Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : నోటి సంరక్షణలో మార్కెట్ అగ్రగామి కోల్గేట్-పామోలివ్ ఇండియా, మామూలు టూత్ బ్రష్‌ల కంటే గణనీయంగా మెరుగైన శుభ్రతనిచ్చే సోనిక్ టెక్నాలజీ ఆధారిత ఎలెక్ట్రిక్ టూత్‌బ్రష్‌లను పరిచయం చేసింది. కోల్గేట్ ప్రోక్లినికల్ ఎలెక్ట్రిక్ టూత్‌బ్రష్‌లు శుభ్రం చేయడానికి కఠినంగా ఉండే పాచిని మరియు దుర్వాసన కలిగించే బ్యాక్టీరియాను తొలగిస్తాయి. సొగసైన మరియు ఆధునిక డిజైన్‌లో వస్తున్న ఈ అధునాతన శ్రేణి తేలిక బరువు ఉంటుంది మరియు దీనితో ప్రయాణించడానికి సౌకర్యంగా ఉంటుంది. కోల్గేట్ విభిన్నమైన ఫీచర్లతో 3 వేరియంట్ల ప్రోక్లినికల్ ఎలెక్ట్రిక్ టూత్‌బ్రష్‌లను ఆవిష్కరించింది, ఇవన్నీ ప్రముఖ ఇ-కామర్స్ వేదికలు (అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మొ.) మరియు ఆన్లైన్ షాప్ cpbrush.co.in పైన లభిస్తాయి. సర్వశ్రేష్టమైన క్లీనింగ్ అనుభవం కోసం, కోల్గేట్ ప్రోక్లినికల్ 150 బ్యాటరీ-శక్తి పొందిన ఎలెక్ట్రిక్ టూత్‌బ్రష్‌లు విశిష్టమైన, బహుముఖ దిశల స్ట్రోక్‌లతో సమ్మిళితమై ఉంటాయి. దీని మెత్తని, పలుచని మొన కలిగిన కుచ్చులు చిగుళ్ళపై సుతారంగా ఉంటూనే, చేరుకోవడానికి కష్టంగా ఉండే చోట్లను శుభ్రం చేయడానికై సోనిక్ ప్రకంపనలను (20,000 స్ట్రోక్‌లు/నిముషానికి) అందిస్తాయి.
దీని విశిష్టమైన స్పైరల్ పాలిషింగ్ కుచ్చులతో, కోల్గేట్ ప్రోక్లినికల్ 250R రీఛార్జబుల్ బ్రష్‌లు శక్తివంతమైన అయినా సుతారమైన దంత శుభ్రతను అందజేస్తాయి. సోనిక్ టెక్నాలజీ (30,000 స్ట్రోక్‌లు/నిముషానికి వరకూ) తో శక్తి పొందిన దీని చిన్న హెడ్, ఒక రెండు-నిముషాల టైమర్ మరియు ఒక ఎల్ఈడీ ఛార్జ్ ఇండికేటరును కలిగి ఉంటుంది.
150 బ్యాటరీ-శక్తి పొందిన ఎలెక్ట్రిక్ టూత్‌బ్రష్ రెండు రకాలుగా వస్తుంది—డీప్ క్లీన్ మరియు చార్కోల్, మరియు 250R రీఛార్జబుల్ టూత్ బ్రష్ మూడు రకాలలో లభిస్తుంది—డీప్ క్లీన్, చార్కోల్ మరియు వైటెనింగ్. ఈ రెండు వేరియంట్లు పాచిని శుభ్రం చేయడంలో చేతి టూత్‌బ్రష్ కంటే 5 రెట్లు మెరుగైన శుభ్రతను ఇవ్వడానికి సహాయపడతాయి.
కోల్గేట్ ప్రోక్లినికల్ 500R ఎలెక్ట్రిక్ టూత్‌బ్రష్‌లు సోనిక్ టెక్నాలజీచే నడపబడే ఒక సొగసైన, చక్కని డిజైన్ తో ప్యాక్ చేయబడి ఉంటాయి. ఇది రెండు బ్రషింగ్ రూపాలను పెంపొందిస్తుంది: రోజువారీ శుభ్రత (30,000 స్ట్రోక్‌లు/ నిముషానికి) మరియు సుతారమైన శుభ్రత (20,000 స్ట్రోక్‌లు/ నిముషానికి). ఇది రెండు రకాలలో వస్తుంది—వైటెనింగ్ మరియు సెన్సిటివ్, ఈ రెండూ మీరు బ్రష్ చేస్తుండగా మీ చిగుళ్ళను సుతారంగా మర్దన చేసే మెత్తని కుచ్చులను కలిగి ఉంటాయి. ఇది ఒక ఛార్జర్ మరియు ట్రావెల్ కేస్‌తో వస్తుంది.
ఎలెక్ట్ఱిక్ టూత్‌బ్రష్‌ల విభాగముపై వ్యాఖ్యానిస్తూ, కోల్గేట్-పామోలివ్ (ఇండియా) లిమిటెడ్ వారి మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ అరవింగ్ చింతామణి గారు, “మా వినియోగదారులకు అత్యంత అధునాతనమైన నోటి సంరక్షణ ఆవిష్కరణను తీసుకురావడానికి కోల్గేట్ కట్టుబడి ఉంది. కోల్గేట్ యొక్క ఎలెక్ట్రిక్ టూత్‌బ్రష్‌లు ప్రపంచములోనే అత్యంత అధునాతనమైన క్లీనింగ్ టెక్నాలజీని కలిగి ఉన్నాయి. మా ఎలెక్ట్రిక్ టూత్‌బ్రష్‌ల యొక్క ప్రోక్లినికల్ శ్రేణి సర్వశ్రేష్టమైన నోటి ఆరోగ్యాన్ని అందించడమే కాకుండా, అవి ఎప్పుడూ లేని అత్యంత చక్కనైన మరియు అద్భుతమైన బ్రషింగ్ అనుభవాన్ని అందిస్తాయి!” అన్నారు.
ఎలెక్ట్రిక్ టూత్‌బ్రష్‌లు కొనుగోలు కోసం ఆన్లైన్ మరియు దుకాణాలలో లభ్యం అవుతున్నాయి. మరింత సమాచారము కొరకై, దయచేసి సందర్శించండి https://www.cpbrush.co.in/collections/electric-toothbrush