Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చక్కని వీక్షణ, వినోదాన్ని క్యాంప్యాక్ట్ ఫామ్ ఫ్యాక్టర్ ద్వారా అందించే ఫ్రీస్టైల్
స్మార్ట్ టీవీ ఫీచర్లు, వాయిస్ కంట్రోల్, ధృవీకృత ఓటీటీ వేదికలతో కూడిన డివైస్
ప్రతీసారి చక్కని చిత్రాన్ని అందించేందుకు ఆటో-లెవల్, ఆటో ఫొకస్, ఆటో కీస్టోర్ ఫీచర్లు
మార్చి 29, 2022న 18:00 గంటల నుంచి మార్చి 31, 2022, 23:59 గంటల మధ్యకాలంలో ఫ్రీస్టైల్ కొనుగోలు చేసే వినియోగదారులు రూ.5,900 విలువైన ది ఫ్రీస్టైల్ ఫ్రీ క్యారీ కేస్
హైదరాబాద్ : భారతదేశపు అతిపెద్ద, అత్యంత విశ్వసనీయ కన్సుమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ సాంసంగ్ సరికొత్త ప్రొజెక్టర్, స్మార్ట్ స్పీకర్. యాంబియంట్ లైటింగ్ డివైస్ అన్నింటిని కలిపి తక్కువ బరువు, ఎక్కడికైనా తీసుకెళ్లగలిగే డివైస్ ఉ ది ఫ్రీస్టైల్ గా విడుదల చేసినట్టు నేడు ప్రకటించింది. ఆధునిక యువత, సహస్రాబ్ది వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ది ఫ్రీస్టైల్, ఎక్కడికెళ్లినా చక్కని వీక్షణ, వినోదంతో పాటు వీడియో, ఆడియో కంటెంట్ కోరుకునే వినియోగదారులకు వాటిని అందించే మొట్టమొదటి సాంకేతికత, సౌలభ్యం కలిగి ఉంది. 100-అంగుళాల (2 మీ 54సెం.మీ) స్క్రీన్ పరిమాణం వరకు వీడియోను ఫ్రీస్టైల్ ప్రొజెక్ట్ చేయగలదు.
అల్ట్రాపోర్టబుల్ ప్రొజెక్టర్ ఫ్రీస్టైల్,సాంసంగ్ అధికారిక ఆన్లైన్ స్టోర్ సాంసంగ్ షాప్‌లోనూ, అమెజాన్‌లో రూ84,990 ప్రత్యేక ధరకు అందుబాటులో ఉంది. వినియోగదారులు రూ.5,000 ఇన్స్టంట్ క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు.పరిమిత వ్యవధి ఆఫర్‌గా మార్చి 29, 2022న 18:00 గంటల నుంచి మార్చి 31, 2022, 23:59 గంటల మధ్యకాలంలో ఫ్రీస్టైల్ కొనుగోలు చేసే వినియోగదారులు రూ.5,900 విలువైన ది ఫ్రీస్టైల్ ఫ్రీ క్యారీ కేస్ అందుకుంటారు. ఫ్రీస్టైల్‌ను ప్రీ-రిజర్వ్ చేసుకునే వినియోగదారులు రూ.4,000 విలువైన తగ్గింపు పొందవచ్చు.
సాంప్రదాయ, బాక్సీ ప్రొజెక్టర్ల మాదిరిగా కాకుండా ఫ్రీస్టైల్లోని భిన్నమైన క్రెడిల్ కొన్ని సులభమైన క్లిక్స్తో 180 డిగ్రీల వరకు తిరుగుతూ గోడ నుంచి పైకప్పు వరకు చక్కని వీక్షణ కోణాన్ని అందిస్తుంది. దీని బరువు కేవలం 0.8 కిలోలే. కాబట్టి వినియోగదారులు దీనిని ఎ్కకడికైనా తీసుకెళ్లవచ్చు. టేబుల్స్, అంతస్తులు, గోడలు లేదా పైకప్పులు ఎక్కడైనా హై క్వాలిటీ వీడియో చూపించవచ్చు.దీనికి ప్రత్యేక స్క్రీన్ అవసరం లేదు.మీరు దాన్ని వంచి మీరు ప్లే చేసే విధానాన్ని మార్చి ఎప్పుడైనా, ఎక్కడైనా పెద్ద స్క్రీన్ అనుభూతిని ఆస్వాదించవచ్చు.
