Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : వయాకాం 18 మరియు భారతదేశంలో అగ్రగామి బాలల మనోరంజన ఫ్రాంఛైసీ నికలోడియాన్ తన వినూత్న తరహ నికలలోడియాన్ కిడ్స్ ఛాయిస్ అవార్డ్స్ ద్వారా బాలల్లో సాధికారత మరియు మనోరంజనను అందించడంలో ముందంజలో ఉంది. పలు సంవత్సరాల అనంతరం యువ ప్రేక్షకులు మరియు వారి తల్లిదండ్రులను అనుసంధానం చేస్తుండగా, నికలోడియాన్ యువ వీక్షకులకు పరిపూర్ణ వేదికగా, ఈ విభాగపు లక్షణాలను నిరూపించే విశిష్ఠ అనుభవాలను అందిస్తోంది. ఈ ఫ్లాగ్షిప్ కార్యక్రమం బాలలకు శక్తిని అందిస్తుంది మరియు వారి ఎంపికలను వేడుక చేసుకుంటోంది. ‘ఆల్పెన్లీబె ఎక్లయిర్ ప్లస్ నికలోడియాన్ కిడ్స్ ఛాయిస్ అవార్డ్స్ 2021’ మెటావర్స్‌లో జరిగే భారతదేశపు మొట్టమొదటి అవార్డ్స్ స్క్రీనింగ్ అనుభవంగా ఉంది. షేర్షా ఈ ఏడాది కిడ్స్ ఛాయిస్ అవార్డ్స్‌ను గెల్చుకుంది! సిద్ధార్థ మల్హోత్రా మరియు కియారా అడ్వానీ నటించిన ఈ స్ఫూర్తియుత వార్ డ్రామాలో ‘పవర్‌హౌస్ పర్ఫార్మర్’ మరియు ‘బెస్ట్ యాక్ట్రెస్’ పురస్కారాలను గెల్చుకున్నారు. ఈ చనల చిత్రం బాలలకు అత్యంత ఇష్టమైనదిగా నిలిచింది మరియు ఈ చిత్రానికి ‘రతన్ లంబియాన్’ అత్యంత ప్రియమైన పాటలు రాసి పురస్కరాన్ని దక్కించుకున్నారు. దక్షిణాది నుంచి పుష్ప: ది రైజ్ ‘ఫేవరెట్ మూవీ (దక్షిణం) ఫర్ కిడ్స్ దిస్ ఇయర్, టాలీవుడ్ మెగాస్టార్ అల్లు అర్జున్ మొట్టమొదటి ‘ఫేవరెట్ మూవీ యాక్టర్ (పురుష- దక్షిణం) పురస్కారాన్ని గెల్చుకోగా, రష్మిక మందణ్ణ ‘ఫేవరెట్ మూవీ యాక్టర్ (మహిళ-దక్షిణం) పురస్కారాన్ని నికలోడియన్ కిడ్స్ ఛాయిస్ అవార్డ్స్ 2021లో గెల్చుకున్నారు. చివరిగా బాద్షాను వరుసగా రెండో ఏడాది ‘ఫేవరెట్ ర్యాఫ్టర్’ పురస్కారానికి బాలలు ఓటింగ్ చేశారు. దేశ వ్యాప్తంగా పబ్జి మొబైల్ ఇండియా బాలలకు ‘ఫేవరెట్ మొబైల్ గేమ్’గా నిలిచింది. ఇటాలియన్ రుచి పిజ్జా వారికి అత్యుత్తమ ‘ఫేవరెట్ ఫుడ్ ఐటం’ పురస్కారాన్ని మరోసారి దక్కించుకుంది. అలాగే, 2020 టోక్యో ఒలంపింక్స్‌లో క్రీడా రంగంలో జావలిన్ త్రో ఛాంపియన్ నీరజ్ చోప్రా ‘ఫేవరెట్ స్పోర్ట్స్ పర్సన్’ పురస్కారాన్ని దక్కించుకోగా, ఎం.ఎస్.ధోని బాలలకు ‘ఫేవరెట్ క్రికెటర్’గా ఈ ఏడాది కూడా దీన్ని గెల్చుకున్నారు.
టీవీ విభాగంలో భారతి సింగ్ ‘ఫేవరెట్ టీవీ యాక్టర్’ (స్త్రీ) పురస్కారాన్ని దక్కించుకోగా, దిలీప్ జోషి ఈ ఏడాదితో కలిపి వరుసగా నాలుగో సారి ‘ఫేవరెట్ టీవీ యాక్టర్ (పురుష) గౌరవాన్ని దక్కించుకున్నారు. అదే విధంగా తారక్ మెహ్తా కా ఉల్టా చష్మా ఏడో సారి ‘ఫేవరెట్ టీవీ షో/సీరియల్’ పురస్కరాన్ని దక్కించుకుంది.
