Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్పోర్ట్ ఆఫ్ లైఫ్ కార్యక్రమం ద్వారా స్పోర్ట్స్ గాయాలు పట్ల అవగాహన మెరుగుపరచడంతో పాటుగా క్రీడాకారులకు అవసరమైన చికిత్సను అందిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా హీల్తియం క్రీడా గాయాల చికిత్సకు ఉచిత అర్థోస్కోపీ ఇంప్లాంట్స్‌తో తగిన మద్దతునందిస్తుందిచిన
హైదరాబాద్ : అంతర్జాతీయ మెడ్‌టెక్ కంపెనీ హీల్తియం మెడ్‌టెక్ నేడు స్పోర్ట్స్ ఆఫ్ లైఫ్ కార్యక్రమాన్ని అభినవ్ బింద్రా ఫౌండేషన్ ట్రస్ట్ (ఏబీఎఫ్‌టీ)తో కలిసి ప్రారంభించింది. గాయపడిన క్రీడాకారులకు అవసరమైన వైద్య చికిత్సలను అందించడంతో పాటుగా డాక్టర్లు, శస్త్రచికిత్సలు, పునరావాస సదుపాయాలను సైతం ఏబీఎఫ్‌టీ అందించనుంది. తద్వారా క్రీడాకారులు గాయాల నుంచి బయటప డటంతో పాటుగా తమ కెరీర్ కొనసాగించగలరు. హీల్తియం తమ ఆర్థోస్కోపీ ఇంప్లాంట్స్‌కు అవసరమైన శస్త్రచికిత్సలను పూర్తి ఉచితంగా అందిస్తుంది.
క్రీడలలో, క్రీడాకారులు తరుచుగా గాయపడుతుంటారు. కొన్ని గాయాలు స్వల్పమైనవి అయితే మరికొన్ని మాత్రం వారి కెరీర్‌నే ప్రమాదంలోకి నెట్టివేసే రీతిలో ఉంటాయి. కొంతమంది క్రీడాకారులకు ఈ క్రీడలే వారి జీవితాధారంగా ఉండటంతో పాటుగా వారి కుటుంబాలు కూడా వారిపై ఆధారపడి ఉంటాయి. ఈ తరహా స్పోర్ట్స్‌మెన్ తరచుగా అయ్యే గాయాల శస్త్రచికిత్సను భరించలేరు. స్పోర్ట్ ఆఫ్ లైఫ్‌తో, ఈ తరహా అవసరమైన క్రీడాకారులకు గాయాల నుంచి కోలుకునే అవకాశం ఏబీఎఫ్‌టీ మరియు హీల్తీయం మద్దతు కారణంగా లభిస్తుంది.
గత సంవత్సరం ఎన్సీఏ విడుదల చేసిన గాయాల నిఘా నివేదిక ప్రకారం 14.75% మంది ఆటగాళ్లు భుజాల గాయాలతో బాధపడితే, 13.11% మంది ఆటగాళ్లు మోకాళ్ల గాయాలతో బాధపడ్డారు. దాదాపు 74% మంది ఆటగాళ్లు తమ కెరీర్‌నే ప్రమాదంలో పడేసూ యాంటీరియర్ క్రూసియేట్ లిగమెంట్ (ఏసీఎల్) గాయాల బారిన పడటం కనిపించింది. మరీముఖ్యంగా వారు క్రీడలకు తిరిగి వచ్చిన మొదటి రెండు సంవత్సరాలలోనే ఇది కనిపించింది.
హీల్తీయం 300కు పైగా ఎస్‌కెయులను కీళ్లు మరియు భుజాల శస్త్రచికిత్సల కోసం సృష్టించింది. వీటిని అంతర్గతంగా డిజైన్ చేయడంతో పాటుగా అభివృద్ధి చేశారు. దాదాపు 50కు పైగా పేటెంట్లు దరఖాస్తు చేయబడటంతో పాటుగా యుఎస్, ఇండియాలో పేటెంట్లు కూడా లభించాయి. ప్రపంచం కోసం భారతదేశపు తయారీ జాబితాలో విస్తృత శ్రేణిలో ఇంప్లాంట్స్ ఉన్నాయి. అలాగే వీటిలో భుజాలు మరియు మోకీళ్లలో మృదువైన కణజాలం చికిత్స చేసే యంత్రసామాగ్రి సైతం ఉంది. వీటి ద్వారా యాంటీరియర్ క్రూసియేట్ లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ , పోస్టీరియర్ క్రూసియేట్ లిగమెంట్ గాయాలు, ఇతర లిగమెంట్ గాయాలు మరియు రీకన్స్ట్రక్షన్ మరియు మెనిస్కాల్ రిపేర్ వంటి చికిత్సలను అందిస్తారు. అందువల్ల గాయాలైనప్పటికీ వారి క్రీడా జీవితం మాత్రం ఆగదు.