ఫ్రీస్టైల్‌లో ఆటో కీస్టోన్, ఆటో లెవలింగ్, ఆటో ఫోకస్ ఫీచర్లు ఉత్కంఠభరితమైన చిత్ర నాణ్యతను అందిస్తాయి.ఆటో కీస్టోన్ పరికరాన్ని ఏ కోణంలోనైనా అది ఫ్లాట్ సర్ఫేస్ కావచ్చు లేదా ఏదైనా యాంగిల్ కావచ్చు డివైస్‌ను ఆటోమ్యాటిక్‌గా అడ్జస్ట్ చేసి చక్కని చిత్రాన్ని అందిస్తుంది.ఆటో ఫోకస్ ఫ్రీస్టైల్ని సెకన్లలో 100-అంగుళాల (2మీ 54సెం.మీ) వరకు స్పష్టమైన చిత్రంఅందించేందుకు ఆటోమేటిక్‌గా ఫోకస్ చేస్తుంది.ఆటో లెవలింగ్ ఫీచర్ స్క్రీన్ ఏ ఉపరితలంపైనా ఉరాళ్లతో కూడిన క్యాంపింగ్ గ్రౌండ్స్, మొత్తటి పరుపులు, ఎక్కడైనా సరే స్క్రీన్ లెవల్లో ఉండేలా చూస్తుంది.వీక్షణ అనుభూతిని మరింత మెరుగుపరిచేందుకు ఫ్రీస్టైల్ మీ గోడ రంగు ఆధారంగా ప్రొజెక్షన్‌ను ఆప్టిమైజ్ చేస్తుంది.దీనికి వైట్ బ్యాక్‌గ్రౌండ్ అవసరం లేదు.
ఫ్రీస్టైల్ ద్వారా స్థల పరిమితులను దాటి ఎక్కడైనా, ఎప్పుడైనా, విభిన్న ప్రాధాన్యతలు, జీవనశైలి అవసరాలకు అనుగుణంగా వినియోగదారు అనుభూతి అందించాలనుకుంటున్నాము. ఫ్రీస్టైల్ అల్ట్రా-పోర్టబుల్ ప్రొజెక్టర్ ఇన్డోర్ లేదా అవుట్డోర్ ఎక్కడైనా కంటెంట్ చూడటం లేదా చుట్టుపక్కల లైటింగ్, గేమింగ్ లేదా మ్యూజిక్, తక్షణ వినోదం కోసం అపరిమిత అవకాశాలు అందిస్తుంది. దీని ప్రత్యేక ఫామ్ ఫ్యాక్టర్ మీరు ఆడే విధానాన్ని మారుస్తుంది. ఫ్రీస్టైల్ మా వినియోగదారులకు కొత్త స్థాయి వినోదాన్ని అందిస్తుందని మేము విశ్వసిస్తున్నాముు అన్నారు సాంసంగ్ ఇండియా కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ బిజినెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మోహన్‌దీప్ సింగ్.
ఫ్రీస్టైల్ అనేది పరిశ్రమలో మొట్టమొదటి పోర్టబుల్ ప్రొజెక్టర్, ఇది ధృవీకరించిన OTT ప్లాట్‌ఫారమ్స్ కలిగి ఉంది కాబట్టి వినియోగదారులకు అంతులేని కంటెంట్ ఎంపికలు అందిస్తుంది. సాంసంగ్ స్మార్ట్ టీవీల్లో ఉండే స్మార్ట్ ఫీచర్లను కూడా వినియోగదారులు యాక్సెస్ చేసుకునేందుకు వీలుగా ఇందులో బిల్ట్ ఇన్ స్ట్రీమింగ్ సర్వీసెస్, మొబైల్ మిర్రరింగ్, క్యాస్టింగ్ ఫీచర్స్ ఉన్నాయి. ఇవి ఆండ్రాయిడ్, ఐఓఎస్ మొబైల్ డివైసులకు కూడా అనుకూలం.ఫ్రీసైట్ల్ను ఛార్జింగ్ చేసేందుకు జ-టైప్ పవర్ కనెక్షన్ ఉంది.
