Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : నిబవ్ హోమ్ లిఫ్ట్స్ తమ ఎక్స్పీరియన్స్ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించింది. దీనిని అంచూరీ డిజైన్ వరల్డ్ ఫౌండర్ ; ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటీరియర్ డిజైన్ (ఐఐఐడీ) ఛైర్పర్సన్ రవీంద్ర అంచూరి ప్రారంభించారు. వినియోగదారులు ఇప్పుడు ఈ లిఫ్ట్‌ల ఫీచర్లను పరిశీలించడంతో పాటుగా పూర్తి సమగ్రమైన రీతిలో చుట్టు పక్కల ప్రాంతాలను గ్లాస్ డిస్ప్లే ద్వారా వీక్షించి తమ ఇంటి కోసం లిఫ్ట్‌ను ఎంచుకోవచ్చు. ఈ ఎక్స్పీరియన్స్ కేంద్రం తెలంగాణా రాష్ట్రం, హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ వద్ద ఉంది. ఇక్కడ అత్యుత్తమ నిబవ్ సిరీస్ 2 మోడల్స్ ప్రదర్శిస్తారు. కంపెనీ అధికార ప్రతినిధి మాట్లాడుతూ ‘‘అత్యాధునిక సాంకేతికతలు అత్యద్భుతమైన ఇంజినీరింగ్ మరియు సరళీకృత జీవనంతో మిళితమైనవి నిబవ్ లిఫ్ట్‌లు’’ అని అన్నారు. భారతదేశంలో వినియోగదారుల కోసం ఎక్స్పీరియన్స్ కేంద్రాన్ని ప్రారంభించిన మొట్టమొదటి కంపెనీ నిబవ్ హోమ్ ఎలివేటర్స్. ఈ లిఫ్ట్‌లను వినియోగదారులను అత్యంత అందుబాటు ధరలో తీర్చే రీతిలో డిజైన్ చేశారు. వీటి యొక్క అత్యంత అందమైన గ్లాస్ వ్యూతో ఆకర్షణీయంగా ఉంటాయి. యూరోపియన్ భద్రతా ప్రమాణాలను అందుకున్న ఒకే లిఫ్ట్ నిబవ్ హోమ్ లిఫ్ట్స్గా చెప్పబడుతున్నవి. ఈ సందర్భంగా నిబవ్ లిఫ్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ గ్లోబల్ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ థనుమాలయ పెరుమాల్ మాట్లాడుతూ ‘‘ఓ బ్రాండ్‌గా, నిబవ్ లిఫ్ట్స్ ఎప్పుడూ కూడా డిజైన్ మరియు ఎగ్జిక్యూషన్ పరంగా ఆవిష్కరణలకు సుప్రసిద్ధి. ప్రతి గృహ కొనుగొలుదారునికీ అత్యుత్తమ పరిష్కారాన్ని అందించడానికి మేము ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాము. ఈ ఎక్స్పీరియన్స్ కేంద్రం ఆ దిశగా మరో ముందడుగు. ‘మీరు మొట్టమొదటిసారిగా అనిపించినట్లుగా చివరిసారి ఏదైనా ఎప్పుడు చేశారు’– నిబవ్తో మేము ఒడిసిపట్టుకున్న స్ఫూర్తి ఇది. అంతర్జాతీయంగా పలు ప్రాంతాలలో మా వ్యాపారాలు విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అని అన్నారు.