ఈ కార్యక్రమం గురించి అనీష్ బాఫ్నా, సీఈఓ ఉఎండీ, హీల్తియం మెడ్‌టెక్ మాట్లాడుతూ 'స్పోర్ట్ ఆఫ్ లైఫ్ కార్యక్రమంలో భాగం కావడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. భారతదేశంలో క్రీడాకారుల అభ్యున్నతికి మేము కట్టుబడి ఉన్నాము. హీల్తియం వద్ద, మేము మా పేటెంటెడ్ ఆర్ధోస్కోపీ శ్రేణి సిరోనిక్స్తో జీవితాలను స్పృశిస్తున్నాము. ఈ సిరోనిక్స్ను అంతర్గతంగా డిజైన్ చేసి అభివృద్ధి చేశాము. దీనికి యుఎస్, ఇండియాలో 50కు పైగా పేటెంట్లు ఉన్నాయి. అభినవ్ బింద్రా ఫౌండేషన్ ట్రస్ట్ (ఏబీఎఫ్‌టీ)తో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము మరియు గాయాలతో బాధపడుతున్న క్రీడాకారులకు సహాయపడుతుండటాన్ని గర్వంగా భావిస్తున్నాము. మన దేశపు యువత జీవితంలో సానుకూల ప్రభావం తీసుకురాగలమని ఆశిస్తున్నాము. భైచుంగ్ భూటియా, అభినవ్ బింద్రాలకు మేము ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. వీరు గాయాలతో బాధపడుతున్న క్రీడాకారులను సమయానికి తగిన చికిత్స తీసుకోవాల్సిందిగా ప్రోత్సహిస్తూనే స్పోర్ట్ ఆఫ్ లైఫ్ కార్యక్రమానికి మద్దతునందిస్తున్నారు` అని అన్నారు.
ఈ కార్యక్రమం గురించి అభినవ్ బింద్రా, ఫౌండర్, అభినవ్ బింద్రా ఫౌండేషన్ ట్రస్ట్ మాట్లాడుతూ 'స్పోర్ట్ ఆఫ్ లైఫ్ ఎన్నటికీ ఆగదనే భరోసా అందిస్తూనే, అవసరమైన ఆటగాళ్లకు తగిన మద్దతునందించడమనేది నేడు క్రీడలలో అత్యంత కీలకం. ఎందుకంటే వారు మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. స్పోర్ట్ ఆఫ్ లైఫ్ ఇప్పడు భారతదేశ వ్యాప్తంగా అవసరార్థులైన క్రీడాకారుల చికిత్స, పునారవాస సదుపాయాలకు తగిన మద్దతు అందిస్తుంది. తద్వారా వారు క్రీడలలో చురుగ్గా ఉండగలరు. హీల్తియంతో మేము చేతులు కలపడం పట్ల సంతోషంగా ఉన్నాము. ఆత్మనిర్బర్ భారత్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఇది తమ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. అలాగే భారతదేశంలో క్రీడలకు తమ మద్దతును ఈ కార్యక్రమంలో భాగంగా అందిస్తుంది. ఈ కార్యక్రమం ప్రారంభించిన సంవత్సరం లోపుగానే 100మంది క్రీడాకారుల జీవితాలపై సానుకూల ప్రభావం చూపాలనుకుంటున్నాము` అని అన్నారు.
అంతర్జాతీయ పటంలో భారతీయ ఫుట్‌బాల్‌కు చుక్కానిగా నిలుస్తున్న భైచుంగ్ భూటియా మాట్లాడుతూ 'సుదీర్ఘకాలం పాటు ఆటలాడటం ద్వారా మీ దేశానికి మీరు ప్రాతినిధ్యం వహించగలరు. ఆటల్లో గాయాలు కావడమన్నది అత్యంత సహజం. ఏబీఎఫ్‌టీ మరియు హీల్తియంలకు నేను ధన్యవాదములు చెబుతున్నాను. స్పోర్ట్ ఆఫ్ లైఫ్ ద్వారా వీరు ముందుకు రావడంతో పాటుగా అవసరమైన క్రీడాకారులకు తగిన మద్దతునందించడం ద్వారా వారు తమ క్రీడా జీవితాలను సజావుగా నిర్వహించేందుకు తగిన మద్దతునందిస్తున్నారు` అని అన్నారు.
డాక్టర్ సునీల్ అప్సింగి, చీఫ్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, మ్యాక్స్‌క్యూర్ హాస్పిటల్స్ మాట్లాడుతూ 'భారతదేశంలో ఎంతోమంది యువతకు కెరీర్ అవకాశంగా ఇప్పుడు క్రీడలు నిలుస్తున్నాయి. ఈ కారణంగానే ఎంతోమంది యువత గాయాల బారిన పడటమూ జరుగుతుంటుంది. అయితే, స్పోర్ట్స్ మెడిసన్‌లో అశేష సామర్థ్యం కలిగిన సర్జన్లు, అత్యాధునిక ఆర్థోస్కోపీ ఉపకరణాలతో చాలావరకూ స్పోర్ట్స్ గాయాలకు తగిన చికిత్సనందించగలుగుతున్నారు. స్పోర్ట్ ఆఫ్ లైఫ్ లాంటి కార్యక్రమాలు సమానావకాశాలను క్రీడాకారులు మరీ ముఖ్యంగా టియర్ 2, టియర్ 3 నగరాల్లో అందించడంతో పాటుగా వీలైనంత ఉత్తమమైన సంరక్షణను అందిస్తుంది` అని అన్నారు.