Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రముఖ అంతర్జాతీయ స్మార్ట్ డివైస్ బ్రాండ్ ఒప్పో, కె సిరీస్ స్మార్ట్ ఫోన్ K10ను నేడు విడుదల చేసింది. ఈ K10 6+128GB రకం ధర రూ.14990, 8+128GB ధర రూ.16990. ఇది ఫ్లిప్‌కార్ట్, ఒప్పొ ఆన్లైన్ స్టోర్, ఎంపిక చేసిన రిటెయిల్ ఔట్‌లెట్స్‌లో లభిస్తుంది.
ఫ్లాగ్షిప్ గ్రేడ్ ఆల్-రౌండర్ స్మార్ట్‌ఫోన్ మెరుగైన ఎఐ ఫీచర్లతో వెనుక వైపు 50 ఎంపీ ఎఐ ట్రిపుల్ కెమెరా కలిగి ఉంది. ఇది RAM విస్తరణ సాంకేతికత, మెరుపు వేగంతో ఛార్జింగ్ అయ్యే 33W SUPERVOOCతో కూడిన 5000mAh బ్యాటరీ, 16.73cm (6.59”) పంచ్-హోల్ డిస్ప్లే, ఒప్పొ సొంత గ్లో డిజైన్‌తో కూడిన ప్రీమియం టూ-టోన్డ్ స్క్రాచ్-రెసిస్టెంట్ బ్యాక్‌తో వస్తుంది. ఈ డివైస్ 11 భారతీయ భాషలతో పనిచేసే ColorOS 11.1పై నడుస్తుంది.
ఫ్లాగ్షిప్ నుంచి వారస్వతంగా మెరుగైన ఎఐ కెమెరా ఫీచర్లు
50ఎంపీ ఎఐ ట్రిపుల్ కెమెరా సిస్టమ్ స్మార్ట్‌ఫోన్ బ్లర్-ఫ్రీ మూమెంట్లను శక్తివంతమైన రంగులో బంధిస్తుంది. వెనుక కెమెరాలో నైట్స్కేప్ మోడ్ ఎంచుకున్నప్పుడు మసకబారిన పరిసరాలలో ఎక్స్‌పోజర్‌ని సర్దుబాటు చేస్తుంది. మరిన్ని డిటెయిల్స్ క్యాప్చర్ చేసేందుకు మల్టీ-ఫ్రేమ్ కాంపోజిట్ టెక్నిక్ ఉపయోగిస్తుంది. ఇది మూడు నైట్ ఫిల్టర్లు- ఆస్ట్రల్, కాస్మోపాలిటన్, డాజిల్ కలిగి ఉంది.
HDRకి సపోర్టు చేసే OPPO K10 16MP ఎఐ సెల్ఫీ కెమెరా ప్రకాశవంతమైన సెల్ఫీల కోసం 360° ఫిల్ లైట్‌తో వస్తుంది. వీడియో, నైట్, పనోరమిక్, పోర్ట్రెయిట్, టైమ్-లాప్స్, టెక్ట్స్ స్కానర్, స్టిక్కర్ వంటి మోడ్స్‌కు కూడా సపోర్టు చేస్తుంది. ఈ డివైస్‌లోని AI ఫోటో సూట్ AI నైట్ ఫ్లేర్ పోర్ట్రెయిట్ కలిగి ఉంది. ఇది రాత్రి-సమయ పోర్ట్రెయిట్ షాట్స్‌కు లెన్స్ ఫ్లేర్, బోకె ఎఫెక్ట్స్ జోడిస్తుంది. ఇది బ్యూటిఫికేషన్ స్థాయిని అడ్జస్ట్ చేస్తూ బ్యూటీ మార్క్‌ల వంటి సహజ లక్షణాల అలాగే ఉంచుతూ చర్మపు మచ్చలు తొలగించేందుకు ఫ్రంట్ కెమెరాలో ఎఐ నేచురల్ రీటచింగ్ కూడా కలిగి ఉంది. దీనితో పాటు ఫోన్లోని వినూత్న AI పాలెట్ భవిష్యత్ చిత్రాలకు వర్తింపచేసుకునేందుకు ఇతర ఫొటోల సెట్టింగ్ టెంప్లేట్ క్రియేట్ చేసుకునేందుకు యూజర్లకు వెసులుబాటు కల్పిస్తుంది.
నిరంతరాయ, కేర్ఫ్రీ పనితీరు
OPPO K10 6GB, 8GB (5GB RAM విస్తరణతో) రెండు RAM కాన్ఫిగరేషన్లలో 128GB స్టోరేజ్‌తో లభిస్తుంది. ఇది బహుళ యాప్‌లు, మీడియా మధ్య త్వరితగతంగా, నిరంతరాయంగా మారేందుకు అవసరమైనదాని కంటే ఎక్కువ మెమరీ అందిస్తుంది. మైక్రో SD స్లాట్ ద్వారా 1TB వరకు మెమరీని విస్తరించుకునే ఆప్షన్ కూడా అందిస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లోని క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 680 CPU తక్కువ శక్తి వినియోగంతో గరిష్ట పనితీరు అందిస్తుంది. ఇంతకు ముందు ఉన్న డివైస్‌తో పోల్చినప్పుడు దీని బ్యాటరీ పనితీరు 20% కంటే ఎక్కువ మెరుగ్గా పనిచేస్తుంది. మెరుపు-వేగంతో ఛార్జింగ్ అయ్యేందుకు ఈ స్మార్ట్‌ఫోన్ 33W SUPERVOOC సపోర్టు కలిగిన భారీ 5000mAh బ్యాటరీ కలిగి ఉంది. కేవలం 5 నిమిషాల ఛార్జింగ్‌తో 3 గంటల 38 నిమిషాల వరకు కాల్ సమయాన్ని అందిస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లో ఆప్టిమైజ్ చేయబడిన నైట్ ఛార్జింగ్, సూపర్ నైట్-టైమ్ స్టాండ్‌బై వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇవి ఓవర్ ఛార్జింగ్‌ను నివారిస్తాయి కాబట్టి విద్యుత్ వినియోగాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. K10 టైప్-C ఛార్జింగ్, 3.5 ఎంఎం ఆడియో జాక్‌తో వస్తుంది.
