Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారతదేశంలో అత్యంత పెద్ద ప్రైవేటు వలయపు బ్యాంకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మరియు భారతదేశంలో అగ్రగామి ఫ్యాషన్ మరియు సౌందర్య ఉత్పత్తుల విక్రయ గమ్యస్థానం షాపర్స్ స్టాప్ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డుల విడుదలకు చేతులు కలిపాయి. ఈ క్రెడిట్ కార్డులను హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వినియోగదారులతో 9 మిలియన్లకు పైగా షాపర్స్ స్టాప్ ‘ఫస్ట్ సిటిజన్’ వినియోగదారులకు అందుబాటులోకి వస్తుండగా, మెరుగైన మరియు రివార్డులను అందించే షాపింగ్ అనుభవాన్ని అందించే దిశలో బ్యాంకు నిరంతరం చేస్తున్న ప్రయత్నాల్లో ఇది ఒకటి. ఈ భాగస్వామ్యం భారతదేశంలో అగ్రగామి క్రెడిట్ కార్డుల వితరకునిగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు సామర్థ్యాలతో అలాగే షాపర్స్ స్టాప్ ప్రతిష్ఠిత రిటెయిల్ బ్రాండ్‌గా గుర్తింపు దక్కించుకుంది. ఈ కార్డుల విడుదల గురించి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు పేమెంట్ బిజినెస్, కన్సూమర్ ఫైనాన్స్, టెక్నాలజీ అండ్ డిజిటల్ బ్యాంకింగ్ కంట్రీ హెడ్ పరాగ్ రావు మరియు షాపర్స్ స్టాప్ కస్టమర్ కేర్ అసోసియేట్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ వేణు నాయర్ ముంబయిలో ప్రకటించారు.
వీటి విడుదల సందర్భంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు పేమెంట్ బిజినెస్, కన్సూమర్ ఫైనాన్స్, టెక్నాలజీ అండ్ డిజిటల్ బ్యాంకింగ్ కంట్రీ హెడ్ పరాగ్ రావు మాట్లాడుతూ, ‘‘భారీ స్థాయికి వెళుతున్న మా విస్తృత స్థాయి ప్రణాళికల్లో భాగంగా మేము ప్రయాణం, ఆరోగ్య సేవలు, ఫిన్‌టెక్‌లు మరియు రిటెయిల్‌కు సంబంధించిన పలు సంస్థల భాగస్వామ్యం ద్వారా ఈ వర్గంలో అత్యుత్తమ చెల్లింపు పరిష్కారాలను అందించేందుకు ఉత్సుకతతో ఉన్నాము. షాపర్స్ స్టాప్ భారతదేశంలో పలు దశాబ్దాల నుంచి ఇంటింటికికీ సుపరిచితమైన పేరుగా ఉంది మరియు అటువంటి విశ్వనీయత కలిగిన బ్రాండ్‌తో భాగస్వామ్యానికి చాలా సంతోషిస్తున్నాము. మా భాగస్వమ్యం వారి వినియోగదారులకు అత్యంత రివార్డింగ్ షాపింగ్ అనుభవాన్ని పొందేందుకు ప్రత్యేక అవసరాలను అందించేందుకు సంసిద్ధం చేస్తుంది. భారతదేశపు అగ్రగామి క్రెడిట్ కార్డుల పంపిణీదారుగా మేము దేశ వ్యాప్తంగా కార్డులు మరియు డిజిటల్ చెల్లింపులను అలవర్చుకోవడాన్ని వృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నాము. దీనితో ఈ వర్గంలో మా నాయకత్వాన్ని మరో సారి నిరూపించుకుంటున్నాము’’ అని వివరించారు.
‘‘భారతదేశంలో అత్యంత సదృఢమైన మరియు అందరికీ ప్రియమైన ఆర్థిక సంస్థతో భాగస్వామ్యానికి మేము చాలా సంతోషిస్తున్నాము’’ అని షాపర్స్ స్టాప్ కస్టమర్ కేర్ అసోసియేట్, మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ వేణు నాయర్ తెలిపారు. ‘‘హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకుతో మా కో-బ్రాండెడ్ కార్డులు మా ఫస్ట్ సిటిజన్స్‌కు సరిసాటిలని అనుకూలతలను తీసుకు వస్తాయి. అవి రాయితీలను పొందేందుకు మరియు బ్యాంకు అందించే ఆఫర్లను అందుకునేందుకు మా స్టోర్లలో పాయింట్లను రిడీమ్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. ఇది మా వినియోగదారులు, షాపర్స్ స్టాప్ మరియు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకుకు విన్-విన్ సందర్భంగా ఉంటుంది’’ అని పేర్కొన్నారు.
