Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : హోమ్ అప్లయెన్సస్, కన్స్యూమర్ ఎలకా్ట్రనిక్స్ విభాగంలో అంతర్జాతీయంగా అగ్రగామిగా వెలుగొందుతున్న, మేజర్ అప్లయెన్సస్ విభాగంలో గత 13 సంవత్సరాలుగా నెంబర్ 1 గా వెలుగొందుతున్న హైయర్ నేడు తమ విప్లవాత్మక 2022 శ్రేణి ఆకర్షణీయమైన కూల్ ఎయిర్ కండీషనర్స్‌ను విడుదల చేసింది. ఇవి సమర్ధవంతంగా గాలి కాలుష్య కారకాలను తొలగించడంతో పాటుగా గదిలో ఉష్ణోగ్రతలను చల్లబరుస్తాయి. హైయర్ యొక్క ప్రతిష్టాత్మకమైన ఫ్రాస్ట్ సెల్ఫ్ క్లీన్ టెక్నాలజీ కలిగిన ఈ ఎలగెంట్ కూల్ ఎయిర్ కండీషనర్స్‌ను మీ గదిలో గాలిని 99.9% వరకూ తటస్ధీకరించే రీతిలో తీర్చిదిద్దారు. ఈ నూతనశ్రేణి ఏసీలు అత్యధిక ఐఎస్‌ఈఈఆర్ 5జ40 తో వస్తాయి. ఇవి అత్యుత్తమ 5 స్టార్ ఏసీలతో పోలిస్తే అత్యుత్తమంగా విద్యుత్‌ను ఆదా చేస్తాయి. హైయర్ ట్రిపుల్ ఇన్వర్టర్ ప్లస్ టెక్నాలజీతో వినియోగదారులు జియో ఆప్టిమల్ ఆపరేషనల్ సామర్థ్యం వినియోగించడంతో పాటుగా అత్యుత్తమ ధరలలో వీటిని పొందగలర. హైయర్ యొక్క నూతన ఎలిగెంట్ కూల్ ఎయిర్ కండీషనర్సిరీస్ అత్యుత్తమ కూలింగ్ పరిష్కారాలను ఈ వేసవిలో నూతన ఏసీలను కొనుగోలు చేసే వినియోగదారులకు అందిస్తాయి. ఈ ఆవిష్కరణ గురించి శ్రీ సతీష్ ఎన్ఎస్, అధ్యక్షులు, హైయర్ అప్లయెన్సస్ ఇండియా మాట్లాడుతూ ‘‘హైయర్ వద్ద , మేము వినూత్నమైన సాంకేతికతలతో ఉత్పత్తులను తీర్చిదిద్దడాన్ని నమ్ముతుంటాం. ఇవి మా వినియోగదారుల జీవితాలను సరళీకృతం చేయడంతో పాటుగా మరింత సౌకర్యవంతంగా మారుస్తాయి. భారతదేశంలో అసాధారణ వాతావరణ పరిస్ధితులు ఉన్నాయి. మరీ ముఖ్యంగా వేసవిలో ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మా నూతన ఎలిగెంట్ కూల్ 5 స్టార్ ఎయిర్ కండీషనర్స్ కేవలం గరిష్ట కూలింగ్‌ను అసాధారణ ఉష్ణోగ్రతల వద్ద అందించడం మాత్రమే కాదు, ధర ల పరంగా అత్యంత అందుబాటులో లభిస్తాయి. వైట్ గూడ్స్ రంగంలో నూతన తరపు స్మార్ట్ సాంకేతికతలు తీసుకురావాలని మేము ప్రయత్నిస్తుంటాము. మా ఎలిగెంట్ కూల్ ఏసీ దీనిని మించిన రీతిలో ఉంటుంది’’ అని అన్నారు. ఆయనే మాట్లాడుతూ ‘‘మా మెరుగైన స్ధానిక ఏసీ తయారీ సామర్థ్యంతో, భారతదేశంలో ఎయిర్కండీషనర్లకు వినియోగదారుల నుంచి పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చనున్నాము’’ అని అన్నారు.
గాలి కాలుష్యం పెరుగుతుండటం, వ్యాధుల వ్యాప్తి కూడా అదే రీతిలో ఉండటంతో స్వచ్ఛమైన మరియు ఆరోగ్యవంతమైన గాలి ఇప్పుడు తప్పని సరి అయింది కానీ నేటి వాతావరణంలో అది విలాసవంతం ఏమీ కాదు. ఈ అవసరాలను దృష్టిలో పెట్టుకుని హైయర్ ఇండియా ఇప్పుడు ఫ్రాస్ట్ సెల్ఫ్ క్లీన్ టెక్నాలజీని తమ పూర్తి శ్రేణి ఇన్వర్టర్ ఎయిర్ కండీషనర్ శ్రేణిపై అందిస్తుంది. ఇది 99.9% ఎయిర్ స్టెరిలైజేషన్‌ను అందిస్తుంది. ఈ సాంకేతికతతో, వినియోగదారులు పూర్తి స్ధాయిలో ఇండోర్ వెట్వాష్ను ఒక్క బటన్ ప్రెస్‌తో పొందవచ్చు. ఒక్కసారి మీరు సెల్ఫ్ క్లీన్ ఫీచర్‌ను యాక్టివేట్ చేస్తే, ఏసీ యొక్క ఎవాపరేటర్పై ఫ్రాస్ట్ ఏర్పడుతుంది. ఇది కాయిల్‌పై ఉన్న మురికిని ఒడిసి పడుతుంది. కొంత సమయం తరుంఆత, ఈ ఫ్రాస్ట్ కరిగి పోతుంది మరియు మొత్తం మురికిని నీటి రూపంలో డ్రెయిన్ పైప్ ద్వారా బయటకు పంపుతుంది. దీనిద్వారా వినియోగదారులు వాస్తవంగా ఇండోర్ వెట్ వాష్ మరియు శ్వాసించతగిన క్లీన్ మరియు ఆరోగ్యవంతమైన గాలి పొందుతారు.
