Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : గృహోపకరణాల సంస్థ హయ్యర్ కొత్తగా 5స్టార్ ఇంధన పొదుపు, సెల్ఫ్ క్లీన్ సాంకేతికతతో ఆకర్షణీయమైన కూల్ ఎసి సిరీస్‌ను ఆవిష్కరించినట్లు వెల్లడించింది. ఈ ఎయిర్ కండీషనర్ అత్యుత్తమంగా ఐఎస్ఇఇఆర్ 5.40 అందిస్తుందని పేర్కొంది. దీన్ని ట్రిపుల్ ఇన్వర్టర్ ప్లస్ సాంకేతికతతో తీసుకురావడంతో ద్వారా విద్యుత్‌ను ఆదా చేయనుందని తెలిపింది. ఇందులో 10 మోడల్స్ ఉంటాయని.. వీటి ధరల శ్రేణీ రూ.33,990- 79,990గా నిర్ణయించినట్లు వెల్లడించింది.