గెలాక్సీ వినియోగదారుల కోసం గెలాక్సీ డివైసులతో సింక్ అయ్యే బటన్స్ కలిగి ఉంది ఫ్రీస్టైల్.కేవలం ఒక బటన్ నొక్కితే చాలా వినియోగదారులు తమ గెలాక్సీ డివైస్‌ను వెంటనే రిమోట్ కంట్రోల్‌గా మార్చుకోగలరు.వై-ఫై నెట్‌వర్క్‌లు అందుబాటులో లేనప్పుడు వారు మొబైల్ హాట్‌స్పాట్స్ కూడా ఉపయోగించుకోవచ్చు.
ఓమ్ని-డైరెక్షనల్ 360-డిగ్రీ సౌండ్‌తో పాటు శక్తివంతమైన అంతర్నిర్మిత స్పీకర్ కలిగి ఉంది ఫ్రీస్టైల్.ఇది కస్టమర్లు ఎక్కడ ఉన్నా సినిమా-క్వాలిటీతో కూడిన సౌండ్ అనుభూతిని ఆస్వాదించేలా చేస్తుంది. దీన్ని ప్రొజెక్టర్‌గా ఉపయోగించనప్పుడు యాంబియంట్ మోడ్, ప్రిజం లైటింగ్ ఎఫెక్ట్‌తో అపారదర్శక లెన్స్ క్యాప్, సీనరీలు లేదా మీ సొంత ఫొటోలలో ఒకదానిని ఎంచుకోవడం ద్వారా మీ స్పేస్ మార్చుకునే వెసులుబాటు ఫ్రీస్టైల్ కల్పిస్తుంది.
ఈ శ్రేణిలో మొట్టమొదటి ఫార్-ఫీల్డ్ వాయిస్ కంట్రోల్ టెక్నాలజీని కూడా కలిగి ఉంది ఫ్రీస్టైల్. స్క్రీన్ ఆన్ చేసినప్పుడు వినియోగదారులు వారి వాయిస్ ఉపయోగించి కంటెంట్ సెర్చ్ చేయవచ్చు. స్క్రీన్ ఆఫ్‌లో ఉన్నప్పుడు స్మార్ట్ స్పీకర్ ఉపయోగించి ఎలా అయితే మ్యూజిక్ వినడం, లేదా వాతావరణం తెలుసుకుంటామో అలా దీన్ని ఉపయోగించవచ్చు.
ధర, ఆఫర్లు ఎక్కడ కొనాలి
రూ.84,990 ప్రత్యేక ధరతో ఫ్రీస్టైల్ విడుదలైంది. సాంసంగ్ అధికారిక ఆన్లైన్ స్టోర్ సాంసంగ్ షాప్, అమెజాన్‌లో అందుబాటులో ఉంది. వినియోగదారులు రూ.5,000 తక్షణ క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు.
మార్చి 29, 2022న 18:00 గంటల నుంచి మార్చి 31, 2022, 23:59 గంటల మధ్య కాలంలో ఫ్రీస్టైల్ ప్రొజెక్టర్ కొనుగోలు చేసే వినియోగదారులు రూ.5,900 విలువైన ది ఫ్రీస్టైల్ ఫ్రీ క్యారీ కేస్ అందుకుంటారు. ఫ్రీస్టైల్‌ను ప్రీ-రిజర్వ్ చేసుకునే వినియోగదారులు రూ.4,000 విలువైన తగ్గింపు పొందవచ్చు.
వారెంటీ
ఫ్రీస్టైల్పై వినియోగదారులకు 2 సంవత్సరాల వారంటీ అందించబడుతోంది.
వస్తువు వివరాలు:
కాంప్యాక్ట్ డిజైన్
నేటి వినియోగదారుల భిన్నమైన రుచులు, ఆసక్తులను ఎంతో సులభంగా వ్యక్తం చేసేందుకు, యూజర్లకు కొత్త స్థాయి ఫంక్షనాలిటిని అందించేలా ఫ్రీస్టైల్ ఎంతో వైవిధ్యంగా డిజైన్ చేయబడింది. ఇది స్పాట్లైట్, స్మార్ట్ స్పీకర్ సమ్మేళనంగా కనిపించే సొగసైన సిలిండర్ రూపంలో వస్తుంది.దీని పూర్తి డిజైన్ ప్రతీ యూజర్ విభిన్న జీవనశైలికి సరిపోయేలా నిలుస్తూ వైవిధ్యభరితమైన డివైస్‌గా నిలుస్తుంది.
