Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరుపతి : భారతదేశంలో సుప్రసిద్ధ విద్యత్ స్కూటర్ తయారీదారు ఎథర్ ఎనర్జీ నేడు తమ నూతన రిటైల్ ఔట్లెట్ – ఎథర్ స్పేస్‌ను జయశంకర్ నగర్, తిరుపతి వద్ద ఎస్ఎన్ ఆటో భాగస్వామ్యంతో ప్రారంభించింది. ఇది ఆంధ్రప్రదేశ్‌లో ఎథర్ ఎనర్జీ యొక్క మూడవ ఔట్లెట్ . మొదటి రెండు ఔట్లెట్లు విశాఖపట్నం, విజయవాడలలో ఉన్నాయి. భారతదేశంలో వేగవంతమైన మరియు స్మార్టెస్ట్ స్కూటర్లలో ఒకటిగా నిలిచిన ఎథర్ 450ఎక్స్‌తో పాటుగా ఎథర్ 450 ప్లస్‌ను ఎథర్ స్పేస్ వద్ద విక్రయించారు. ఈ ఎథర్ స్పేస్ వినూత్నమైన యాజమాన్య అనుభవాలను అందించడంతో పాటుగా యజమానులకు పూర్తి స్థాయిలో సేవలు మరియు మద్దతును అందిస్తాయి. వినియోగదారులకు విద్యుత్ వాహనాల పట్ల అవగాహన కల్పించేలా దీనిని రూపకల్పన చేశారు. అదే సమయంలో ఇంటరాక్టివ్ ప్రాంగణంలో సమగ్రమైన అనుభవాలను ఇది అందిస్తుంది. ఎఽథర్ స్పేస్ ఇప్పుడు వినియోగదారులకు వాహనానికి సంబంధించి ప్రతి అంశాన్నీ తెలుసుకునే అవకాశం అందిస్తుంది. అదే సమయంలో పలు భాగాలను గురించి సమగ్రమైన అవగాహనను సైతం కల్పిస్తూ వాటిని ప్రదర్శిస్తోంది. ఈ ఎక్స్పీరియన్స్ కేంద్రం సందర్శించక మునుపే ఎథర్ ఎనర్జీ యొక్క వెబ్‌సైట్‌పై వారు టెస్ట్ రైడ్ స్లాట్స్‌ను సైతం బుక్ చేసుకోవచ్చు. ఈ సందర్భంగా రవ్నీత్ ఫొకేలా, చీఫ్ బిజినెస్ ఆఫీసర్, ఎథర్ ఎనర్జీ మాట్లాడుతూ ‘‘ అత్యున్నత పనితీరు కలిగిన విద్యుత్ వాహనాలకు ఆంధ్రప్రదేశ్‌లో అసాధారణంగా వినియోగదారుల నుంచి డిమాండ్ ఉంది. ఈ ఆదరణ కారణంగానే విజయవాడ, తిరుపతిలలో ఈ ఎక్స్పీరియన్స్ కేంద్రాలను వరుసగా ప్రారంభించాము. ఈవీలకు అప్‌గ్రేడ్ కావాలని వినియోగదారులు కోరుకుంటున్న వేళ మేము అధిక డిమాండ్‌ను చూస్తున్నాము. మరీముఖ్యంగా టియర్2, టియర్ 3 నగరాల నుంచి ఈ డిమాండ్ అధికంగా ఉంది. తిరుపతిలోని ఈ నూతన కేంద్రం ఈ వృద్ధి చెందుతున్న డిమాండ్‌ను తీర్చడంతో పాటుగా సమగ్రమైన అనుభవాలను వినియోగదారులకు అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్ మాకు అత్యంత కీలకమైన మార్కెట్లలో ఒకటి. మా రిటైల్ విస్తరణ మరింతగా చేసేందుకు ఆసక్తికరమైన ప్రణాళికలను రూపొందించాము. అంతేకాదు, రాబోయే నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా మౌలిక వసతులను మార్చగలము’’ అని అన్నారు. ‘‘గత జులైలో మా ఎక్స్పీరియన్స్ కేంద్రం విశాఖపట్నంలో ప్రారంభించడం ద్వారా ఎథర్ ఎనర్జీతో మా ఉత్సాహపూరితమైన ప్రయాణం ప్రారంభమైంది. నేడు మార్కెట్లో లభ్యమవుతున్న అత్యుత్తమ స్కూటర్లలో ఏథర్ 450ఎక్స్ ఒకటి. దీనిని అద్వితీయమైన సవారీ అనుభవాలను అందించే రీతిలో తీర్చిదిద్దాము. గత సంవత్సరకాలంగా, ఈ బ్రాండ్ మరియు ఉత్పత్తి పట్ల మా నమ్మకం, విశ్వాసం గణనీయంగా పెరిగాయి. ఈ నగరంలో మా సేవలను అందించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము’’ అని శ్రీ సుధాకర్ నాగలపాటి, మేనేజింగ్ డైరెక్టర్, ఎస్ఎన్ ఆటో అన్నారు.