మరింత విద్యుత్ పొదుపు కోసం అత్యధిక ఐఎస్ఎస్ఈఆర్ 5.40
హైయర్ యొక్క ఆకర్షణీయమైన ఏసీలు అత్యధిక ఐఎస్‌ఈఈఆర్ 5.40 అందిస్తాయి. ఇది అత్యుత్తమ ఇంధన సామర్థ్యం మరియు పొదుపును 5 స్టార్ ఎయిర్ కండీషనర్ కంటే ఇస్తుంది.
బాహ్య ఉష్ణోగ్రతల వద్ద అసాధారణ కూలింగ్
నూతన ఎయిర్ కండీషనర్లు అత్యుత్తమ కూలింగ్ సామర్ధ్యంను 5400 వాట్స్ను ఆప్టిమ్ కూలింగ్‌ను అసాధారణ ఉష్ణోగ్రతలను 60 డిగ్రీల సెల్సియస్ వద్ద కూడా అందిస్తుంది.
ఈజీ కన్వర్టబల్ 5 ఇన్ 1
అత్యంత ఆకర్షణీయమైన 5 స్టార్ ఏసీలు 5 ఇన్ 1 ఈజీ కన్వర్టబల్ ఫీచర్, వినియోగదారులు ఏసీ టనేజ్ సామర్ధ్యంను 1.6 టన్ నుంచి 0.8 టన్ కు మార్చవచ్చు. ఈ వినూత్నమైన ఫీచర్‌ను ఎకో బటన్ రిమోట్‌ను ప్రెస్ చేయడంతో పొందవచ్చు. ఇది వినియోగదారుల తమ ఏసీ టనేజ్ను తమ వినియోగదారుల అవసరాలకనుగుణంగా పొందవచ్చు.
ట్రిపుల్ ఇన్వర్టర్ ప్లస్
ఈ సాంకేతికత గరిష్టంగా 65% వరకూ విద్యుత్‌ను ఆదా చేయగలరు. సంప్రదాయ ఇన్వర్టర్ టెక్నాలజీ తో పోలిస్తే హైయర్ ట్రిపుల్ ఇన్వర్టర్ ప్లస్ టీఎల్ఎఫ్ఎం ఇన్వర్టర్ కంట్రోల్‌ను నియంత్రించడంతో పాటుగా పీఐడీ ఇన్వర్టర్కంట్రోల్, ఏ–పామ్ ఇన్వర్టర్ కంట్రోల్ ను కలిగి ఉండటం వల్ల గరిష్ట సౌకర్యం, విశ్వసనీయత, సామర్థ్యంతో అందిస్తుంది.
భారతీయ వినియోగదారులు కోసం సృజనాత్మక ఉత్పత్తులను ఉత్పత్తి చేయడానికి హైయర్ ఇండియా కట్టుబడి ఉంది. ఈ బ్రాండ్ స్ధిరంగా వినియోగదారుల డిమాండ్స్‌ను తీర్చడంతో పాటుగా జీవితానికి స్ఫూర్తిని అందిస్తుంది. హైయర్ యొక్క ఎలిగెంట్ కూల్ ఏసీలు పూనెలోని రంజన్గావ్లు పారిశ్రామిక పార్కు వద్ద తయారుచేస్తున్నారు. ఈ తయారీ సామర్ధ్యం మరింతగా అభివృద్ధి చెందడంతో పాటుగా అత్యున్నత శ్రేణి ఉత్పత్తులైన వాషింగ్మెషీన్స్, అత్యుత్తమ స్ధాయి బాటమ్ , టాప్ మౌంట్ రిఫ్రిజిరేటర్లు, లార్జ్ స్ర్కీన్ ఆండ్రాయిడ్ ఎల్ఈడీలు మరియు ఇన్వర్టర్ ఎయిర్ కండీషనర్లను తయారుచేస్తుంది.
హైయర్ తమ ఎలగెంట్ కూల్ ఎయిర్ కండీషనర్ శ్రేణిలో 10 నూతన మోడల్స్ విడుదల చేసింది. ఇది భారత దేశ వ్యాప్తంగా 33,990 రూపాయల నుంచి 79,990 రూపాయల వరకూ లభ్యమవుతుంది. అంతేకాదు, ఈ నూతన ఎయిర్ కండీషనర్స్ కంప్రెషర్స్ 12 సంవత్సరాల వారెంటీతో పాటుగా 5 సంవత్సరాల సమగ్రమైన వారెంటీతో వస్తుంది.
ఈ వేసవిలో హైయర్ ఎయిర్ కండీషనర్లను కొనుగోలు చేసే వినియోగదారులు అత్యంత ఆకర్షణీయమైన రీతిలో 12.5% క్యాష్‌బ్యాక్ లేదా 3500 రూపాయల వరకూ పొందవచ్చు. ఈఎంఐ అవకాశాలు అతి తక్కువగా 2022 రూపాయల నుంచి లభ్యమవుతాయి.