Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారతదేశంలో అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫామ్స్‌లో ఒకటిగా నిలిచిన అప్‌స్టాక్స్ (ఆర్కెఎస్వీ సెక్యూరిటీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌గా సుపరిచితం) నేడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 క్యాంపెయిన్ ‘ఓన్ యువర్ ఫ్యూచర్’(మీ భవిష్యత్‌ను సొంతం చేసుకోండి)ను ప్రారంభించింది. ఈ ప్రచారం ద్వారా దేశంలో యువతను ఈక్విటీ మార్కెట్లలో పాల్గొనాల్సిందిగా ప్రోత్సహిస్తున్నారు. అప్‌స్టాక్స్ కో–ఫౌండర్ కవితా సుబ్రమణియన్ మాట్లాడుతూ ‘‘మీ భవిష్యత్‌ను సొంతం చేసుకోండి ప్రచారం ద్వారా మరింత మంది భారతీయులను ఈక్విటీమార్కెట్లలో పాల్గొనాల్సిందిగా ప్రోత్సహిస్తూనే అప్‌స్టాక్స్ ద్వారా సరైన పెట్టుబడి ఎంపికలను చేసుకోమని వెల్లడిస్తున్నాం. యువ భారతం నేడు సొంత ఆస్తులను కూడబెట్టుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తిస్తున్నారు. స్టార్టప్ సంస్కృతి గణనీయంగా పెరిగింది. ప్రతి ఒక్కరూ వ్యాపారవేత్త కాలేరు కానీ, ఓ కంపెనీ షేర్ల ఈక్విటీ షేర్లను కొనడం ద్వారా భాగస్వామి కావొచ్చు. ఐపీఎల్ ఏవిధంగా అయితే క్రికెట్‌ను పునర్నిర్వచిస్తుందో అదే రీతిలో అప్‌స్టాక్స్ తమ వినియోగదారుల కోసం పెట్టుబడులను పునర్నిర్వచించనుంది. ఇయర్ ఆన్ ఇయర్ మూడు రెట్ల వృద్ధి నమోదు చేస్తున్న మేము అదే తరహా వృద్దిని ఇప్పుడు కూడా ఆశిస్తున్నాం’’ అని అన్నారు.