ఆవిష్కరణకు మునుపే చార్జింగ్ మౌలిక వసతులను అభివృద్ధి చేయడంపై పెట్టుబడులు పెట్టిన అతి కొద్ది ఓఈఎంలలో ఎథర్ ఎనర్జీ ఒకటి. ఈ కంపెనీ 2 ఫాస్ట్ చార్జింగ్ పాయింట్లు, ఏథర్ గ్రిడ్స్‌ను ఈ ఎక్స్పీరియన్స్ కేంద్రాల వద్ద ఏర్పాటుచేయడంతో పాటుగా మరో 8–10 చార్జింగ్ పాయింట్లను జోడించడానికి ఎథర్ ప్రణాళిక చేసింది. తద్వారా మృదువైన, ఒత్తిడి లేని సవారీని నగరంలోని ఈవీ యజమానులకు అందించనుంది. అన్ని ఎథర్ గ్రిడ్ ప్రాంతాలనూ వ్యూహాత్మకంగా నగరంలో అత్యంత కీలకమైన ప్రాంతాలలో ఏర్పాటుచేయడంతో పాటుగా తిరుపతిలోని ఈవీ యజమానులకు వాటిని సులభంగా అందుబాటులో ఉంచింది. అంతేకాదు, తమ అపార్ట్మెంట్లు, గృహాల వద్ద హోమ్ చార్జింగ్పరిష్కారాలను ఏర్పాటుచేసేందుకు సైతం వినియోగదారులకు తోడ్పడనుంది. ఈ కంపెనీ ఇటీవలనే తమ రెండవ తయారీ కేంద్రాన్ని హోసూరు వద్ద ప్రారంభించింది. తద్వారా వృద్ధి చెందుతున్న విద్యుత్ వాహనాల డిమాండ్‌ను తీర్చనుంది. ఈ నూతన కేంద్రం ద్వారా ఎథర్ అదనంగా సంవత్సరానికి 4లక్షల యూనిట్లను తయారు చేయగలదు. ప్రస్తుతం 1,20,000 యూనిట్లను మాత్రమే తయారుచేసే సామర్థ్యం దీనికి ఉంది. ఎథర్ 450 ఎక్స్ ఇప్పుడు భారతదేశంలో లభ్యమవుతున్న, ఎక్కువ అవార్డులు అందుకున్న విద్యుత్ స్కూటర్ ఇది. ఎథర్ ఎనర్జీ ఇప్పుడు మార్కెట్లో ఉన్న 125సీసీ స్కూటర్ల కంటే మెరుగైనది కాకపోవచ్చు కానీ అత్యున్నత పనితీరు, వాస్తవంగా తెలివైన విద్యుత్ స్కూటర్లను డిజైన్ చేయడంతో పాటుగా రూపకల్పన చేయడంలో అగ్రగామిగా ఉంది. ఎథర్ ఎనర్జీ వాహనాల యాజమాన్య నిర్వహణ ఖర్చు పెట్రోల్ వాహనాలతో పోలిస్తే చాలా స్వల్పంగా మాత్రమే ఉంటుంది. ఎథర్ 450ఎక్స్ వాహన ధర ఫేమ్ –2 రివిజన్ తరువాత (ఎక్స్ షోరూమ్ ) 1,52,401 రూపాయలుగా ఉండగా, ఎథర్ 450 ప్లస్ ధర– 1,33,391 రూపాయలుగా ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. సరిపోల్చతగిన 125 సీసీ స్కూటర్‌తో ఎథర్ 450 ఎక్స్, ఎథర్ 450 ప్లస్ మొత్తం యాజమాన్య నిర్వహణ ఖర్చులను పోల్చినప్పుడు తమ పెట్టుబడిని 18–24 నెలల్లో బ్రేక్ ఈవెన్ సాధించవచ్చు. ఓ సంవత్సరం తరువాత కిలోమీటర్‌కు 2 రూపాయలు ఆదా చేసుకోవడం ప్రారంభించవచ్చు.