నికెలోడియన్ కిడ్స్ ఛాయిస్ అవార్డ్స్ 2021ని అందజేసే ఆల్పెన్లీబ్ ఎక్లెయిర్స్ ప్లస్‌లో విజయం సాధించిన వారి పూర్తి జాబితా ఆధారం క్రింద ఇవ్వబడింది:
సిద్ధార్థ్- కియారా తారా తారాగణానికి లభించిన అసాధారణ ప్రేమ గురించి నిర్మాత కరణ్ జోహర్ మాట్లాడుతూ, ‘షేర్షా నికలోడియాన్ కిడ్స్ ఛాయిస్ అవార్డ్స్ 2021 ఫేవరెట్ మూవీ పురస్కారం గెల్చుకున్నందుకు నాకు చాలా సంతోషం కలుగుతుంది. బాలలు ఈ రోజుల్లో అత్యంత నిజాయతీగా అలాగే దేనినీ పట్టించుకోకుండా ఉంటున్నారు. వారు అత్యంత శక్తియుతంగా మరియు ట్రూ-హార్టెడ్ వీక్షకులుగా ఉన్నారు! ఈ చలనచిత్రం వారికి స్ఫూర్తి నింపింది మరియు వారికి దేశానికి సేవను అందించడం ఎటువంటి శ్రమ అనేదాన్ని అర్థం చేసుకునేలా చేసిందన్న భరోసా నాది. మనది ఏదో దాని కోసం పోరాటం చేయడం చాలా ముఖ్యమైనది మరియు బాలలు ఈ భావనను వృద్ధి చేసుకుంటారన్న భరోసా నాకు ఉంది’’ అని పేర్కొన్నారు.
రతన్ లంబియాన్కు సంగీతాన్ని అందించిన తానిష్క్ బాగ్చి మాట్లాడుతూ, ‘‘పలు ఎంపికలు అందుబాటులో ఉన్నందున బాలలకు ఒక పాట నుంచి మరో పాటకు వెళడం అత్యంత సరళంగా ఉంటుంది మరియు అది అంతే సులభంగా ఉంటుందని కూడా చెప్పలేము! ‘రతన్ లంబియాన్’ ఈ గందరగోళాన్ని నివారించడంలో మరియు కిడ్స్ ఛాయిస్ అవార్డ్స్ 2021లో అత్యంత ప్రియమైన పాటగా పురస్కారాన్ని గెల్చుకోగలిగింది. ఈ పాట పెద్దలతో ముడిపడి ఉంది మరియు యువత సంగీతానికి పరిమితి లేదు, హద్దులు లేవు లేదా వయస్సు ఉండదు మరియు అన్ని రకాల ప్రేక్షకులతో అనుసంధానం అవుతుంది’ అని చాటి చెప్పింది అన్నారు.
తమ గెలుపు గురించి సిద్ధార్థ్ మల్హోత్రా మాట్లాడుతూ, ‘‘షేర్షా చిత్రానికి నికలోడియాన్ కిడ్స్ ఛాయిస్ అవార్డ్స్ 2021 పవర్‌హౌస్ పర్ఫార్మర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం గెల్చుకోవడం నాకు చాలా థ్రిల్ అందించింది. మన మహాన్ దేశానికి తమ జీవితాలను త్యాగం చేసిన సైనికులు మన నిజ జీవితపు హీరోల జీవితాలను ప్రదర్శించే చలన చిత్రాలను ప్రదర్శించడం అత్యంత ముఖ్యమైనది. క్యాప్టెన్ విక్రమ్ బాత్రా అలాగే అటువంటి ఇతర ధీర యోధుల ప్రయాణం యువ మనస్సులను రంజింపజేస్తుంది మరియు మన దేశం గురించి గర్వపడే భావన కల్పిస్తుందన్న భరోసా నాకు ఉంది’’ అన్నారు.
ఈ పురస్కరాల కార్యక్రమం మొదటిగా మెటావరక్స్ కన్సర్ట్ మొదటి కేంద్రం డీసెంట్రాల్యాండ్లో ప్రసారం కానుంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులకు సృష్టించిన ఆల్పెన్లీబీ ఎక్లయిర్ ప్లస్ సమర్పించే కిడ్స్ ఛాయిస్ అవార్డ్స్ 2021 ఈ డెస్క్‌టాప్‌లో మొదటి అనుభవం కుటుంబాలకు వినూత్న తరహాలో లీనమయ్యేలా చేసే మనోరంజన అనుభవాన్ని అందిస్తోంది. ఈ స్క్రీనింగ్ వినియోగదారులకు వర్చువల్ అవతారాలను సృష్టించేందుకు మరియు విరజిమ్మే ఫౌంటెయిన్లు, చిన్న విమాన ప్రయాణాలు మరియు వినోదమయ గేమ్స్ నుంచి ఈ కార్యక్రమంలో వర్చువల్‌గా లీనం అయ్యేలా చేసింది.