ఎంతో నాజూకు ఆకారం ఉన్నప్పటికీ ఫ్రీస్టైల్‌లో పెద్ద ప్రొజెక్టరులో చూడగలిగే అన్ని ఫీచర్లు ఉన్నాయి. ఆటో ఫోకస్, ఆటోమ్యాటిక్ కీస్టోన్ కరెక్షన్ ఉన్నాయి, ఈ రెండూ ప్రొజెక్టర్‌కు ప్రకటన స్వేచ్ఛ ఇస్తాయి.వినియోగదారుల ప్రతిరోజూ తీసుకెళ్లేందుకు వీలుగా ఫ్రీస్టైల్ కేవలం 0.8 కేజీ బరువుతో తేలికగా రూపొందించబడింది. ఇది ప్రొజెక్టర్‌గా ఉపయోగించనప్పుడుయాంబియంట్ మోడ్, లెన్స్ క్యాప్‌తో మూడ్ లైటింగ్ ప్రభావాన్ని అందిస్తుంది.
ఉపయోగించడం సులభం
వైవిధ్యంగా ఉంటుంది కాబట్టి ఫ్రీస్టైల్ 180 డిగ్రీల వరకు తిరుగుతుంది, దీని ద్వారా వినియోగదారులు మరో ప్రత్యేక స్క్రీన్ అవసరం లేకుండానే అత్యంత నాణ్యమైన వీడియోని ప్రదర్శించవచ్చు.
16:9 రేషియోలో ఎటువంటి వక్రీకరణలు లేకుండా స్క్రీన్‌ను పూచేందుకు ఫ్రీస్టైల్‌లో ఈ ఫంక్షన్స్ అన్ని ఉన్నాయి:
- ఆటో కీస్టోన్: వంకరగా ఉన్న చిత్రాలను స్ట్రెయిట్‌గా, రెక్టాంగులర్ స్క్రీన్‌గా చూపేందుకు ఫ్రీస్టైల్ ప్రతీసారి వాటిని ఆటోమ్యాటిక్‌గా కరెక్ట్ చేసుకుంటుంది.దానికి మీరు చేయాల్సిందల్లా ఆన్ చేయడమే.
- స్పష్టమైన చిత్రాల కోసం ఆటో ఫోకస్: ఫ్రీస్టైల్ ఆటోమ్యాటిక్‌గా సెకన్ల వ్యవధిలోనే చక్కని. స్పష్టమైన చిత్రాన్ని ఫోకస్ చేస్తుంది.కాబట్టి మీరు కంటెంట్‌పై దృష్టి పెడితే సరిపోతుంది.
- ఆటో లెవలింగ్: మీరు రాళ్ల మధ్యన ఉన్నా, మెత్తడి పరుపుల మధ్య ఉన్నా మీ స్క్రీన్ ఒకే లెవల్లో ఉండేలా ఇది చూస్తుంది.
మల్టిపుల్ వాయిస్ అసిస్టెంట్లు: ఇన్‌బిల్ట్ సాంసంగ్ బిక్స్బీ, అమెజాన్ అలెక్సాతో ఫ్రీస్టైల్ని ఎవరైనా తమ స్వరంతో నియంత్రించవచ్చు. ఇందులో పరిసర శబ్దాన్ని తగ్గించే సాంకేతికత కలిగి ఉంది. గతంలో ప్రొజెక్టర్లకు ఇది నిరంతర సమస్యగా ఉండేది.ఇది ఫార్-ఫీల్డ్ మైక్రోఫోన్లు కూడా కలిగి ఉంది కాబట్టి ఫ్రీస్టైల్ వాయిస్ అసిస్టెంట్ దూరం నుంచి మాట్లాడే వారి మాటలు కూడా వినగలుగుతుంది.
సౌండ్ అండ్ మూడ్
ఫ్రీస్టైల్ 360-డిగ్రీ సౌండ్ సిస్టమ్ మిమ్మల్ని మైమరపింపజేసే ఆడియో-విజువల్ అనుభూతిని అందిస్తుందని వాగ్దానం చేస్తోంది.ఫ్రీస్టైల్ ఒక స్మార్ట్ స్పీకర్ కూడా.ఇది గోడలు, అంతస్తులు, మరెక్కడైనా ప్రదర్శించగలిగే విభిన్న విజువల్ ఎఫెక్ట్‌లతో జత చేసేలా సంగీతాన్ని విశ్లేషించగలదు.ఫ్రీస్టైల్ లెన్స్ క్యాప్ ఉపయోగించి యాంబియంట్ మోడ్, ప్రిజం ఎఫెక్ట్‌తో వాతావరణాన్ని సెట్ చేసుకోవచ్చు.