ఈ క్రెడిట్ కార్డులు రెండు విభాగాల్లో లభిస్తాయి. షాపర్స్ స్టాప్ హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డ్ మరియు షాపర్స్ స్టాప్ బ్లాక్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డు, రివార్డ్ పాయింట్లు కార్డులకు అనుగుణంగా ఉంటాయి. బ్లాక్ కార్డు ఎక్కువ లాయల్టీ పాయింట్లను ఇస్తుంది. వినియోగదారులు షాపర్స్ స్టాప్ ఇన్‌స్టోర్, ఆన్లైన్ లేదా భారతరదేశంలో వారి భాగస్వామి ఎస్టీ లాడర్ గ్రూపు స్టోర్లలో కొనుగోలు చేసుకునే సమయంలో వారి పాయింట్లను రిడీమ్ చేసుకోవచ్చు.
షాపర్స్ స్టాప్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డు ప్రయోజనాలు:
ఇది షాపర్స్ స్టాప్ ప్రత్యేకతల్లో ప్రైవేటు బ్రాండ్లపై ఖర్చు చేసిన ప్రతి రూ.150కు 6 షాపర్స్ స్టాప్ ఫస్ట్ సిటిజన్ పాయింట్స్ (SSP) అందిస్తుండగా, ప్రతి నెలా 500 ఎస్‌ఎస్‌పికి పరిమితం చేసింది.
షాపర్స్ స్టాప్‌లో ఇతర బ్రాండ్లపై ఖర్చు చేసిన ప్రతి రూ.150కు 2 ఎస్ఎస్పి మరియు బయట (ఇంధనం మరియు వ్యాలెట్ మినహాయించి) ఎటువంటి పరిమితి ఉండదు.
వార్షిక మైలురాళ్ల అనుకూలతల్లో ప్రతి ఏటా రూ.2 లక్షలు ఖర్చు చేస్తే, 2000 ఎస్ఎస్పి, నెలకు రూ.250 వరకు భారతదేశ వ్యాప్తంగా అన్ని ఫ్యూయల్ స్టేషన్లలో 1శాతం ఫ్యూయల్ సర్ ఛార్జ్ మాఫీ
భారతదేశ వ్యాప్తంగా అన్ని ఫ్యూయల్ స్టేషన్లలో నెలకు రూ.250 పరిమితితో 1% ఫ్యూయల్ సర్ఛార్జ్ మాఫీ
కార్డుదారులు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ప్లాట్ఫారం మరియు పోర్ట్‌ఫోలియో వినియోగించి పేజాప్ మరియు స్మార్ట్ బై ద్వారా ఉన్నతీకరించిన పొదుపు మరియు అనుకూలతను ఆస్వాదించవచ్చు.
షాపర్స్ స్టాప్ బ్లాక్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డు ప్రయోజనాలు:
సభ్యులు రూ.4,500 విలువైన ఉచిత షాపర్స్ స్టాప్ ఫస్ట్ సిటిజన్ బ్లాక్ సభ్యత్వం పొందేవారు షాపర్స్ స్టాప్‌లో ప్రైవేట్ బ్రాండ్లపై ఖర్చు చేసిన ప్రతి రూ.150కు 20 ఎస్ఎస్పి మరియు ప్రీమియం బ్రాండ్లతో కలిపి అన్ని ఇతర బ్రాండ్లపై ఖర్చు చేసిన రూ.500కు 15 ఎస్ఎస్పి పొందుతారు.
వారు ఇతర ఖర్చులకు ఎటువంటి పరిమితి లేకుండా ప్రతి రూ.150కు 5 ఎస్ఎస్పి పొందుతారు (ఇంధనం మరియు వ్యాలెట్ మినహాయించి)
భారతదేశ వ్యాప్తంగా అన్ని ఫ్యూయల్ స్టేషన్లలో 1% ఫ్యూయల్ సర్ఛార్జ్ ప్రతి నెలకు రూ.500 పరిమితితో..
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ప్లాట్ఫారం మరియు పోర్ట్‌ఫోలియో ఆఫర్లకు పేజాప్ మరియు స్మార్ట్‌బై ద్వారా వద్ధి చేసిన పొదుపు మరియు అనుకూలతలను ఆస్వాదించండి.
భారతదేశవ్యాప్తంగా 1,000కు పైగా ఎక్కువ విమానాశ్రయాల లాంజ్లలో ప్రవేశం.
రూ.3 కోటి విలువైన ప్రమాద బీమా రక్షణ. రూ.9 లక్షల వరకు కార్డు నష్టం బాధ్యత మరియు రూ.50 లక్షల వరకు అత్యవసర విదేశీ ఆసుప్రతిలో చికిత్స రక్షణ సరికొత్త ఆఫర్ మరియు గరిష్ఠ ప్రయోజనాలు పొందేందుకు సిద్ధం కండి.