Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏరియల్ యొక్క షేర్ ద లోడ్ మూవ్వెంట్ లిమిటెడ్ ఎడిషన్ పేరు మార్పు, ప్యాక్ల విడుదల కార్యక్రమంలో మగవారు తమ భార్యలను కూడా సమానంగా చూడాల్సిందిగా అభ్యర్ధించిన తారలు
చెన్నై : లింగ అసమానతలను రూపుమాపుకోవడంతో పాటుగా తమ భార్యలతో భారం పంచుకోవాలని కోరుతూ లాండ్రీ బ్రాండ్ ఏరియల్ ఓ కార్యక్రమం నిర్వహించింది. దక్షిణాది తారలు శాంతను భాగ్యరాజ్ మరియు సిబీ భువన చంద్ర లు ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటుగా ఇతర మగవారితో భారాన్ని సమానంగా పంచుకుంటున్న మగవారు, తమ భార్యతో మాత్రం ఎందుకు పంచుకోరు అని ప్రశ్నించారు. లింగ సమానత్వం గురించి 2015 నుంచి ఏరియల్ చర్చను నిర్వహిస్తూనే ఉంది.
ఈ కార్యక్రమంలో శాంతను భాగ్యరాజ్ మాట్లాడుతూ 'మగవారిగా మాకు ఇంటి పనులు ఎలా చేయాలో తెలుసుకానీ ఆ పనులు చేయడానికి సిగ్గు పడుతుంటాం. అదే హాస్టల్స్లో ఉన్నప్పుడు మాత్రం స్నేహితులతో కలిసి ఈ భారం పంచుకుంటూనే ఉన్నాం. మరి భార్య దగ్గరకు వచ్చేసరికి ఎందుకు ఈ మార్పు? ఆడ, మగ ఇద్దరూ సమానమే అంటున్న ఈ ప్రచారం నా హృదయాన్ని తాకింది. మూసధోరణికి చెక్ పెడదాం . ఇంటిలో బాధ్యతలను సమానంగా పంచుకుందాం` అని అన్నారు
సిబీ భువన చంద్ర మాట్లాడుతూ 'ఇంటిలో లింగసమానత్వం అంశాన్ని ఏరియల్ సీరియస్గా తీసుకోవడం పట్ల సంతోషంగా ఉన్నాను. మనం ఇతరులను సమానంగా చూసినప్పుడు భారం కూడా పంచుకోగలమనే భావనను నమ్ముతున్నాను` అని అన్నారు.