Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : హెచ్డీఎఫ్సి బ్యాంక్ తన 5వ వార్షిక స్మార్ట్‌అప్ పరివర్తన్ గ్రాంట్స్ 2022 విజేతలను నేడు ప్రకటించింది. పర్యావరణం, ఆరోగ్య సంరక్షణ రంగాలు మరియు లింగ వైవిధ్యం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంపై దృష్టి సారించిన 85 వినూత్న స్టార్టప్‌లకు హెచ్డీఎఫ్సిబ్యాంక్ నిధులు అందజేసింది. ఈ నిధులు సమాజం మరియు పర్యావరణంలో స్థిరమైన మార్పును తీసుకు వచ్చేందుకు ప్రత్యేకమైన పరిష్కారాలను అందించే స్టార్ట్-అప్‌లను ప్రోత్సహించేందుకు ఉద్దేశించబడ్డాయి. బ్యాంక్ నిర్వహించే సామాజిక కార్యక్రమాల కోసం ఫ్లాగ్షిప్ సీఎస్ఆర్ ప్రోగ్రామ్ #పరివర్తన్ ఆధ్వర్యంలో ఈ నిధులను అందజేశారు. దరఖాస్తులు పంపుకున్న వారి నుంచి విజేతలను ఎంపిక చేసేందుకు వారికి మార్గదర్శనం చేసేందుకు ఐఐఎం-బి, ఐఎస్బి, ఎఐసి ఎన్కోర్ (AIC Ncore)డెవలప్మెంటల్ ఇంపాక్ట్ ఫౌండేషన్, కెఐఐటి-టెక్నాలజీ బిజినెస్, అమృత టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్, ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఫౌండేషన్ ఇండియాతో సహా 28 ఇంక్యుబేటర్లతో బ్యాంకు భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. ఈ ఇంక్యుబేటర్లు, బ్యాంక్‌తో పాటు, కఠినమైన స్క్రీనింగ్ ప్రక్రియ ద్వారా వివిధ రంగాలలో పనిచేస్తున్న దేశవ్యాప్తంగా 150 మంది దరఖాస్తుదారుల నుంచి 85అంకుర పరిశ్రమలను ఎంపిక చేశారు. విడ్కేర్ టెక్నాలజీస్, జిని హెల్త్‌కేర్ ఏఐ, ఎకో డెకో, అయాంగ్ ట్రస్ట్, నవోడే ఫౌండేషన్ మరియు ఫెలిస్ లియో వెంచర్స్ ద్వారా కొన్ని విజేతలకు పిచ్‌లు తయారు చేశారు. విజేతలు మహిళా సాధికారత నుంచి బయో-డిగ్రేడబుల్ బ్యాటరీలను సృష్టించడం, నైపుణ్యం పెంచడం, రీసైక్లింగ్ వరకు విభిన్న సమస్యలను పరిష్కరిస్తున్నారు.
(ఇంక్యుబేటర్లు మరియు విజేతల పూర్తి జాబితా అనుబంధంలో అందుబాటులో ఉంది)
బ్యాంక్ 2017లో స్మార్ట్‌అప్ గ్రాంట్లను ప్రారంభించగా, అప్పటి నుంచి భారతదేశంలోని వివిధ నగరాల నుండి ~90 స్టార్ట్-అప్‌లకు మద్దతు ఇచ్చింది. అలాగే, గత ఐదేళ్లుగా బ్యాంక్ సుమారుగా ₹35 కోట్ల విలువైన నిధులను వితరణ చేసింది.