రియల్ స్మార్ట్ టీవీ
సాంసంగ్ ఫ్రీస్టైల్ అనేది ఆండ్రాయిడ్, iOS పరికరాల కోసం స్మార్ట్ టీవీ, కాస్టింగ్/మిర్రర్ పనులు చేసే ప్రొజెక్టర్ కూడా.నెట్‌ఫ్లిక్స్, హులు, యూట్యూబ్, డిస్నీ హాట్‌స్టార్ డ ప్రైమ్ వీడియో వంటి స్ట్రీమింగ్ యాప్స్ ఇందులో ఇన్‌బిల్ట్‌గా ఉన్నాయి. ఫార్-ఫీల్డ్ వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ ద్వారా స్క్రీన్ ఆఫ్‌లో ఉన్నప్పుడు కూడా ఫ్రీస్టైల్ యూజర్లు మ్యూజిక్ ప్లే చేయడానికి, వర్చువల్ అసిస్టెంట్ ఫీచర్లు ఉపయోగించేందుకు ఇది అనుమతిస్తుంది.
ఆన్‌లో ఉన్నప్పుడు: వీడియో స్ట్రీమింగ్ కోసం కంట్రోల్ ఫంక్షన్లు
-ఆఫ్‌లో ఉన్నప్పుడు: మ్యూజిక్ స్ట్రీమింగ్ కోసం కంట్రోల్ ఫంక్షన్లు
గెలాక్సీ డివైసులతో సింక్ అయ్యే బటన్స్ కలిగి ఉంది ఫ్రీస్టైల్.కేవలం ఒక బటన్ నొక్కితే చాలా వినియోగదారులు తమ గెలాక్సీ డివైస్‌ను వెంటనే రిమోట్ కంట్రోల్‌గా మార్చుకోగలరు.ట్యాప్ వ్యూ, ఎయిర్‌ప్లే 2 అండ్ మైక్రో HDMI పోర్టు ద్వారా ఎటువంటి చికాకు లేకుండా వైర్‌లైస్ కనెక్షన్ పొందవచ్చు.
ఇన్‌డోర్స్ కావచ్చు, ఔట్‌డోర్స్ కావచ్చు, మీ సౌలభ్యం మేరకు ఎక్కైడనా కంటెంట్‌ను వీక్షించేందుకు ఫ్రీస్టైల్ ద్వారా మీరు మీ సొంత స్పేస్ క్రియేట్ చేసుకోవచ్చు
చక్కని వీక్షణ అనుభవం
ఎంత స్థలం ఉందనే దానితో సంబంధం లేకుండా పెద్ద స్క్రీన్ స్ట్రీమింగ్‌ను గతం కంటే ఎంతో సులభతరం చేస్తుంది ఫ్రీస్టైల్.ఎవరైనా ఎప్పుడైనా, ఎక్కడైనా పెద్ద స్క్రీన్‌పై కంటెంట్‌ని చూసి ఆనందించవచ్చు.స్కేల్ డ మూవ్ ఫీచర్ ఉపయోగించి ప్రొజెక్టర్‌ను ఎటూ కదపకుండా ప్రొజెక్ట్ చేసిన డిస్ప్లే పరిమాణాన్ని 50% వరకు పెంచుకోవచ్చు, స్క్రీన్ కదిలించవచ్చు.1920 ఞ 1080 నేటివ్ రిజల్యూషన్‌తో పాటు నణ=10కు ఫ్రీస్టైల్ సపోర్టు చేస్తుంది.విభిన్నమైన వినోద అనుభూతి కోసం 30-అంగుళాల నుంచి 100-అంగుళాల వరకు ప్రొజెక్ట్ చేయగలదు.
ఫ్రీస్టైల్ యాక్సెసరీలు
ఫ్రీస్టైల్ కేస్ – వాటర్‌ఫ్రూఫ్, స్క్రాచ్ ఫ్రీ కేస్ – ఎటు అంటే అటు వెళ్లడానికి, స్టోరేజ్ కోసం అవసరమైన యాక్సెసరీ.