను. సమస్యల పరిష్కారానికి డైరెక్ట్‌గా మాట్లాడడం మంచి మార్గం అని అన్నారు ఆయన.
కొన్ని నెలలకు ఒక్కసారి కౌన్సిల్లో భాగమైన డ్రైవర్లు తమ అభిప్రాయాలను తెలియ చేసేందుకు, ఆలోచనలను పంచుకోవడానికి, అలాగే తమకున్న సమస్యలను చర్చించడానికి ఉబర్ ఇండియా లీడర్షిప్ టీమ్‌తో సమావేశం అవుతారు.