16.73 సెం.మీ (6.59”) 90Hz కలర్-రిచ్ పంచ్ హోల్ డిస్ప్లేను యూజర్లు ఆస్వాదించవచ్చు. ఇది చిత్రాలు, వీడియోలనూ విస్తృత కలర్ స్పెక్ట్రమ్‌తో కవర్ చేస్తూ సజీవ చిత్రాలను అందిస్తుంది. అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో కూడిన ఈ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ జీవితాన్ని పొడిగించడానికి ఉపయోగ విధానాలను బట్టి రిఫ్రెష్ రేట్‌ను సర్దుబాటు చేస్తుంది. వినియోగదారులందరికీ వినియోగ సౌకర్యాన్ని నిర్ధారిస్తూ, OPPO K10 ఆల్-డే ఎఐ ఐ కంఫర్ట్‌తో వస్తుంది, ఇది వివిధ స్థాయిల పరిసర కాంతిని గుర్తిస్తుంది.
నిలిచి ఉండే నాణ్యత
బ్ల్యాక్ కార్బన్, బ్లూ ఫ్లేమ్ అనే రెండు రంగుల్లో అందుబాటులో ఉన్నా K10 గ్లో డిజైన్ ఫింగర్‌ప్రింట్, స్క్రాచ్-రెసిస్టెంట్ బ్యాక్‌తో నిగనిగతో పాటు మ్యాట్ మెటీరియల్‌ల సంపూర్ణ సమతుల్య కలయికను అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో సైడ్ ఫింగర్‌ప్రింట్ అన్‌లాక్ సిస్టమ్ ఉంది. అంతే కాకుండా అధునాతన గ్రాఫైట్ హీట్ డిస్సిపేషన్ సిస్టమ్ కారణంగా ఈ స్మార్ట్‌ఫోన్ ఎల్లప్పుడూ చల్లగా ఉంటుంది.
అన్ని ఒప్పొ ఉత్పత్తుల మాదిరిగానే K10 కూడా దీర్ఘకాలిక వినియోగం కోసం రూపొందించబడింది. నాణ్యత, పనితీరు, భద్రతపరమైన కఠినమైన పరీక్షలను ఎదుర్కొంది. దుమ్ము, స్ప్లాష్ నిరోధకత కోసం IP54 రేటింగ్ కలిగి ఉంది. మృదువైన మార్బల్ ఫ్లోర్‌పై ఒకటి మీటర్ ఎత్తునుంచి దీన్ని జారవిడచడం జరిగింది. అంతే కాదు 5 ప్రధాన పర్యావరణ పరిరక్షణ ప్రక్రియలు, 130+ అత్యంత కఠినమైన విశ్వసనీయత పరీక్షలు మరియు 320+ సమగ్ర పరీక్ష దశలను ఇది దాటుకొని వచ్చింది.
OPPO Enco Air2
Enco Air2ని కూడా ఒప్పొ విడుదల చేసింది. 13.4 ఎంఎం డైనమిక్ డ్రైవర్స్, స్పోర్ట్స్‌తో కూడిన నిజమైన వైర్లెస్ ఇయర్‌బడ్. సృజనాత్మకమైన జెల్లీ కేస్ లిడ్ ప్రత్యేకత. 24 గంటల సుదీర్ఘ బ్యాటరీ లైఫ్, TWS థంపింగ్ సౌండ్, ప్రత్యేకమైన బాస్ బూస్టర్ మరిన్ని విశిష్ఠతలు సమకూర్చుంది. ఒక్కో బడ్ బరువు కేవలం 3.5 గ్రాములు అయినప్పటికీ టచ్ కంట్రోల్స్, కాల్స్ కోసం ఎఐ నాయిస్ క్యాన్సిలేషన్, 80ms తక్కువ-లేటెన్సీ గేమ్ మోడ్ ధర రూ.2499
ధర, లభ్యత
29 మార్చి, 2022 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ-కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్, ఎంపిక చేసిన రిటైల్ ఔట్లెట్లు OPPO ఆన్లైన్ స్టోర్లలో OPPO K10 అందుబాటులో ఉంటుంది. 6GB + 128GB వేరియంట్ ధర రూ. 14990, 8GB + 128GB ధర రూ. 16990. ఎస్బీఐ డెబిట్/క్రెడిట్, ఈఎంఐ లావాదేవీలపై రూ.2000 తగ్గింపు, 3 నెలల వరకు నో కాస్ట్ EMI పొందవచ్చు. స్టాండర్డ్ చార్టర్డ్, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డులు, క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ.1000 తగ్గింపు పొందగలరు. ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే కస్టమర్లకు డిస్నీ+హాట్‌స్టార్ 1 సంవత్సరం సభ్యత్వాన్ని పొందుతారు. ఎంపిక చేసిన పిన్ కోడ్లలో Flipkart Quick ద్వారా కేవలం 90 నిమిషాల్లో డెలివరీ చేయవచ్చు.
OPPO Enco Air2 ప్రముఖ ఈ-కామర్స్ వేదికలు, ఒప్పొ ఆన్లైన్ స్టోర్‌లో 29 మార్చి 2022 నుంచి రూ. XXకు అందుబాటులో ఉంటుంది.