Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు : భారతదేశంలోని బెంగళూరులో ప్రపంచ స్థాయికి చెందిన అంతర్జాతీయ సప్లై చెయిన్ సపోర్ట్ కేంద్రాన్ని ఆరంభించాలని తమ ప్రణాళిక గురించి ప్రాట్ డవిట్నీ గురువారం ప్రకటించింది. ఈ మేరకు ఒక ప్రకటనలో తెలిపింది. ద ఇండియా డిజిటల్ సామర్థ్యాలు పై దృష్టి కేంద్రీకరించిన ప్రాట్ డవిట్నీ వారి అంతర్జాతీయ సప్లై చెయిన్ ని మెరుగుపరచడానికి కాపబిలిటి సెంటర్ (ఐసీసీ) వందలాది అనలిస్ట్స్ మరియు డేటా సైంటిస్ట్స్ ని నియామకం చేస్తుంది.
'బెంగళూరులో మా సప్లై చెయిన్ సెంటర్ ని ప్రకటించడానికి మేము గర్విస్తున్నాం- భారతదేశంలో ప్రాట్ డవిట్నీ కోసం విలక్షణమైన పెట్టుబడి రకం చొరవ ఇది` అని జిమ్ హమకియోటిస్, వైస్ ప్రెసిడెంట్, సప్లై మేనేజ్మెంట్ , ప్రాట్ డవిట్నీ కెనడా అన్నారు. ' ప్రాట్ డవిట్నీలో మా డిజిటల్ మార్పు ప్రయత్నాలు పై మేము రూపొందడం వలన, భారతదేశంలో సెంటర్ మాకు ఆధునికమైన మరియు సమీకృత అంతర్జాతీయ సప్లై చెయిన్ ని తయారు చేయడంలో కీలకమైన బాధ్యతవహిస్తుంది.` అని తెలిపారు.
సెంటర్ మొదటి విడతలో భాగంగా 160 మంది ఏరోస్పేస్ అనలిస్ట్స్ మరియు డేటా సైంటిస్ట్స్ ని నియామకం చేయడం ఆరంభించింది. ఏప్రిల్ 2022 నాటికి తొలి కార్యకలాపాల్ని ఆరంభిస్తుందని ఆశించడమైంది. సెంటర్ బెంగళూరులోని, ఎలహంకలో కాలిన్స్ వారి ఏరోస్పేస్ క్యాంపస్ లో ఏర్పాటవుతుంది.
'మా కోసం ఏరోస్పేస్ ప్రతిభ, ఆవిష్కరణ మరియ సామర్థ్యాలలో భారతదేశం పరిపూర్ణమైన వాతావరణాన్ని కల్పిస్తుంది` అని అష్మిత సేథి, ప్రెసిడెంట్ మరియు కంట్రీ హెడ్, ప్రాట్ డవిట్నీ అన్నారు. 'గడిచిన సంవత్సరాలలో మేము హైదరాబాద్ లో ఆధునిక ఇండియా కస్టమర్ ట్రైనింగ్ సెంటర్ మరియు బెంగళూరులో మా ఆధునిక ఆర్ 7 డి సెంటర్ సహా గణనీయమైన పెట్టుబడులు పెట్టాము. మా కొత్త కేంద్రం భారతదేశానికి మా నిరంతరమైన నిబద్ధతకి ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది మరియు దేశం లోపల మా సామర్థ్యాల్ని మరింతగా వృద్ధి చేసే లక్ష్యాన్ని కలిగి ఉన్నాము.` అని చెప్పారు.
ద ఇండియా కాపబిలిటి సెంటర్ ప్రాట్ డవిట్నీ వారి అంతర్జాతీయ సప్లై చెయిన్ బృందాల సహకారంతో పని చేస్తుంది మరియు సప్లై చెయిన్ కార్యకలాపాలు, సేకరించడం, మరియు డిజిటల్ విశ్లేషణలు పై దృష్టిసారిస్తుంది.
'భారతదేశం ఐసీసీ నిరంతరంగా అంతర్జాతీయ సహకారాన్ని అందిస్తుంది. కుతూహాలమైన, నవీన మరియు ప్రాట్ 7 విట్నీ మిషన్ తో అనుసంధానం చేయబడిన బృందాన్ని రూపొందించడానికి మేము ప్రణాళిక చేసాము మరియు బెంగళూరు నగరం ఇందుకు సరైన ప్రతిభ కలిగిన కేంద్రంగా పని చేస్తుంది` అని సందీప్ శర్మ, డైరక్టర్, ఇండియా ఆపరేషన్స్,సప్లై చెయిన్, ప్రాట్ డవిట్నీ కెనడా అన్నారు.
ప్రాట్ & విట్నీకి బెంగళూరులో ఇప్పటికే ఒక దశాబ్దం కాలానికి చెందిన రీసెర్చ్ డడవలప్ మెంట్ (ఆర్ & డీ) ఉంది. బెంగళూరులో కంపెనీ వారి ప్రపంచ స్థాయికి చెందిన ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్ సీ)లో ఉన్న ఆర్ & డీ కేంద్రం ఆధునిక మెటీరియల్స్ మరియు ప్రొపల్షన్ టెక్నాలజీస్ పరిశోధన పై దృష్టిసారిస్తుంది. 1700కి పైగా ఇంజన్లు మరియు ఏపీయూలతో (ఆగ్జిలరి పవర్ యూనిట్స్) 900కి పైగా విమానాలకు పవర్ ని అందిస్తూ, ప్రాట్ డవిట్నీ దేశంలోనే ఏదైనా ఇంజన్ తయారీదారులలో అతి పెద్ద శ్రేణిని కలిగి ఉంది. భారతదేశానికి వచ్చే ప్రతి ఇద్దరు వ్యక్తులలో దాదాపు ఒకరు, ప్రాట్ డవిట్నీ ఇంజన్స్ మద్దతు చేసే విమానాలలోనే ప్రయాణిస్తున్నారు.
ప్రాట్ అండ్ విట్నీ గురించి..
ప్రాట్ అండ్ విట్నీ విమానాలు మరియు హెలికాప్టర్ ఇంజన్స్ మరియు అనుబంధ పవర్ యూనిట్ల డిజైన్, తయారీ మరియు సేవలలో ప్రపంచ నాయకునిగా ఉంది. మరిన్ని నేర్చుకోవడానికి www.prattwhitney.com ని సందర్శించండి.