మెటావర్స్‌తో ఈ పురస్కారం ఈ ఏడాది అత్యంత పెద్ద సైమల్ కాస్ట్ కాగా, నిక్, సోనిక్, నిక్ హెచ్డి+ టాటా ప్లే (ఛానల్ నం.664 మరియు 665), వయాకాం 18 ఓటీటీ ప్లాట్‌ఫారాలైన వూట్, వూట్ కిడ్స్ మాత్రమే కాకుండా జియో టీవీ మరియు జియో టీవీ+ మరియు డిజిటల్ ప్లాట్‌ఫారాలైన యూట్యూబ్, ఫేస్బుక్ మరియు ఇన్‌స్టాగ్రామ్‌లతో కలిసి 14+ మల్టీస్క్రీన్ ప్లాట్‌ఫారాల్లో ఆదివారం మార్చి 27 రాత్రి 8.30కు ప్రసారం కానుంది. ఈ పురస్కారాలు ఫన్ గేమింగ్ థీమ్డ్ నైట్‌ను కలిగి ఉండగా, అందులో నిక్టూన్స్ పలు ఆర్కేడ్ గేమ్స్ ఆడడాన్ని చూడవచ్చు. అంతే కాకుండా సూపర్ స్టార్లు మరియు బాలలకు అత్యంత ఇష్టమైన బాద్షా, దీపికా పదుకొణె, సిద్ధార్థ మల్హోత్రా, సారా అలి ఖాన్, కియారా అడ్వాణి, రష్మిక మందణ్ణ మరియు ఇన్ఫ్లుయెన్సర్స్ అయిన అనుష్కా సేన్ తదితరులకు పురస్కరాలను ప్రదానం చేయడాన్ని వీక్షించవచ్చు. ఈ కార్యక్రమంలో ఒలంపియాన్స్, పారాలంపియాన్స్ తదితరులను వారి స్ఫూర్తియుతమైన సాధనలకు వేడుక చేసుకోనున్నారు.
ఈ శ్రేణిలో మొదటి ఆవిష్కారాలను సృష్టించడం గురించి వయాకాం 18 హిందీ మాస్ ఎంటర్టెయిన్మెంట్ అండ్ కిడ్స్ టీవీ నెట్వర్క్ అధికారి నీనా ఎలవియా జైపురియా మాట్లాడుతూ, నికలోడియాన్ కిడ్స్ ఛాయిస్ అవార్డ్స్ యువ ప్రేక్షకులను వారి ఎంపికకు సాధికారత కల్పించే మరియు ఉత్తేజించే దిశలో మా నిబద్ధతను మరోసారి ధ్రువీకరిస్తుంది. కెసిఎ తనకు ప్రత్యేక స్థానాన్ని అందుకుంది మరియు ఏడాది నుంచి ఏడాదికి తన వీక్షకులతో లోతుగా వేళ్లూనుకుంది. సదా ఒక అడుగు ముందుండే నికలోడియాన్ ఈ విభాగంలో ఆవిష్కారానికి కొత్త కొలమానాలను సృష్టించింది మరియు కెసిఎ 2021 వినియోగదారులకు ఈ ప్లాట్ఫారంలో వినియోగదారులకు అడ్డంకులు లేని ఏకీకృత అనుభవాన్ని సృష్టించేందుకు సిద్ధంకాగా, అందులో ఈ విభాగంలో మొదటి మెటావర్స్ స్క్రీనింగ్ కూడా కలిసి ఉంది’’ తెలిపారు.
ఈ ఏడాది పలు ఆవిష్కరణలు ఉన్నప్పటికీ ఆల్పెన్లీబీ ఎక్లయిర్స్ ప్లస్ సమర్పించే నికలోడియాన్ కిడ్స్ ఛాయిస్ అవార్డ్స్ 2021కు నిక్ఇండియా.కాం, నిక్ టీవీ, సోనిక్, నిక్ హెచ్డి+. టాటా ప్లే (ఛానల్ నం.664 మరియు 665), వయాకాం 18లో ఓటీటీ ప్లాట్‌ఫారాలైన వూట్, వూట్స్ కిడ్స్ మాత్రమే కాకుండా జియో టీవీ మరియు జియో టీవీ+ మరియు డిజిటల్ ప్లాట్‌ఫారాలైన యూట్యూబ్, ఫేస్బుక్ మరియు ఇన్స్స్టాగ్రామ్లలో మార్చి 27 ఆదివారం రాత్రి 8.30కు మిమ్మల్ని మెటావర్స్‌లో రిజిస్ట్రరు చేసుకుని వీక్షించడం మర్చిపోవద్దు.