Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : లైవ్ ఆన్లైన్ లెర్నింగ్‌లో అగ్రగామిగా ఉన్న Vedantu ప్రపంచంలో అత్యంత కమ్యూనికేషన్ అలాగే పరిణామకారి క్లాస్రూమ్ వేవ్ 2.0 (W.A.V.E.2.0) తమ కార్యక్రమం విటోపియాలో విడుదల చేసింది. ఈ పేటెంట్ కలిగిన సాంకేతికత లెర్నింగ్ అనుభవాన్ని సరికొత్తగా అందించనుంది మరియు సాధనల గుర్తింపును సంపూర్ణంగా కొత్త శిఖరాలకు తోడ్కొనివెళ్లనుంది. వేవ్ (వైట్‌బోర్డ్ ఆడియో వీడియో ఎన్విరాన్మెంట్) లెర్నింగ్ ప్లాట్ఫారంలో 2.0 ఎడిషన్ కాగా, ప్రతి విద్యార్థికీ స్ఫూర్తి నింపే అలాగే నాణ్యతతో కూడిన విద్య లభించేలా చేసే అలాగే భారతదేశంలో పరిణామాన్ని పెద్ద ప్రమాణంలో సృష్టించే లక్ష్యాన్ని కలిగి ఉంది. వేవ్‌కు సంబంధించిన శక్తి రియల్ టైమ్‌లో తన ఏఐ/ఎంఎల్ వినియోగించుకుని 100+ పారామీటర్లను కొలిచే మహోన్నత సామర్థ్యం కలిగి ఉండగా, విద్యార్థుల క్రియాశీలత, బోధనకు సంబంధించిన పరిణామకారితత్వం మరియు లెర్నింగ్ ఫలితాంశాలను ఉత్తేజిస్తుంది. ఈ సంచలనాత్మక సాంకేతికత ఫేస్ రికగ్నైజేషన్, కంటెంట్, వైట్‌బోర్డ్, యూసేజ్ అనాలసిస్, వర్బల్ ఇంటరాక్షన్ అనాలసిస్, డౌట్ అనాలసిస్, టోన్ మరియు సెంటిమెంట్ అనాలసిస్ తదితరాల ద్వారా కచ్చితమైన ఇన్సైట్లను అందిస్తుంది. సాంకేతికత, పర్సనలైజేషన్ అనేవి ఊహించని ప్రమాణంలో వినియోగదారునికి అందుబాటులోకి రావడంతో ఇది విద్యార్థులకు వినోదం, ఇంటరాక్టివ్ మరియు రివార్డింగ్లతో కూడిన అధ్యయన విధానాలతో క్రియాశీలకంగా ఉండగా, వేవ్ 2.0 అత్యుత్తమమైన పర్సనలైజ్డ్ టీచింగ్, లెర్నింగ్ మరియు రికగ్నైజేషన్ను ప్రతి విద్యార్థికీ అందుబాటులోకి తీసుకురాగా, ఇది 10 రెట్లు ఎక్కువ క్రియాశీలత, పరిణామకారి, ఊహించుకోదగిన మరియు కోట్లాది విద్యార్థులకు అత్యంత తక్కువ ఖర్చులో మార్పు తీసుకు వచ్చే లెర్నింగ్ ఫలితాలతో డిజైన్ చేశారు. మెరుగుపరచిన ఏఐ/ఎంఎల్ సాంకేతికత అలవర్చుకోవడం ద్వారా వేదాంతు ఆన్లైన్ శిక్షణ కళ భవిష్యత్తుకు కొలమానాలను నిర్దేశించింది. ఈ ప్లాట్ఫారంలో సమగ్ర అనుభవం క్రియాశీలకంగా ఉండే విద్యార్థులు పాల్గొనడాన్ని వృద్ధి చేసే లక్ష్యాన్ని కలిగి ఉంది. ఎక్కువ వేగంతో కూడిన ఇంటర్నెట్ ప్రతిఒక చోటా ఇంకా అందుబాటులోకి రాని భారతదేశానికి వాస్తవరూపంలో డిజైన్ చేసిన వేవ్ 2.0 ఉన్నత నాణ్యత కంటెంట్‌ను అందిస్తుంది మరియు ఇతర ప్లాట్‌ఫారాల కన్నా 40% తక్కువ బ్యాండ్ విడ్త్‌ను వినియోగించుకుంటుంది. వేదాంతు సీఈఓ మరియు సహ-సంస్థాపకుడు వంశీ కృష్ణ మాట్లాడుతూ ‘‘పేటెంట్ కలిగిన మా సాంకేతికత ద్వారా అత్యుత్తుమ విద్యను విద్యార్థులకు అందించేందుకు మేము కట్టుబడి ఉన్నాము. ప్రారంభం నుంచి వేవ్‌ను 4000+ ఉపాధ్యాయులు, 70 మిలియన్ గంటల కాలం 24 మిలియన్ విద్యార్థులకు బోధించేందుకు వినియోగించుకున్నారు. ఈ విద్యార్థులు 7,300+ నగరాలు మరియు పట్టణాల నుంచి రాగా, అది భారతదేశపు మొత్తం నగరాలు మరియు పట్టణాల్లో 92%గా ఉంది. వేవ్ 2.0 ద్వారా మేము కుతూహలాన్ని పుట్టించే మరియు పూర్తి లెర్నింగ్ ప్రక్రియను మరింత లీనమయ్యేలా చేసే ఉద్దేశాన్ని కలిగి ఉన్నాము. విద్యకు సంబంధించిన సరిహద్దులను అధిగమించే ఆఫర్ ఆవిష్కరించేందుకు మరియు భారతదేశంలో విద్యా రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు ఉత్సుకతతో ఉన్నాము. భౌగోళిక హద్దులు ఏవి ఉన్నప్పటికీ, మేము దేశవ్యాప్తంగా బాలలకు పరిణామాన్ని సృష్టించే లక్ష్యాన్ని కలిగి ఉన్నాము’’ అని వివరించారు.