ఈ ఏడాది కూడా, మహమ్మారి మార్గదర్శకాలను అనుసరించి, ఆన్లైన్లో స్క్రీనింగ్ నిర్వహించారు. స్టార్ట్-అప్లు వర్చువల్ ప్లాట్‌ఫారమ్‌లో తమ ఆవిష్కారాల గురించి వివరించారు. స్టార్ట్-అప్‌లను మూల్యాంకనం చేసేందుకు అత్యంత ముఖ్యమైన ప్రమాణాలలను అనుసరించగా, వాటి కొలమానాలు ఇలా ఉన్నాయి:
· ఆలోచనలకు సంబంధించిన స్థిరత్వం
· జారీలోకి తీసుకు రాగలిగిన అవకాశం
· ఇది సమాజానికి మరియు పర్యావరణానికి ఎలా ఉపయోగపడుతుంది
· ప్రాజెక్టు ప్రత్యేకత
‘‘పరివర్తన్ స్మార్ట్‌అప్ గ్రాంట్లు భారతదేశంలోని స్టార్ట్-అప్ పర్యావరణ వ్యవస్థతో మా అనుబంధాన్ని బలోపేతం చేసేందుకు బ్యాంక్ తన నిబద్ధతలో భాగం అని భావిస్తుంది. SmartUp programme ద్వారా, మేము ఉద్యోగాలు, అవకాశాలు, సమాజం మరియు పర్యావరణం కోసం ప్రభావాన్ని సృష్టించేందుకు స్టార్ట్-అప్ సముదాయంలో వ్యవస్థాపక స్ఫూర్తిని పెంపొందిస్తున్నాము. మేము వ్యవస్థాపకులకు వారి దృష్టిని గ్రహించడంలో మరియు సమాజానికి విలువను సృష్టించడంలో సహాయపడేందుకు స్మార్ట్ ఆర్థిక సాధనాలు, సలహా సేవలు మరియు సాంకేతికతతో వారిని సన్నద్ధం చేస్తాము. సమాజంలో స్థిరమైన మార్పును తీసుకువచ్చేందుకు వినూత్న పరిష్కారాలపై పనిచేస్తున్న స్టార్టప్‌ల గురించి మాకు తెలుసు. ఈ నిధులు మన సమాజాన్ని నిలకడగా మార్చేందుకు పని చేస్తున్న స్టార్ట్-అప్‌లకు మా ప్రశంసలు మరియు మద్దతుగా నిలుస్తాయి” అని బీసీ &పార్టనర్షిప్ బ్యాంకింగ్, ఎకోసిస్టమ్ బ్యాంకింగ్, ఇన్‌క్లూజివ్ బ్యాంకింగ్ గ్రూప్ మరియు స్టార్ట్-అప్లు, హెచ్‌డిఎఫ్‌సి గ్రూప్ హెడ్, గవర్నమెంట్ మరియు ఇనిస్టిట్యూషనల్ బిజినెస్ అధికారిణి స్మితా భగత్పేర్కొన్నారు.
“ఇది స్టార్టప్‌లకు మేము వరుసగా మద్దతు ఇస్తున్న ఐదో ఏడాది. సానుకూల సామాజిక మార్పును తీసుకురావాలని చూస్తున్న వ్యవస్థాపకులకు సహాయం చేయడంలో ఈ అద్భుతమైన ప్రయాణంలో భాగమైనందుకు మేము సంతోషిస్తున్నాము. మా #పరివర్తన్, మా ఫ్లాగ్షిప్ కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమం కాగా, సమాజ శ్రేయస్సుకు ఉత్ప్రేరకంగా నిలుస్తుంది. జీవనోపాధిని పెంపొందించేందుకు పని చేస్తున్న స్టార్టప్‌లు, నైపుణ్యం మరియు సమాజంలోని సవాలుకు గురైన వర్గాలతో కలిసి పనిచేయడం; సమ్మిళిత మార్పును తీసుకురావడం అనేది మనం జీవిస్తున్న సమాజానికి తిరిగి అందించాలనే మా లక్ష్యంతో సమకాలీకరించబడింది’’ అని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ గ్రూప్ హెడ్ - బిజినెస్ ఫైనాన్స్ అండ్ స్ట్రాటజీ, సిఎస్ఆర్ మరియు ఇఎస్జి, అడ్మినిస్ట్రేషన్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అషిమా భట్ తెలిపారు.
గతంలో, వాతావరణ మార్పు, వ్యర్థాల నిర్వహణ, నైపుణ్యాల శిక్షణ మరియు జీవనోపాధిని మెరుగుపరచడం తదితర కొన్ని ప్రత్యేకమైన ఆలోచనలకు,వినూత్న పరిష్కారాలపై పని చేస్తున్న స్టార్టప్‌ల ద్వారా స్మార్ట్-అప్ గ్రాంట్లు ఇవ్వబడ్డాయి. గతంలో,ఈ నిధులు కేవలం మెట్రో నగరాల్లోనే కాకుండా, ప్రధానంగా భారతదేశంలోని టైర్ 2 మరియు టైర్ 3 నగరాలకు చెందిన స్టార్ట్-అప్‌లకు ఇచ్చారు.